మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కలకలం రేపిన ఎంబీఏ విద్యార్థిని హత్య కేసులో నిందితుడు పీయూష్ ధామ్నోడియా నోరు విప్పాడు. పోలీసుల విచారణలో అతను చెప్పిన విషయాలు వింటుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. ప్రేమ, పెళ్లి, అనుమానం.. ఈ మూడింటి చుట్టూ తిరిగిన ఈ కథ చివరకు ఒక యువతి ప్రాణం తీయడమే కాకుండా, మరణం తర్వాత కూడా ఆమెకు అవమానాన్నే మిగిల్చింది.
గదిలోనే రహస్యంగా ఏడు అడుగులు

మందసౌర్‌కు చెందిన పీయూష్, బాధితురాలు ఒకే కాలేజీలో ఎంబీఏ చదువుతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పీయూష్ ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో జనవరిలో తన రూమ్‌లోనే ఆమె మెడలో మంగళసూత్రం కట్టి, రహస్యంగా ఏడు అడుగులు వేసినట్లు పీయూష్ పోలీసులకు తెలిపాడు. అయితే, "ఈ రహస్య పెళ్లి నాకు వద్దు, అందరి ముందూ నన్ను భార్యగా అంగీకరించు" అని బాధితురాలు పట్టుబట్టడంతో వీరి మధ్య ఘర్షణ మొదలైంది.
ఫోన్ హ్యాక్ చేసి.. అనుమానంతో రగిలిపోయి..
పెళ్లి గొడవ ఒకవైపు ఉండగానే, ఆమె ప్రవర్తనపై పీయూష్‌కు అనుమానం పెరిగింది. ఆమె ఇతర యువకులతో చాటింగ్ చేస్తోందని నమ్మిన పీయూష్, ఏకంగా ఆమె ఫోన్‌ను హ్యాక్ చేశాడు. డేటింగ్ యాప్స్‌లో ఆమె ఇతరులతో మాట్లాడుతోందని తెలుసుకుని కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెను అంతం చేయాలని పథకం పన్నాడు.
ఆటలో ప్రాణం తీసి.. ఆపై పైశాచికం
ఫిబ్రవరి 10న నిందితుడు పీయూష్ బాధితురాలిని తన గదికి పిలిపించాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినా, తరువాత శారీరకంగా కలిశాడు. కాసేపటికి "సరదాగా ఆట ఆడదాం" అంటూ నమ్మించి ఆమె చేతులు, కాళ్లు కట్టేశాడు. ఆమె తేరుకునే లోపే చాతిపై కూర్చుని గొంతు నులిమి చంపేశాడు. ఆమె ప్రాణం పోయిందని నిర్ధారించుకోవడానికి చాకుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. అత్యంత దారుణమైన విషయం ఏంటంటే.. ఆమె మరణించిన తర్వాత కూడా ఆ శవంపై పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్లు నిందితుడు స్వయంగా అంగీకరించాడు.
ఆత్మను పిలిచేందుకు క్షుద్ర పూజలు
హత్య తర్వాత పీయూష్ ముంబై పారిపోయాడు. అక్కడ నాలాసోపారా ప్రాంతంలో ఉంటూ బాధితురాలి ఆత్మను పిలిచేందుకు యూట్యూబ్ చూస్తూ క్షుద్ర పూజలు చేసినట్లు వెల్లడైంది. ఆమె ఫోటో ముందు పువ్వులు, మిఠాయిలు, పసుపు, కుంకుమ ఉంచి మంత్రతంత్రాలు జరిపాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలని కూడా ప్రయత్నించాడు.
{{/usCountry}}హత్య తర్వాత పీయూష్ ముంబై పారిపోయాడు. అక్కడ నాలాసోపారా ప్రాంతంలో ఉంటూ బాధితురాలి ఆత్మను పిలిచేందుకు యూట్యూబ్ చూస్తూ క్షుద్ర పూజలు చేసినట్లు వెల్లడైంది. ఆమె ఫోటో ముందు పువ్వులు, మిఠాయిలు, పసుపు, కుంకుమ ఉంచి మంత్రతంత్రాలు జరిపాడు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అక్కడే ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలని కూడా ప్రయత్నించాడు.
{{/usCountry}}"హత్య చేసిన తర్వాత నేను కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ముంబైలో వంతెన పైనుంచి దూకాలని చూశాను కానీ ధైర్యం సరిపోలేదు" అని నిందితుడు పోలీసుల ఎదుట చెప్పాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన మొబైల్ ఫోన్ రికవరీ కోసం ముంబై తరలించారు.