భారత ఐటీ రంగానికి చెందిన ప్రముఖ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) 2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి (Q1FY27) సంబంధించిన ఆర్థిక ఫలితాలను జూలై 23న విడుదల చేసింది. కంపెనీ ఏకీకృత నికర లాభం (Consolidated Net Profit) గతేడాది ఇదే త్రైమాసికంతో (YoY) పోలిస్తే 12.3 శాతం పెరిగి రూ. 7,769 కోట్లకు చేరింది. 2025-26 ఆర్థిక సంవత్సరం క్యూ1లో కంపెనీ రూ. 6,921 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
అయితే, మునుపటి త్రైమాసికంతో (Q4FY26) పోలిస్తే (QoQ) కంపెనీ నికర లాభంలో 8.6 శాతం క్షీణత నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ. 8,501 కోట్ల లాభాన్ని సాధించింది.
ఆపరేషన్స్ రాబడి రూ. 48,211 కోట్లు
క్యూ1FY27 కాలానికి కంపెనీ ఆపరేషన్స్ ద్వారా వచ్చిన ఆదాయం (Revenue from operations) రూ. 48,211 కోట్లకు చేరింది. ఇది గతేడాది ఇదే సమయానికి నమోదైన రూ. 42,279 కోట్లతో పోలిస్తే 14 శాతం వృద్ధిని, అలాగే క్రితం త్రైమాసికం (రూ. 46,402 కోట్లు)తో పోలిస్తే 3.9 శాతం వృద్ధిని సూచిస్తోంది.
కొత్త సీఈఓగా ఆశిష్ కుమార్ దాస్ నియామకం
ఫలితాల ప్రకటనతో పాటు ఇన్ఫోసిస్ ఒక కీలకమైన నాయకత్వ మార్పును కూడా ప్రకటించింది. కంపెనీ తదుపరి సీఈఓ డెజిగ్నేట్ (CEO Designate) గా ఆశిష్ కుమార్ దాస్ ఎంపికయ్యారు. ఆయన ఏప్రిల్ 1, 2027 నుంచి ఐదేళ్ల కాలపరిమితి కోసం ఇన్ఫోసిస్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ (MD) గా బాధ్యతలు స్వీకరిస్తారు.
ప్రస్తుత సీఈఓ సలీల్ పరేఖ్ మార్చి 31, 2027 వరకు తన పదవిలో కొనసాగుతారని, సీఈఓ బాధ్యతల బదిలీ సజావుగా సాగేందుకు ఆయన ఆశిష్‌తో కలిసి పనిచేస్తారని కంపెనీ వెల్లడించింది.
"మా పరిశ్రమ ప్రస్తుతం అనేక మార్పులకు లోనవుతున్న తరుణంలో, ఆశిష్ కుమార్ దాస్‌ను కొత్త సీఈఓ డెసిగ్నేట్గా ప్రకటించడం ఎంతో సంతోషకరంగా ఉంది. వినూత్న మార్పులు తీసుకురావడంతో పాటు కంపెనీ మూలాలు, కస్టమర్ల నమ్మకాన్ని కాపాడే సమర్థవంతమైన అంతర్గత నాయకుడు మాకు దొరికారు. ఇన్ఫోసిస్ పురోగతిలో, డిజిటల్, AI వ్యూహాలను రూపొందించడంలో సలీల్ పరేఖ్ అందించిన సేవలు అద్భుతమైనవి" అని ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకణి వ్యాఖ్యానించారు.
{{/usCountry}}"మా పరిశ్రమ ప్రస్తుతం అనేక మార్పులకు లోనవుతున్న తరుణంలో, ఆశిష్ కుమార్ దాస్‌ను కొత్త సీఈఓ డెసిగ్నేట్గా ప్రకటించడం ఎంతో సంతోషకరంగా ఉంది. వినూత్న మార్పులు తీసుకురావడంతో పాటు కంపెనీ మూలాలు, కస్టమర్ల నమ్మకాన్ని కాపాడే సమర్థవంతమైన అంతర్గత నాయకుడు మాకు దొరికారు. ఇన్ఫోసిస్ పురోగతిలో, డిజిటల్, AI వ్యూహాలను రూపొందించడంలో సలీల్ పరేఖ్ అందించిన సేవలు అద్భుతమైనవి" అని ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకణి వ్యాఖ్యానించారు.
{{/usCountry}}