దేశీయ ఐటీ రంగ దిగ్గజం ఇన్ఫోసిస్ నైపుణ్యాన్ని నిరూపించుకుంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27) రెండో త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను సాధించింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (Q2FY27) కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 6.23 శాతం పెరిగి రూ.7,823 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.7,364 కోట్లతో పోలిస్తే ఇది మెరుగైన వృద్ధి.

ఇదే సమయంలో కంపెనీ ఆపరేషనల్ రంగా ద్వారా వచ్చిన నికర రాబడి కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది క్యూ2లో వచ్చిన రూ.44,490 కోట్లతో పోలిస్తే, ఈసారి 10.68 శాతం వృద్ధితో రూ.49,244 కోట్లకు చేరింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర నష్టాల ఒత్తిడి ఉన్నప్పటికీ, ఐటీ దిగ్గజం షేరు ధర శుక్రవారం లాభాలతోనే ముగియడం విశేషం.
షేరుకు రూ.26 మధ్యంతర డివిడెండ్
ఫలితాల వెల్లడి సందర్భంగా ఇన్ఫోసిస్ యాజమాన్యం తమ వాటాదారులకు శుభవార్త అందించింది. రూ.5 ముఖ విలువ కలిగిన ప్రతి ఈక్విటీ షేరుపై రూ.26 (500 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను బోర్డు ఆమోదించింది.
డివిడెండ్ పొందడానికి అర్హులైన వాటాదారులను నిర్ణయించే రికార్డు తేదీని నవంబర్ 3గా ఖరారు చేస్తూ బీఎస్ఈకి సమర్పించిన నివేదికలో పేర్కొంది. అర్హులైన పెట్టుబడిదారుల ఖాతాల్లోకి నవంబర్ 11 నాటికి ఈ డివిడెండ్ సొమ్ము జమవుతుంది.
కొత్త డీళ్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జోరు
క్యూ2లో ఇన్ఫోసిస్ సాధించిన కీలక విజయాలను పరిశీలిస్తే, కాన్స్టెంట్ కరెన్సీ (CC) ప్రాతిపదికన కంపెనీ ఆదాయం త్రైమాసిక ప్రాతిపదికన 1.2 శాతం, వార్షికంగా 1.5 శాతం వృద్ధి నమోదు చేసింది. ఐటీ రంగానికి అత్యంత కీలకమైన ఆపరేటింగ్ మార్జిన్ 21 శాతంగా స్థిరంగా కొనసాగింది. రూపీ టర్మ్స్‌లో ఈపీఎస్ (EPS) వృద్ధి 8.7 శాతంగా నమోదైంది.
ఈ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా 5.2 బిలియన్ డాలర్ల (టిసివి) విలువైన భారీ డీళ్లను చేజిక్కించుకోగా, అందులో 62 శాతం పూర్తిగా కొత్తవి కావడం గమనార్హం.
{{/usCountry}}ఈ త్రైమాసికంలో కంపెనీ ఏకంగా 5.2 బిలియన్ డాలర్ల (టిసివి) విలువైన భారీ డీళ్లను చేజిక్కించుకోగా, అందులో 62 శాతం పూర్తిగా కొత్తవి కావడం గమనార్హం.
{{/usCountry}}ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆదాయంలో పటిష్టమైన వృద్ధి కనిపించింది. ఏఐ ఆదాయం క్రితం త్రైమాసికంతో పోలిస్తే 29 శాతం పెరిగి, మొత్తం రాబడిలో 10.5 శాతానికి చేరింది.
ఈ ఫలితాలపై ఇన్ఫోసిస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ స్పందిస్తూ.. "మేము 5.2 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీళ్లను దక్కించుకున్నాం. ఇందులో ఒకే డీల్ విలువ 2 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. కాంప్లెక్స్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రాజెక్టుల్లో క్లయింట్లకు మేము నమ్మకమైన భాగస్వామిగా ఉన్నామనడానికి ఇది నిదర్శనం. సంస్థలు భారీగా ఏఐ సాంకేతికతను స్వీకరిస్తున్న వేళ, మా ఏఐ రాబడుల్లో 29 శాతం వృద్ధి రావడం మార్కెట్లో మాకున్న ప్రత్యేక స్థానానికి, కస్టమర్ల నమ్మకానికి అద్దం పడుతోంది" అని అన్నారు.
వార్షిక మార్గదర్శకాలు (Guidance) ఖరారు
మార్కెట్లో ఉన్న అనిశ్చిత పరిస్థితుల నడుమ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (FY27) ఇన్ఫోసిస్ తన ఆదాయ వృద్ధి అంచనాలను కాన్స్టెంట్ కరెన్సీ రూపంలో 1% నుంచి 2%గా కొనసాగించింది. ఆపరేటింగ్ మార్జిన్లను 20% నుంచి 22% పరిధిలో నిర్వహించగలమని ధీమా వ్యక్తం చేసింది.
కంపెనీ వ్యయ నియంత్రణ పద్ధతులపై ఇన్ఫోసిస్ సీఎఫ్ఓ జయేష్ సంఘరాజ్కా మాట్లాడుతూ, "మార్కెట్లో తీవ్ర ఒడిదొడుకులు ఉన్నప్పటికీ, క్యూ2లో 21.0 శాతం ఆపరేటింగ్ మార్జిన్‌ను నమోదు చేశాం. అవసరమైన చోట పెట్టుబడులు పెడుతూనే, ఖర్చులు తగ్గించుకోవడం, కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచుకోవడం వల్ల మార్జిన్లు స్థిరంగా ఉన్నాయి" అని వివరించారు.