ప్రముఖ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన మూడో త్రైమాసిక (Q3) ఫలితాలను వెల్లడించింది. గురువారం స్టాక్ మార్కెట్‌కు సెలవు కావడంతో, శుక్రవారం ట్రేడింగ్ పునఃప్రారంభమైనప్పుడు ఇన్ఫోసిస్ షేర్లు హాట్ టాపిక్‌గా మారనున్నాయి. బుధవారం అమెరికాలోని ఎన్వైఎస్ఈ (NYSE)లో ఇన్ఫోసిస్ అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్స్ (ADR) ఏకంగా 10.45 శాతం పెరిగి 19.35 డాలర్ల వద్ద ముగియడం విశేషం. ఆదాయ వృద్ధిపై కంపెనీ తన అంచనాలను పెంచడమే ఇందుకు ప్రధాన కారణం.
ఫలితాల ముఖ్యాంశాలు: లాభం తగ్గింది.. కానీ

2026 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ రూ. 6,654 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గత త్రైమాసికంతో (రూ. 7,364 కోట్లు) పోలిస్తే 9.6 శాతం తక్కువ. అయితే, కంపెనీ ఆదాయం మాత్రం గత త్రైమాసికం కంటే 2.2 శాతం పెరిగి రూ. 45,479 కోట్లుగా నమోదైంది.
ముఖ్యంగా, ఇన్ఫోసిస్ తన వార్షిక రెవెన్యూ వృద్ధి గైడెన్స్‌ను 2-3 శాతం నుంచి 3.0% - 3.5% శాతానికి పెంచడం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది. ఆపరేటింగ్ మార్జిన్ అంచనాలను 20-22 శాతంగానే యథాతథంగా కొనసాగించింది.
నిపుణుల విశ్లేషణ: కొనుగోలు చేయవచ్చా?
ఇన్ఫోసిస్ పనితీరుపై ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు భిన్నమైన, కానీ సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి.
"ఇన్ఫోసిస్ రెవెన్యూ వృద్ధి బాగున్నప్పటికీ, మార్జిన్లు మా అంచనాల కంటే స్వల్పంగా తగ్గాయి. అయితే, సుమారు 4.8 బిలియన్ డాలర్ల విలువైన భారీ డీల్స్ కుదుర్చుకోవడం శుభపరిణామం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగంలో కంపెనీ దూకుడుగా ఉంది" అని ఎంబీ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ దీపేష్‌కుమార్ మెహతా విశ్లేషించారు. ఆయన ఈ స్టాక్‌కు రూ. 1,750 టార్గెట్ ధరతో 'బై' (Buy) రేటింగ్ ఇచ్చారు.
సెంట్రమ్ బ్రోకింగ్ సంస్థ సైతం ఇన్ఫోసిస్ పట్ల సానుకూలంగా ఉంది. "ప్రస్తుతం మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ, ఏఐ ఆధారిత పరివర్తనపై క్లయింట్లు ఆసక్తి చూపిస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) రంగంలో బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల దీర్ఘకాలంలో కంపెనీ స్థిరమైన వృద్ధిని సాధిస్తుంది" అని సెంట్రమ్ బ్రోకింగ్ నిపుణులు పేర్కొన్నారు. ఈ సంస్థ ఇన్ఫోసిస్ షేరు టార్గెట్ ధరను రూ. 1,951 నుంచి రూ. 2,076కు పెంచుతూ 'బై' రేటింగ్‌ను కొనసాగించింది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
{{/usCountry}}సెంట్రమ్ బ్రోకింగ్ సంస్థ సైతం ఇన్ఫోసిస్ పట్ల సానుకూలంగా ఉంది. "ప్రస్తుతం మార్కెట్లో సవాళ్లు ఉన్నప్పటికీ, ఏఐ ఆధారిత పరివర్తనపై క్లయింట్లు ఆసక్తి చూపిస్తున్నారు. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI) రంగంలో బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల దీర్ఘకాలంలో కంపెనీ స్థిరమైన వృద్ధిని సాధిస్తుంది" అని సెంట్రమ్ బ్రోకింగ్ నిపుణులు పేర్కొన్నారు. ఈ సంస్థ ఇన్ఫోసిస్ షేరు టార్గెట్ ధరను రూ. 1,951 నుంచి రూ. 2,076కు పెంచుతూ 'బై' రేటింగ్‌ను కొనసాగించింది.
ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
{{/usCountry}}బుధవారం బీఎస్ఈ (BSE)లో ఇన్ఫోసిస్ షేరు రూ. 1,599.05 వద్ద ముగిసింది. ఆదాయ వృద్ధి అంచనాలను కంపెనీ పెంచడం, భారీ కాంట్రాక్టులు దక్కించుకోవడం వంటి అంశాలు శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో షేరు ధర పెరగడానికి దోహదపడవచ్చు. అయితే, అమెరికా మార్కెట్లో వచ్చిన 10% భారీ పెరుగుదల మన మార్కెట్లోనూ అదే స్థాయిలో ప్రతిబింబిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.
(గమనిక: పైన పేర్కొన్న అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులు మరియు బ్రోకరేజ్ సంస్థలకు సంబంధించినవి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు నష్టభయంతో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం.)