...
...
Next Story

iPhone 18 pro : ఐఫోన్ 18 ప్రో లాంచ్ ఎప్పుడు? ధర ఎంత? ఫీచర్లు? పూర్తి వివరాలు..

iPhone 18 pro price speculation : యాపిల్ త్వరలోనే ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. 2ఎన్​ఎం ఏ20 ప్రో చిప్‌సెట్, వేరియబుల్ అపెర్చర్ కెమెరా, సరికొత్త డార్క్ చెర్రీ కలర్‌తో రానున్న ఈ మోడల్ లీక్డ్ ఫీచర్లు, విడుదల వివరాలు ఇవే..

Published on: Jul 31, 2026, 12:27:35 IST
Advertisement

స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాపిల్ ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 18 సిరీస్ ఆవిష్కరణకు సమయం దగ్గరపడుతోంది. కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, లీకైన వివరాలు ఐఫోన్ 18 ప్రో మోడల్‌పై టెక్ ప్రపంచంలో భారీ అంచనాలను పెంచేశాయి. ఈ స్మార్ట్​ఫోన్ డిజైన్ చూడటానికి పాత మోడల్స్‌లాగే అనిపించినా, లోపల- వెలుపల అనేక విప్లవాత్మక మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఐఫోన్ 18 ప్రో
ఐఫోన్ 18 ప్రో

టెక్ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్న ఐఫోన్ 18 ప్రోకి సంబంధించిన 5 ప్రధాన లీక్డ్ ఫీచర్లు, వివరాలు ఇవే:

1. ఆవిష్కరణ సమయం: రెండు విడతల్లో విడుదల?

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, యాపిల్ ఈసారి తన సాధారణ వ్యూహాన్ని మార్చి, లాభాలను మరింత పెంచుకునేందుకు ప్రో మోడళ్లను, సాధారణ మోడళ్లను వేర్వేరుగా విడుదల చేయనుంది. ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మాక్స్, యాపిల్ నుంచి రాబోతున్న మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌లను ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే మార్కెట్లోకి తెచ్చే అవకాశం ఉంది. ఇక బేస్ మోడల్ ఐఫోన్ 18, ఐఫోన్ ఎయిర్ 2, ఐఫోన్ 18ఈ మోడళ్లను 2027 మార్చ్​లో లాంచ్ చేయవచ్చని అంచనా.

2. చిన్నగా మారనున్న డైనమిక్ ఐలాండ్!

స్క్రీన్ పైన కనిపించే పిల్లర్ ఆకారపు 'డైనమిక్ ఐలాండ్' పరిమాణాన్ని ఈసారి గణనీయంగా తగ్గించనున్నారు. డిస్‌ప్లే గ్లాస్ కిందనే ఫేస్ ఐడీ పరికరాలను అమర్చే సరికొత్త సాంకేతికతను యాపిల్ అభివృద్ధి చేసింది. దీనివల్ల డైనమిక్ ఐలాండ్ చిన్నదై, యూజర్లకు వీడియోలు చూస్తున్నప్పుడు లేదా గేమ్‌లు ఆడుతున్నప్పుడు స్క్రీన్ మరింత పెద్దగా, స్పష్టంగా కనిపిస్తుంది.

3. అడ్వాన్స్‌డ్ 'వేరియబుల్ అపెర్చర్' కెమెరా..

పనితీరులో సరికొత్త విప్లవం తేవడానికి యాపిల్ 2-నానోమీటర్ విధానంలో తయారైన 'ఏ20 ప్రో' ప్రాసెసర్‌ను పరిచయం చేయనుంది. గతంలో 3ఎన్​ఎం చిప్‌లను వాడగా, ఇప్పుడు పరిమాణం తగ్గడం వల్ల అదే స్థలంలో ఎక్కువ ప్రాసెసింగ్ పవర్‌ను నింపడానికి వీలవుతుంది. అంతేకాకుండా, టీఎస్​ఎంసీ చెందిన ప్రసిద్ధ 'WMCM' టెక్నాలజీతో ర్యామ్, నెట్‌వర్క్ ఇంజిన్లను చిప్‌కు అత్యంత చేరువగా అమర్చి, ఫోన్ వేగాన్ని విపరీతంగా పెంచనున్నారు.

5. భారీ బ్యాటరీ, కొత్త 'డార్క్ చెర్రీ' రంగు!..

ఈ అడ్వాన్స్‌డ్ ఫీచర్లన్నింటికీ తగినంత పవర్ అందించడానికి యాపిల్ బ్యాటరీ పరిమాణాన్ని పెంచుతోంది. పెద్ద బ్యాటరీని అమర్చడం కోసం ఫోన్ మందాన్ని కాస్త పెంచినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొత్త ప్రాసెసర్, ఎల్టీపీవో+ డిస్‌ప్లేల వల్ల బ్యాటరీ లైఫ్ గతంలో కంటే చాలా ఎక్కువగా రానుంది.

ఇక రంగుల విషయానికొస్తే.. ఐఫోన్ 18 ప్రో సిల్వర్, బ్లాక్, లైట్ బ్లూతో పాటు అత్యంత ఆకర్షణీయమైన 'డార్క్ చెర్రీ' రంగులో రానుందని తెలుస్తోంది. గతంలో ఆరెంజ్ రంగుకు వచ్చిన రేంజ్ క్రేజ్ దృష్ట్యా, ఈ డార్క్ చెర్రీ షేడ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఐఫోన్ 18 ప్రో అంచనా ధర ఎంత ఉండొచ్చు?

ఇటీవల విడిభాగాల తయారీ ఖర్చులు పెరగడంతో ఐఫోన్ 18 ప్రో సిరీస్ ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ కథనాలు పేర్కొంటున్నాయి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర 1,299 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 1,24,000 పైమాటే) ఉండవచ్చు. ఇక ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్ మరో 100 డాలర్లు ఎక్కువగా, అంటే 1,399 డాలర్ల (సుమారు రూ. 1,33,000 పైమాటే) నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మార్కెట్ పన్నులు కలిపితే భారత్‌లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

యాపిల్ అధికారికంగా ఎలాంటి ముహూర్తం ఖరారు చేయకపోయినా, ఈ ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో జరిగే గ్రాండ్ ఈవెంట్‌లో ఈ ఫోన్లను ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe