IPL 2026 Delhi Capitals vs Punjab Kings : ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో పరుగుల వరద పారుతోంది. మైదానంలోకి దిగితే చాలు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ బ్యాటర్లు రికార్డులను తిరగరాస్తున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు.. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి ఏకంగా 264 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ సీజన్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది.
ఢిల్లీ బ్యాటర్ల ధాటికి పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడంలో విఫలమవడమే కాకుండా భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇన్నింగ్స్ చివరి వరకు ఏ దశలోనూ ఢిల్లీ వికెట్ల పతనాన్ని నియంత్రించలేకపోయారు. కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగిన పంజాబ్.. పరుగుల ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయింది. మైదానంలో ఫీల్డింగ్ తప్పిదాలు కూడా పంజాబ్‌కు శాపంగా మారాయి.
కేఎల్ రాహుల్ కొత్త రికార్డ్
పంజాబ్ కింగ్స్‌పై ఓపెనర్ కేఎల్ రాహుల్ (152 నాటౌట్: 67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లు) విధ్వంసకర సెంచరీతో అదరగొట్టాడు. అతడికి తోడుగా నితీశ్ రాణా (91: 44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ఫలితంగా ఢిల్లీ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు ఏకంగా 220 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.
తొలి ఓవర్ నుంచే రాహుల్ దూకుడుగా ఆడాడు. క్రీజులో పాతుకుపోయి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సాంప్రదాయ క్రికెట్ షాట్లతో పాటు వినూత్నమైన హిట్టింగ్తో స్టేడియంలోని ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఒకానొక దశలో స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది.
- ఐపీఎల్లో మూడో అత్యధిక వ్యక్తిగత స్కోరు((152) సాధించిన బ్యాటర్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు. గతంలో క్రిస్ గేల్ (175*), బ్రాండన్ మెక్కల్లమ్ (158*) ముందున్నారు.
- ఐపీఎల్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన భారత బ్యాటర్‌గా రాహుల్ సరికొత్త రికార్డు సృష్టించాడు.
- ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ ఉన్నాడు.
- కేఎల్ రాహుల్ ఖాతాలో ప్రస్తుతం 5,579 పరుగులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ (8,989) టాప్‌లో ఉన్నాడు.

ఇక పంజాబ్ కింగ్స్ గెలవాలంటే 20 ఓవర్లలో 265 పరుగులు చేయాల్సి ఉంది. ఇది టీ20 ఫార్మాట్‌లో అత్యంత భారీ లక్ష్యం. పంజాబ్ బ్యాటింగ్ లైనప్‌లో హిట్టర్లు ఉన్నప్పటికీ…. ఇంత పెద్ద స్కోరును ఛేజ్ చేయడం అంటే అద్భుతం జరగాల్సిందే…! ఇక ఈ సీజన్ లో ఇప్పటివరకు ఓటమి ఎరగని జట్టుగా పంజాబ్ టాప్ లో ఉంది. ఈ మ్యాచ్ లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి…!