Sai Sudharsan IPL: సాయి సుదర్శన్ సెంచరీ సునామీ- ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్- క్రిస్ గేల్‌కు సమంగా గుజరాత్ స్టార్!

Sai Sudharsan IPL GT Vs RCB: నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై విరుచుకుపడ్డ గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ అద్భుత శతకంతో చెలరేగారు. కేవలం 57 బంతుల్లోనే సెంచరీ బాది పలు రికార్డులను తిరగరాశారు. సాయి సుదర్శన్ సాధించిన రికార్డుపై ఓ లుక్కేద్దాం.

Published on: Apr 24, 2026, 22:49:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sai Sudharsan IPL GT Vs RCB: ఐపీఎల్ 2026 సీజన్‌లో సాయి సుదర్శన్ తన బ్యాట్‌కు పనిచెప్పారు. బెంగళూరు బౌలర్లను ఉతికి ఆరేస్తూ క్లాసిక్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. గత సీజన్‌లోనే తన ముద్ర వేసిన ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ ఈసారి మరింత పరిణతితో బ్యాటింగ్ చేశారు.

సాయి సుదర్శన్ సెంచరీ సునామీ- ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్- క్రిస్ గేల్‌కు సమంగా గుజరాత్ స్టార్! (REUTERS)
సాయి సుదర్శన్ సెంచరీ సునామీ- ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్- క్రిస్ గేల్‌కు సమంగా గుజరాత్ స్టార్! (REUTERS)

ఎక్కడా అనవసరపు షాట్లకు పోకుండా, కేవలం టైమింగ్‌పైనే ఆధారపడుతూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించారు. ముఖ్యంగా బంతిని బలంగా బాదడం కంటే, గ్యాప్‌లను వెతకడంలో సుదర్శన్ చూపించిన నేర్పు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది.

టీమిండియా దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డు

ఈ సెంచరీతో సాయి సుదర్శన్ భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు సీజన్లలో సెంచరీలు బాదిన తొలి భారతీయ బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఏ భారత స్టార్ ప్లేయర్‌కూ ఇది సాధ్యం కాలేదు. ఓవరాల్‌గా చూస్తే వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ (2011-2013) మాత్రమే ఈ ఘనత సాధించారు.

గిల్ మద్దతు.. సుదర్శన్ విద్వంసం

ఇప్పుడు ఆ అరుదైన జాబితాలో సుదర్శన్ రెండో స్థానంలో నిలిచారు. ఈ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ జట్టులో ఆయన ఎంతటి కీలక ఆటగాడో మరోసారి నిరూపితమైంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో ఎండ్‌లో నిలకడగా ఆడుతూ సుదర్శన్‌కు పూర్తి సహకారం అందించారు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

గిల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సుదర్శన్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వగా పవర్‌ప్లేలో సుదర్శన్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. బెంగళూరులోని చిన్న సరిహద్దులను, బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌ను ఈ జంట చక్కగా వినియోగించుకుంది. మొత్తం 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 3వ ఐపీఎల్ సెంచరీని పూర్తి చేసుకున్న సుదర్శన్, ఆ వెంటనే హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో అవుటయ్యారు.

ఉత్కంఠభరిత ముగింపు.. 200 దాటిన గుజరాత్

సాయి సుదర్శన్ అవుటైన తర్వాత బెంగళూరు బౌలర్లు మ్యాచ్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. చివరి ఓవర్లలో రాసిఖ్ సలామ్ గాయపడటంతో కృనాల్ పాండ్యా బంతిని అందుకున్నారు.

అయితే, జేసన్ హోల్డర్ తన అనుభవాన్ని రంగరించి రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌తో చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. బెంగళూరు వంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుపై ఈ స్కోరు ఎంతవరకు సరిపోతుందో వేచి చూడాలి.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More