IPL 2026 final venue : ఐపీఎల్ 2026కి సంబంధించి బిగ్ అప్డేట్! ప్రస్తుతం లీగ్ దశలో ఉన్న ఈ మెగా క్రికెట్ టోర్నీకి చెందిన ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్‌ని బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. బెంగళూరు ఫ్యాన్స్‌కి షాక్ ఇస్తూ.. ఈ ఏడాది ఫైనల్‌ని అహ్మదాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయించారు. మే 31న ఫైనల్ మ్యాచ్ ఉండనుంది.
ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్, ఫైనల్ ఇలా..

మే 26న ధర్మశాల వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్ టాప్-2లో ఉన్న జట్లు ఇందులో పోటీపడతాయి. ఇక మే 27న, ఛండీగఢ్‌లో ఎలిమినేటర్ ఉండబోతోంది. టాప్-3,4 జట్లు తలపడతాయి. ఓడిపోయిన వారు ఎలిమినేట్ అవుతారు.
ఇక అదే వెన్యూలో మే 29న క్వాలిఫయర్-2 మ్యాచ్ ఉంటుంది. అంటే క్వాలిఫయర్-1 లో ఓడిపోయిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో తలపడతుంది.
ఇక క్వాలిఫయర్-1, క్వాలిఫయర్-2 మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు అహ్మదాబాద్ వేదికగా మే 31న ఫైనల్లో తలపడనున్నాయి.
బెంగళూరు ఫ్యాన్స్‌కి షాక్!
సాధారణంగా ముందు సీజన్లో కప్ గెలిచిన జట్టుకు సంబంధించిన హోమ్ గ్రౌండ్లో తదుపరి సీజన్ ఫైనల్ జరుగుతుంటుంది. ఆ లెక్కన చూసుకుంటే.. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది కాబట్టి, ఈసారి చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ జరగాల్సి ఉంది. కానీ స్థానిక అసోసియేషన్లు, అధికారుల నుంచి డిమాండ్లు, రిక్వైర్మెంట్లు ఎక్కువగా ఉన్నాయని, అవి బీసీసీఐ చేతుల్లో కూడా లేవని, అందుకే ఐపీఎల్ 2026 ఫైనల్ వేదికను బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కి తరలించినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్ 2026 ఫైనల్ టికెట్ల కోసం ప్రముఖులు, అధికారుల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండ్ల వల్లే ఇలా జరిగిందని సోషల్ మీడియాలో పుకార్లు జోరుగా సాగుతున్నాయి.
{{/usCountry}}ఐపీఎల్ 2026 ఫైనల్ టికెట్ల కోసం ప్రముఖులు, అధికారుల నుంచి వెల్లువెత్తుతున్న డిమాండ్ల వల్లే ఇలా జరిగిందని సోషల్ మీడియాలో పుకార్లు జోరుగా సాగుతున్నాయి.
{{/usCountry}}ఏదేమైన.. ఫైనల్ తరలిపోవడం బెంగళూరులో ఐపీఎల్ లవర్స్‌కి షాక్ ఇచ్చే విషయమే అని చెప్పుకోవాలి. పైగా డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగిన ఆర్సీబీ, ఈసారి కూడా మంచి ఫామ్‌లో ఉంది. ఈ జట్టు ఒకవేళ ఫైనల్‌కి చేరుకుంటే, బెంగళూరు ఫ్యాన్స్ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టే!
ఐపీఎల్ ఫైనల్ అంటే అహ్మదాబాదే!
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ 2026 కూడా కలుపుకుంటే.. 5ఏళ్లల్లో నాలుగు సార్లు ఈ స్టేడియమే ఐపీఎల్ ఫైనల్‌ని హోస్ట్ చేసినట్టు అవుతుంది.
- 2022- గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్
- 2023- చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
- 2025- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్
- 2026- ఫైనల్‌కి వెళ్లే జట్లు తేలాల్సి ఉంది.
ఇలా చాలా వరకు కీలక మ్యాచ్‌లు (2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్- 2025 టీ20 వరల్డ్ కప్ ఫైనల్), ఐపీఎల్ ఫైనల్స్ అహ్మదాబాద్‌కే వెళ్లిపోవడంపై సోషల్ మీడియాలో అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతా అహ్మదాబాద్‌కే ఇచ్చేస్తే, ఇతర నగరాల్లోని ఫ్యాన్స్ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు.
వీటన్నింటి మధ్య కూడా ఈ దఫా ఐపీఎల్ ఫైనల్‌ని సైతం అక్కడే జరపాలని బీసీసీఐ నిర్ణయించుకోవడం గమనార్హం.