IPL 2026 points table : కాటేరమ్మ కొడుకులు దూసుకెళుతున్నారు.. టాప్-3లోకి సన్‌రైజర్స్ హైదరాబాద్
RR vs SRH : సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల పరంపరను కొనసాగిస్తూ ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్ టాప్‌లో ఉండగా కేకేఆర్ బాటమ్‌లో కొట్టుమిట్టాడుతోంది.
IPL 2026 : ఐపీఎల్ 2026లో కాటేరమ్మ కొడుకులు దుమ్మురేపుతున్నారు! శనివారం జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో టాప్-3లోకి దూసుకెళ్లింది.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్, జట్ల ర్యాకింగ్స్ వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్..
సర్పంచ్ శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్.. ఈ సీజన్లోనూ హడలెత్తిస్తోంది. గతేడాది ఫైనల్ వరకు వెళ్లి ఓడిపోయిన ఈ జట్టు, ఈసారి ట్రోఫీయే లక్ష్యంగా ఆడుతోంది. శనివారం డీసీ ఇచ్చిన 260+ భారీ టార్గెట్‌ని సింపుల్‌గా ఛేజ్ చేసి, ఐపీఎల్ పాయింట్స్ టేబుల్లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని ఏకైక జట్టు పీబీకేఎస్. మొత్తం మీద ఇప్పటివరకు 7 మ్యాచులు ఆడిన ఈ టీమ్ 13 పాయింట్లతో (1 మ్యాచ్ వర్షం వల్ల జరగలేదు), 1.33 రన్‌రెట్‌తో నెంబర్.1లో ఉంది.
ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ పర్ఫార్మెన్స్తో టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. 7 మ్యాచుల్లో 5 విజయాలతో 10 పాయింట్లు దక్కించుకుంది. ఈ టీమ్ నెట్ రన్‌రేట్ 1.1గా ఉంది.
కావ్య మారన్‌కి చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మంచి జోరుమీద ఉంది. వరుస విజయాలతో ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో నిలిచింది. 8 మ్యాచుల్లో 5 విజయాలతో 10 పాయింట్లు దక్కించుకుంది. కాగా ఆర్సీబీ కన్నా నెట్ రన్‌రేట్ స్వల్పంగా తక్కువగా ఉండటంతో (0.8) 3వ స్థానంలో ఉంది. ఇక ప్యాట్ కమిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో జట్టుకు మరింత బలం చేకూరింది.
మరోవైపు సీజన్ ప్రారంభంలో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్.. ఇప్పుడు కాస్త వెనకంజలో ఉంది. 8 మ్యాచులు, 5 గెలుపులు, 10 పాయింట్లతో 4వ స్థానంలో ఉంది. ఈ జట్టు రన్‌రేట్ 0.6గా ఉంది.

ఎంఎస్ ధోనీ లేని చెన్నై సూపర్‌కింగ్స్.. ఐపీఎల్ 2026లో ఎదురీదుతోంది. సీజన్‌ని పరాజయాలతో ప్రారంభించిన ఈ జట్టు ఇప్పుడు స్థిరంగా పాయింట్స్ టేబుల్లో ప్లేస్‌ని మెరుగుపరుచుకుంటోంది. 7 మ్యాచుల్లో 3 విజయాలతో, 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది. ఈ జట్టు నెట్ రన్‌రేట్ 0.1గా ఉంది.
పంజాబ్ కింగ్స్‌తో ఓటమి అనంతరం దిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానానికి పరిమితం అయ్యింది. 7 మ్యాచుల్లో 3 విజయాలతో, 6 పాయింట్లతో (-0.18) 6వ స్థానంలో ఉంది.
గుజరాత్ టైటాన్స్‌ది కూడా అదే పరిస్థితి. 7 మ్యాచుల్లో కేవలం మూడింటిలోనే గెలిచింది. 6 పాయింట్లతో. -0.7 నెట్‌రన్‌రేట్‌తో 7వ పొజిషన్లో ఉంది.
5టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో మాత్రం ఆశించిన మేర రాణించలేకపోతోంది. 7 మ్యాచుల్లో కేవలం 2 విజయాలతో 8వ స్థానంలో ఉంది. ఈ టీమ్ నెట్ రన్‌రేట్ 0.7గా ఉంది.
ఇక లక్నో సూపర్ జెయింట్స్ సైతం 7 మ్యాచుల్లో రెండే విజయాలతో 4 పాయింట్లు సాధించి 9వ ప్లేస్‌లో ఉంది. అయితే, ఈ జట్టు నెట్ రన్‌రేట్ (-1.2) దారుణంగా ఉండటం మరొక ఆందోళనకర విషయం.
3టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచుల్లో ఒక్కటంటే ఒక్క మ్యాచే గెలిచింది. వర్షం వల్ల ఒక పాయింట్ రావడంతో ఈ జట్టుకు ఇప్పుడు మొత్తం మీద 3 పాయింట్లు (-0.8 రన్‌రేట్) ఉన్నాయి. టేబుల్ బాటమ్‌లో ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


