...
...
Next Story

RR vs PBKS IPL 2026 : రాజస్థాన్ ‘రాయల్’ విక్టరీ - పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..! ఈ సీజన్‌లో తొలి ఓటమి

RR vs PBKS IPL 2026 : ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమై విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన… 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆరు వికెట్ల తేడాతో ఛేదించింది. ఈ సీజన్ లో పంజాబ్ టీమ్ కి ఇదే తొలి ఓటమి.

Published on: Apr 28, 2026, 23:27:48 IST
Advertisement

RR vs PBKS IPL 2026 : ఐపీఎల్ 2026లో పరుగుల వరద పారిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) అద్భుత విజయాన్ని అందుకుంది. ఛేజింగ్ లో డోనోవన్ ఫెరీరా మెరుపుల దాటికి… పంజాబ్ కింగ్స్ (PBKS) నిర్దేశించిన 223 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ టీమ్ చేధించింది.

రాజస్థాన్ రాయల్స్ ‘రాయల్’ విక్టరీ
రాజస్థాన్ రాయల్స్ ‘రాయల్’ విక్టరీ

ఈ ఉత్కంఠ పోరులో రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో పంజాబ్‌ను మట్టికరిపించింది. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఇదే తొలి ఓటమి కావడం గమనార్హం. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో పంజాబ్ తొలిస్థానంలో ఉండగా.. బెంగళూరు టీమ్ రెండో స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఫెరీరా మెరుపు ఇన్నింగ్స్…

ఈ మ్యాచ్ లో చివరి ఆరు ఓవర్లలో రాజస్థాన్ విజయానికి 71 పరుగులు అవసరమైన దశలో డోనోవన్ ఫెరీరా తన విశ్వరూపాన్ని చూపాడు. కేవలం 26 బంతుల్లోనే 52 పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అతనికి తోడుగా శుభమ్ దూబే (12 బంతుల్లో 31 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో…. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే రాయల్స్ విజ తీరాలకు చేరింది. డెత్ ఓవర్లలో వీరు ఆడిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

చేతులెత్తేసిన పంజాబ్ బౌలర్లు

పంజాబ్ ప్రధాన బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, లాకీ ఫెర్గూసన్, మార్కో జాన్సెన్‌లు పెద్దగా రాణించలేకపోయారు. అర్ష్‌దీప్ సింగ్ తన 4 ఓవర్లలో ఏకంగా 68 పరుగులు సమర్పించుకోగా, లాకీ ఫెర్గూసన్ 57 పరుగులు ఇచ్చాడు. మార్కో జాన్సెన్ సైతం 3.2 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఒకవైపు యుజ్వేంద్ర చాహల్ (4 ఓవర్లలో 3/36) తన అద్భుత స్పిన్‌తో రాజస్థాన్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ…. మిగతా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో అతని శ్రమ వృథా అయింది.

సూర్యవంశీ మెరుపులు.. జైస్వాల్ ఫిఫ్టీ

మరోవైపు యశస్వి జైస్వాల్ (27 బంతుల్లో 51) బాధ్యతాయుతమైన అర్థ సెంచరీతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ధ్రువ్ జురెల్ (20) అనవసర షాట్‌కు ప్రయత్నించి అవుట్ కాగా, కెప్టెన్ రియాన్ పరాగ్ (29) కూడా చాహల్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. అయితే ఫెరీరా అటాకింగ్ గేమ్ ముందు ఇవేవీ అడ్డుకాలేదు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ కేవలం 22 బంతుల్లోనే 6 సిక్సర్లు, 4 ఫోర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (59), ప్రియాంష్ ఆర్య (29), కూపర్ కొన్నోలీ (30) రాణించడంతో పంజాబ్ భారీ స్కోరు సాధించింది. రాజస్థాన్ బౌలర్లలో యంగ్ లెగ్ స్పిన్నర్ యష్ రాజ్ పుంజా (2/41) ఆకట్టుకున్నాడు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe