రేపే IQOO Neo 11 ultra లాంచ్- 9000ఎంఏహెచ్ బ్యాటరీతో.. ఫీచర్లు ఇవే!
IQOO Neo 11 ultra launch : ఐక్యూ నియో 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
టెక్ ప్రియులకు ఐక్యూ మరో అదిరిపోయే సర్ప్రైజ్ ఇస్తోంది. ఈ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుంచి రాబోతున్న సరికొత్త 'నియో 11 అల్ట్రా' లాంచ్ డేట్ అధికారికంగా ఖరారైంది. ఆగస్టు 10న ఈ అద్భుతమైన డివైజ్ చైనా వేదికగా ప్రపంచానికి పరిచయం కానుంది.

ఇదివరకు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ‘ఐక్యూ నియో 11ఎస్’ పేరుతో తీసుకువస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే, వాటన్నింటికీ తెరదించుతూ కంపెనీ దీన్ని మరింత శక్తివంతమైన 'అల్ట్రా' బ్రాండింగ్‌తో తీసుకొస్తున్నట్లు ఐక్యూ నియో ప్రొడక్ట్ మేనేజర్ హుయ్ హుయిజి వీబో వేదికగా స్పష్టం చేశారు. సరికొత్త ఫీచర్లు, అదిరిపోయే డిస్‌ప్లే, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్‌తో ఈ ఫోన్ వస్తోందని ఆమె పేర్కొన్నారు.
అనుకున్న దానికంటే ముందే వస్తున్న ఈ ఐక్యూ నియో 11 అల్ట్రా ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్లు, ధర వంటి పూర్తి వివరాలు లాంచ్ రోజే అధికారికంగా వెల్లడి కానున్నాయి.
ఐక్యూ నియో 11 అల్ట్రా- పవర్ ఫుల్ ఫీచర్లు!
గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో 'V2545A' మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ దర్శనమిచ్చినట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఐక్యూ నియో 11 అల్ట్రా పనితీరు చూస్తుంటే టెక్ ప్రేమికులకు మతిపోవడం ఖాయం. ఈ స్మార్ట్‌ఫోన్ హుడ్ కింద శక్తివంతమైన కస్టమ్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది అత్యాధునిక 3ఎన్ఎం ఆర్కిటెక్చర్‌పై తయారైంది.
ఈ ప్రాసెసర్‌లో నాలుగు ఎఫిషియన్సీ కోర్లు (2.7GHz), మూడు పెర్ఫార్మెన్స్ కోర్లు (3.5GHz), అలాగే పీక్ క్లాక్ స్పీడ్ 4.21GHz అందించే ఒక ప్రధాన కోర్ ఉన్నాయి. గేమింగ్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని దీన్ని అత్యంత వేగంగా తీర్చిదిద్దారు.
ఐక్యూ నియో 11 అల్ట్రా- భారీ బ్యాటరీ, అదిరిపోయే స్పెసిఫికేషన్లు..
ఈ ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్ కేవలం ప్రాసెసర్‌తోనే కాదు, ఇతర హార్డ్‌వేర్ పరంగానూ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇందులో ఉన్న కీలక ఫీచర్లు ఇలా ఉన్నాయి:
రామ్ - ఓఎస్: ఈ ఫోన్ ఏకంగా 16జీబీ రామ్‌తో వస్తోంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత వివో లేటెస్ట్ ఆరిజిన్ఓఎస్ 6పై రన్ అవుతుంది.
గీక్‌బెంచ్ స్కోర్లు: సింగిల్-కోర్ టెస్ట్‌లో ఈ ఫోన్ 3,395 పాయింట్లు సాధించగా, మల్టీ-కోర్ టెస్ట్‌లో ఏకంగా 10,312 పాయింట్లు దక్కించుకుంది.
బ్యాటరీ - చార్జింగ్: ఐక్యూ నియో సిరీస్‌లో ఎన్నడూ లేనివిధంగా ఇందులో అత్యంత భారీస్థాయిలో 9,000ఎంఏహెచ్ బ్యాటరీని పొందుపరిచారు. దీనికి తోడు 100డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
డిస్‌ప్లే అండ్ సెక్యూరిటీ: ఫోన్ ముందుభాగంలో 6.83 అంగుళాల ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఇది అద్భుతమైన 2కే రిజల్యూషన్‌ను అందిస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను చేర్చారు.
డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్: ఈ ఫోన్ ఐపీ68 రేటింగ్‌తో వస్తోంది, కాబట్టి నీరు లేదా ధూళి సోకినా ఫోన్ పాడైపోతుందనే టెన్షన్ ఉండదు.
ఆగస్టు 10న చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్న ఈ ఐక్యూ నియో 11 అల్ట్రా ఫోన్ గ్లోబల్ లాంచ్‌కు సంబంధించి త్వరలోనే పూర్తి వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


