IRCTC భారత్-భూటాన్ మిస్టిక్ మౌంటైన్ టూర్: 14 రోజుల అద్భుత యాత్ర.. పూర్తి వివరాలు ఇవే!
BHARAT BHUTAN MYSTIC MOUNTAIN TOUR : ఐఆర్‌సీటీసీ (IRCTC) ప్రయాణికుల కోసం సరికొత్త, అద్భుతమైన పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. 'భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలు' ద్వారా భారత్-భూటాన్ దేశాలలోని అందమైన ప్రాంతాలను సందర్శించేలా ఈ యాత్రను రూపొందించారు.
వేసవి సెలవుల్లో విదేశీ పర్యటనకు వెళ్లాలనుకునే వారి కోసం భారతీయ రైల్వే (IRCTC) ఒక బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. 'భారత్-భూటాన్ మిస్టిక్ మౌంటైన్ టూర్' పేరుతో ఒక ప్రత్యేక అంతర్జాతీయ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ రైలు ద్వారా సాగే ఈ పర్యటనలో అస్సాం, మేఘాలయ అందాలతో పాటు హిమాలయ రాజ్యం భూటాన్‌ను కూడా సందర్శించవచ్చు.

టూర్ షెడ్యూల్
ఈ పర్యటన 2026, మే 05న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది. మొత్తం 13 రాత్రులు, 14 రోజుల పాటు సాగే ఈ సుదీర్ఘ యాత్రలో ప్రయాణికుల సౌకర్యార్థం ఘజియాబాద్, అలీఘర్, తుండ్లా, కాన్పూర్, లక్నో, వారణాసి స్టేషన్లలో బోర్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
సందర్శనీయ ప్రాంతాలు
ఈ టూర్ ప్యాకేజీలో రెండు దేశాల్లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను కవర్ చేయనున్నారు. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లోని ముఖ్యమైన ప్రాంతాలు కూడా కవర్ అవుతాయి. గువాహటిలోని కామాఖ్య దేవి ఆలయం, బ్రహ్మపుత్ర నదిపై క్రూయిజ్ ప్రయాణం ఉంటుంది. మేఘాలయలోని షిల్లాంగ్, ఉమియం లేక్, చిరపుంజిలోని జలపాతాలు, గుహలను సందర్శించవచ్చు.
భూటాన్ రాజధాని థింఫులో మోతీతాంగ్ జూ, నేషనల్ లైబ్రరీ వంటివి చూడవచ్చు. పునాఖాలోని సస్పెన్షన్ బ్రిడ్జ్, పారోలోని ప్రసిద్ధ 'టైగర్స్ నెస్ట్' ట్రెకింగ్ ఈ పర్యటనలో హైలైట్‌గా ఉంటాయి. ప్రయాణికులు ఎంచుకునే కోచ్‌ను బట్టి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
ప్యాకేజీ ధరలు
ఏసీ ఫస్ట్ క్లాస్ (Cabin/Coupe): రూ.1,41,540.
ఏసీ సెకండ్ టైర్: రూ.1,33,210.
ఏసీ థర్డ్ టైర్: రూ.1,16,545.
సింగిల్ షేర్, డబుల్ షేర్, ట్రిపుల్ షేర్ ఆధారంగా ధరలు మారుతూ ఉంటాయి.
ఈ ధరలో రైలు ప్రయాణం, 3-స్టార్ హోటల్ వసతి, శాకాహార భోజనం, స్థానిక రవాణా (బస్సు), ట్రావెల్ ఇన్సూరెన్స్, గైడ్ సౌకర్యాలు అన్నీ కలిసి ఉంటాయి.
ముఖ్య గమనిక
భూటాన్ ప్రయాణానికి సరిహద్దు వద్ద ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ ఉంటుంది. దీనికి IRCTC అధికారులు పూర్తి సహకారం అందిస్తారు. ఈ డీలక్స్ రైలులో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, ఆధునిక సెన్సార్ ఆధారిత వాష్‌రూమ్‌లు, లగ్జరీ క్యాబిన్లు అందుబాటులో ఉన్నాయి.
బుకింగ్ ఎలా చేసుకోవాలి?
BHARAT BHUTAN MYSTIC MOUNTAIN TOUR బుకింగ్ చేసుకోవాలనుకునే వారు IRCTC టూరిజం అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు. సమీపంలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
ఈ లింక్ క్లిక్ చేసి భారత్-భూటాన్ మిస్టిక్ మౌంటైన్ టూర్ వివరాలు చూడొచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


