...
...
Next Story

Vaibhav Sooryavanshi:ఐపీఎల్‌కు వైభ‌వ్ సూర్య‌వంశీ దూరం? గాయంతో మైదానం వీడిన సెన్సేష‌న‌ల్ బ్యాట‌ర్‌-వండర్ బాయ్‌కి ఏమైంది?

Vaibhav Sooryavanshi: సెన్సేషనల్ బ్యాటర్, 15 ఏళ్లకే రికార్డులు తిరగరాస్తున్న వైభవ్ సూర్యవంశీకి గాయమైంది. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ ఈ వండర్ బాయ్ మొత్తం ఐపీఎల్ 2026 సీజన్ కు దూరమయ్యే ప్రమాదం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Updated on: Apr 26, 2026, 06:44:10 IST
Advertisement

Vaibhav Sooryavanshi: 15 ఏళ్లకే పరుగుల మోత మోగిస్తూ, రికార్డుల దుమ్ము దులుపుతున్న వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశీకి గాయమైంది. శనివారం (ఏప్రిల్ 25) రాత్రి స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ వైభవ్ గాయపడ్డాడు. బాధతో విలవిలలాడిన అతణ్ని టీమ్ సిబ్బంది మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు.

వైభవ్ సూర్యవంశీకి గాయం

వైభవ్ సూర్యవంశీకి గాయం
వైభవ్ సూర్యవంశీకి గాయం

ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ జోరు మామూలుగా లేదు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై అతను కేవలం 36 బాల్స్ లోనే హండ్రెడ్ బాదేశాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. కానీ ఆ తర్వాత ఫీల్డింగ్ చేస్తూ వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో నొప్పితో బాధపడ్డాడు. చివరకు ఈ రాజస్థాన్ రాయల్స్ యంగ్ ఓపెనర్ ను బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది.

ఐపీఎల్ కు దూరం?

తొడ కండరాల గాయంతో మైదానం వీడిన వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 సీజన్ మొత్తానికి దూరం అవుతాడేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికి గాయం తీవ్రత అనేది తెలియదు. ఇవాళ (ఏప్రిల్ 26) స్కాన్ లు నిర్వహించి వైభవ్ గాయం ఏ స్థాయిలో ఉందో తెలుసుకుంటారు. ఒకవేళ అది గ్రేడ్-3 ఇంజూరీ అయితే కోలుకోవడానికి 2 నెలల టైమ్ పట్టొచ్చు. అదే జరిగితే ఈ సీజన్ కు వైభవ్ దూరమైనట్లే.

మెరుపు సెంచరీ

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై మెరుపు సెంచరీతో వైభవ్ సూర్యవంశీ చెలరేగాడు. 36 బాల్స్ లోనే శతకం కంప్లీట్ చేశాడు. ఐపీఎల్ 2025లో 35 బాల్స్ లో హండ్రెడ్ చేసిన ఈ 15 ఏళ్ల వండర్ బాయ్.. ఇప్పుడు 36 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ (30 బాల్స్) పేరు మీద ఉంది.

రాజస్థాన్ ఓటమి

ఇషాన్ కిషన్ (31 బాల్స్ లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 74), అభిషేక్ శర్మ (20 బాల్స్ లో 11 ఫోర్లు, ఓ సిక్సర్ తో 57), నితీశ్ కుమార్ రెడ్డి (18 బాల్స్ లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 36) విధ్వసంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌ విజయం సాధించింది. ఆ టీమ్ 5 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో టార్గెట్ రీచ్ అయింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks