టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా విక్టరీ తర్వాత అర్ధరాత్రి ఐసీసీ ఛైర్మన్ జై షా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అహ్మదాబాద్ లోని హనుమాన్ టెంపుల్ కు వెళ్లారు. ట్రోఫీతో దేవుడిని దర్శించుకున్నారు. అయితే దీనిపై మాజీ ఆటగాడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ కామెంట్లపై తాజాగా ఇషాన్ కిషన్ రియాక్టయ్యాడు.
టీ20 ప్రపంచకప్

టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా ఇషాన్ కిషన్ నిలిచాడు. 319 పరుగులు సాధించాడు. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ పై ఇండియా గెలిచింది. వరుసగా రెండో సారి టీ20 ప్రపంచకప్ గెలిచింది. అయితే ఆ తర్వాత కీర్తి ఆజాద్ కామెంట్లు కాంట్రవర్సీకి దారితీశాయి.
ఇషాన్ కిషన్ రియాక్షన్
టీ20 ప్రపంచకప్ అనంతరం ఇషాన్ కిషన్ తన సొంత రాష్ట్రం బీహార్ లోని పాట్నాకు చేరుకున్నాడు. ఎయిర్ పోర్ట్ లో ఇషాన్ ను విలేకర్లు కీర్తి ఆజాద్ కామెంట్ల గురించి అడిగారు.
ఈ సందర్భంగా అలాంటి ప్రశ్నలు అడగడానికి ఇది సమయం కాదని, అది ప్రపంచ కప్ గెలుపు అనుభూతిని తగ్గిస్తుందని కిషన్ చెప్పాడు. ‘‘నేను ఇప్పుడే అద్భుతమైన ప్రపంచ కప్ గెలిచా. దయచేసి మంచి ప్రశ్నలు అడగండి. కిర్తీ ఆజాద్ ఏమన్నారో నేను ఏం చెప్పగలను? దయచేసి కొన్ని మంచి ప్రశ్నలు అడగండి. టీ20 ప్రపంచకప్ గెలవడం ఎలా అనిపించిందో, ఎంత ఆనందంగా ఉందో చెప్పండి' అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.
కీర్తి ఆజాద్ ఏమన్నారంటే?
జై షా, గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ కలిసి టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో హనుమాన్ టెంపుల్ కు వెళ్లడంపై 1983 వరల్డ్ కప్ విన్నర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ కామెంట్లు వివాదాస్పదంగా మారాయి.
{{/usCountry}}జై షా, గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్ కలిసి టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో హనుమాన్ టెంపుల్ కు వెళ్లడంపై 1983 వరల్డ్ కప్ విన్నర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కీర్తి ఆజాద్ కామెంట్లు వివాదాస్పదంగా మారాయి.
{{/usCountry}}‘‘ఎందుకు మసీదు కాదు? ఎందుకు చర్చి కాదు? ఎందుకు గురుద్వారా కాదు? ట్రోఫీ 1.4 బిలియన్ ఇండియన్లకు చెందినది. కేవలం ఏ ఒక్క మతానికి చెందిన విజయం కాదు’’ అని ఎక్స్ అకౌంట్లో కీర్తి ఆజాద్ పోస్టు చేశాడు.
హార్భజన్ కౌంటర్
కీర్తి ఆజాద్ పోస్టుకు టీమిండియా మాజీ స్పిన్నర్ హార్భజన్ దిమ్మతిరిగే కౌంటర్ వేశాడు. ‘‘తోటి క్రికెటర్ల నుంచి ఇలాంటి విషయాలు వినడం దురదృష్టకరం. బహుశా వాళ్లు క్రీడల కంటే రాజకీయాలను ఎక్కువగా ఇష్టపడతారేమో. అలాంటి కామెంట్లు చేసిన వ్యక్తి ఒక క్రీడాకారుడు కావడం మరింత దురదృష్టకరం. దేశం ప్రపంచకప్ గెలిచింది. సంతోషంగా ఉండండి, సంబరాలు చేసుకోండి. కానీ మీరు రాజకీయాలు చేయడంలో బిజీగా ఉన్నారు’’ అని భజ్జీ ఏఎన్ఐతో అన్నాడు.