...
...
Next Story

ఇస్రో ఎన్‌ఆర్‌ఎస్‌సీలో 48 ఉద్యోగాలు: రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) పరిధిలోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, జేఆర్‌ఎఫ్ (JRF) తదితర 48 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 21, 2026 నాటికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Aug 4, 2026, 16:30:45 IST
Advertisement

భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC), హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రాజెక్టుల కోసం రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెల్లో (JRF) విభాగాల్లో మొత్తం 48 ఖాళీల భర్తీకి అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఇస్రో ఎన్‌ఆర్‌ఎస్‌సీలో 48 ఉద్యోగాలు: రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఇస్రో ఎన్‌ఆర్‌ఎస్‌సీలో 48 ఉద్యోగాలు: రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఈ పోస్టులన్నీ తాత్కాలిక/ప్రాజెక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్ isro.gov.in లేదా nrsc.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు, విద్యార్హతలు

వివిధ పోస్టులకు నిర్దేశించిన విద్యార్హతల మార్కుల శాతాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

M.E. / M.Tech: కనీసం 60% మార్కులు లేదా 10-పాయింట్ల స్కేల్‌పై 6.5 CGPA/CPI ఉండాలి.

M.Sc / M.Sc Tech: కనీసం 65% మార్కులు (అన్ని సెమిస్టర్ల సగటు) లేదా 6.84 CGPA/CPI ఉండాలి.

B.E. / B.Tech: కనీసం 65% మార్కులు (అన్ని సెమిస్టర్ల సగటు) లేదా 6.84 CGPA/CPI ఉండాలి.

B.Sc: కనీసం 60% మార్కులు లేదా 6.5 CGPA సాధించి ఉండాలి.

(సివిల్ ఇంజినీరింగ్, రిమోట్ సెన్సింగ్ & GIS, కంప్యూటర్ సైన్స్, జియాలజీ, అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి సంబంధిత విభాగాల్లో విద్యార్హత ఉండాలి).

గమనిక: CSIR-UGC NET (లెక్చర్‌షిప్‌తో సహా), GATE పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే DST, DBT, DAE, DOS, DRDO, MHRD, ICAR, ICMR, IIT, IISc మొదలైన కేంద్ర ప్రభుత్వ విభాగాలు నిర్వహించిన జాతీయ స్థాయి పరీక్షల ద్వారా ఎంపికైన వారు కూడా ఈ పోస్టులకు అర్హులు.

పోస్టుల వివరాలు క్లుప్తంగా

వివరాలుసమాచారం
సంస్థ పేరునేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC / ISRO)
మొత్తం ఖాళీలు48 పోస్టులు
దరఖాస్తు విధానంఆన్‌లైన్ మాత్రమే
దరఖాస్తు ముగింపు తేదీ21 ఆగస్టు 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)
అధికారిక వెబ్‌సైట్isro.gov.in / nrsc.gov.in
View All

ఎంపిక విధానం, ఇంటర్వ్యూ నిబంధనలు

ఇంటర్వ్యూకి హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్ స్వయంగా ధృవీకరించిన (Self-attested) జిరాక్స్ కాపీలను సమర్పించాల్సి ఉంటుంది.

ఇప్పటికే కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, పిఎస్‌యు (PSUs) లేదా స్వయంప్రతిపత్తి సంస్థల్లో పనిచేస్తున్న వారు తప్పనిసరిగా తమ యాజమాన్యం నుంచి 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) తీసుకెళ్లాలి.

దరఖాస్తు రుసుము & రీఫండ్ వివరాలు

  • ప్రతీ దరఖాస్తుకు అప్లికేషన్ ఫీజు 250/-.
  • మహిళలు, SC, ST, PwBD (దివ్యాంగులు) మరియు మాజీ సైనిక అభ్యర్థులకు ఈ 250 ఫీజును రీఫండ్ (తిరిగి చెల్లింపు) చేస్తారు. అయితే, వీరు అర్హత నిబంధనలకు అనుగుణంగా ఉండి, ఇంటర్వ్యూ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.
  • ఫీజు రీఫండ్ అభ్యర్థి దరఖాస్తులో అందించే బ్యాంక్ ఖాతా వివరాలకే జమ అవుతుంది. కాబట్టి ఖాతాదారుని పేరు, అకౌంట్ నంబర్, IFSC కోడ్ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి.
  • అభ్యర్థి ఇంటర్వ్యూకి హాజరు కాకపోతే ఫీజు రీఫండ్ చేయరు.

దరఖాస్తు చేసుకునే విధానం

  • ISRO లేదా NRSC అధికారిక వెబ్‌సైట్‌లోని 'Career' విభాగానికి వెళ్లాలి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో మీ వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లభించే రిజిస్ట్రేషన్ నంబర్‌ను భవిష్యత్తు అవసరాల కోసం జాగ్రత్తగా దాచుకోవాలి.
  • ఫారమ్‌లో మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీని ఖచ్చితంగా నమోదు చేయాలి, ఎందుకంటే తదుపరి సమాచారం అంతా ఈమెయిల్ ద్వారానే పంపుతారు.

సమగ్ర నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe