భారతదేశంలో ఇంజనీరింగ్ చదవాలనుకునే ప్రతి విద్యార్థి కల ఐఐటీలో సీటు సాధించడం. ఆ కలను సాకారం చేసుకునే దిశగా మరో కీలక అడుగు పడబోతోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్షకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ రేపు (ఏప్రిల్ 23, 2026) ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఈ పరీక్షా నిర్వహణ బాధ్యతలను ఐఐటీ రూర్కీ (IIT Roorkee) చేపట్టింది.
ముఖ్యమైన తేదీలు గమనించండి

ఐఐటీల్లో చేరాలనుకునే అభ్యర్థులు మే 2, 2026 వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఫీజు చెల్లించడానికి మే 4, 2026 వరకు గడువు ఇచ్చారు. జాయింట్ అడ్మిషన్ బోర్డ్ (JAB 2026) పర్యవేక్షణలో ఏడు జోనల్ ఐఐటీలు సంయుక్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నాయి.
అర్హత ఎవరికంటే..?
జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 2,50,000 మంది అభ్యర్థులు (అన్ని కేటగిరీలతో కలిపి) మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హులు. ఐఐటీల్లో బ్యాచిలర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందడానికి ఈ పరీక్షలో సాధించిన మార్కులే ప్రామాణికం.
పరీక్షా విధానం ఇలా..
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి.
- పేపర్-1: ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.
- పేపర్-2: మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు.
అభ్యర్థులు కచ్చితంగా ఈ రెండు పేపర్లకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక్క పేపర్ రాసి రెండోది వదిలేస్తే అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోరు.
దరఖాస్తు చేసుకునే విధానం (Step-by-Step):
అభ్యర్థులు ఈ క్రింది విధానంలో సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు:
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in సందర్శించండి.
- హోమ్ పేజీలో కనిపించే 'JEE Advanced 2026 Registration' లింక్‌పై క్లిక్ చేయండి.
- మీ వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసి, అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
- అప్లికేషన్ ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని నింపి, అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి.
- నిర్ణీత దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
- సబ్మిట్ బటన్ నొక్కిన తర్వాత, కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసి భద్రపరుచుకోండి.
తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఐఐటీలు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉంటాయి. గత కొన్ని ఏళ్లుగా ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే వంటి అగ్రశ్రేణి సంస్థల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఈసారి కూడా అడ్వాన్స్‌డ్ పరీక్షకు సిద్ధమవుతున్న వారు సమయాన్ని వృథా చేయకుండా గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):
{{/usCountry}}తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఐఐటీలు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యతగా ఉంటాయి. గత కొన్ని ఏళ్లుగా ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే వంటి అగ్రశ్రేణి సంస్థల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటుతున్నారు. ఈసారి కూడా అడ్వాన్స్‌డ్ పరీక్షకు సిద్ధమవుతున్న వారు సమయాన్ని వృథా చేయకుండా గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs):
{{/usCountry}}జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏది?
దరఖాస్తు చేయడానికి మే 2, 2026 చివరి తేదీ. దరఖాస్తు రుసుమును మే 4 వరకు చెల్లించవచ్చు.
జేఈఈ మెయిన్స్ రాసిన వారంతా అడ్వాన్స్‌డ్ రాయవచ్చా?
లేదు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఏ ఐఐటీ నిర్వహిస్తోంది?
2026 సంవత్సరానికి గాను ఐఐటీ రూర్కీ (IIT Roorkee) ఈ పరీక్షను నిర్వహిస్తోంది.
పరీక్షలో ఎన్ని పేపర్లు ఉంటాయి? రెండు రాయడం తప్పనిసరా?
పరీక్షలో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. అభ్యర్థులు రెండు పేపర్లకు హాజరు కావడం తప్పనిసరి.
పూర్తి సమాచారం కోసం బ్రోచర్ క్లిక్ చేయండి.