JEE Mains 2026 Session 2 : జేఈఈ మెయిన్స్ సెషన్ 2పై బిగ్ అప్డేట్- సిటీ స్లిప్ వివరాలు..
జేఈఈ మెయిన్స్ 2026 రెండో సెషన్ రాసే విద్యార్థుల కోసం పరీక్షా కేంద్రం ఉన్న నగరం వివరాలను ఎన్టీఏ వెల్లడించింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో అధికారిక వెబ్‌సైట్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 2 నుంచి 8 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ 2026 సెషన్-2 రాసే అభ్యర్థులకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఏప్రిల్ నెలల్లో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన ‘సిటీ ఇంటిమేషన్ స్లిప్’ను ఎన్టీఏ విడుదల చేసింది. అభ్యర్థులు తమకు ఏ నగరంలో పరీక్షా కేంద్రం కేటాయించారో ముందుగానే తెలుసుకోవడం ద్వారా ప్రయాణ ప్రణాళికలు, వసతి ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 2- ముఖ్యమైన గమనిక..
అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది అడ్మిట్ కార్డ్ కాదు. పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉందో కేవలం సమాచారం కోసం మాత్రమే దీనిని విడుదల చేస్తారు. అసలైన హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ పరీక్ష తేదీకి 3-4 రోజుల ముందు మాత్రమే విడుదల అవుతుంది.
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్-2 పరీక్షా తేదీలు..
ఎన్‌టీఏ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షలు కింది తేదీల్లో జరుగుతాయి:
పేపర్ 1: ఏప్రిల్ 02, 04, 05, 06, 08 (2026)
పేపర్ 2: ఏప్రిల్ 07, 2026
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 2- సిటీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
అభ్యర్థులు కింది స్టెప్స్ ఫాలో అయ్యి తమ జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 2 సిటీ స్లిప్‌ను పొందవచ్చు:
స్టెప్ 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in సందర్శించండి.
స్టెప్ 2- హోమ్‌పేజీలోని "Candidate Activity" బోర్డు కింద ఉన్న Session 2 city intimation slip లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 4- స్క్రీన్‌పై మీ సిటీ స్లిప్ కనిపిస్తుంది.
స్టెప్ 5- భవిష్యత్తు అవసరాల కోసం దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
సెషన్-2 పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 13, 2026న ముగిసింది.
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్-1 విశేషాలు..
ఈ ఏడాది తొలి విడత (సెషన్-1) పరీక్షలు జనవరి 21 నుంచి జనవరి 29 వరకు కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో జరిగాయి. ప్రతిరోజూ రెండు షిఫ్టుల్లో (ఉదయం 9 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు) ఈ పరీక్షలు నిర్వహించారు.
ప్రస్తుతం సెషన్-2 కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రయాణ ఇబ్బందులు కలగకుండా ముందే పరీక్షా నగరాన్ని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 2 సిటీ స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


