...
...
Next Story

ఐఐటీ, ఎన్​ఐటీలే కాదు.. జేఈఈ​ స్కోర్​తో ఈ టాప్​ కాలేజీల్లో కూడా ప్రవేశాలు!

ఐఐటీలు, ఎన్ఐటీలు కాకుండా జేఈఈ మెయిన్స్​ స్కోర్​తో పలు ఇతర టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కూడా చేరవచ్చు. ఆ కాలేజీల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 26, 2025, 05:42:36 IST
Advertisement

జేఈఈ మెయిన్స్​ 2026 మొదటి సెషన్ తేదీలు దగ్గరపడుతున్నాయి. జనవరి 2026లో ఈ పరీక్ష జరగనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 2025 చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఐఐటీలు, ఎన్ఐటీలు ప్రధాన ఆకర్షణగా ఉన్నప్పటికీ, ఇవే ఏకైక మార్గాలు కావు! ఎన్ఐఆర్‌ఎఫ్ 2025 ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న అనేక ఇతర అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీలు అద్భుతమైన విద్యా అవకాశాలను, బలమైన కెరీర్ మార్గాలను అందిస్తున్నాయి. ఇంజనీరింగ్‌లో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలనుకునే విద్యార్థులకు ఇవి కూడా మంచి ఎంపికలే!

జేఈఈ మెయిన్స్​ స్కోర్​ని ఆమోదించే టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు (ఐఐటీలు, ఎన్ఐటీలు కాకుండా)..

జేఈఈ మెయిన్స్​ స్కోర్​తో ఈ టాప్​ కాలేజీల్లో ప్రవేశాలు..
జేఈఈ మెయిన్స్​ స్కోర్​తో ఈ టాప్​ కాలేజీల్లో ప్రవేశాలు..

జేఈఈ మెయిన్స్​ స్కోర్‌లను పరిగణలోకి తీసుకునే, ఎన్ఐఆర్‌ఎఫ్ (NIRF) 2025 ర్యాంకింగ్స్‌ ప్రకారం ఐఐటీలు, ఎన్ఐటీలు కాకుండా భారతదేశంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల జాబితా ఇది:

శిక్ష ఓ అనుసంధాన్ - ఒడిశా

అమృత విశ్వ విద్యాపీఠం- తమిళనాడు

జామియా మిలియా ఇస్లామియా - దిల్లీ

దిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ

చండీగఢ్ యూనివర్సిటీ- పంజాబ్

కలసలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్​- తమిళనాడు

కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (కెఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్) - ఆంధ్ర ప్రదేశ్

పశ్చిమ బెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ కూడా అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కాలేజీలలో ఒకటి. అయితే, ఇది డబ్ల్యుబిజేఈఈ మెయిన్ స్కోర్‌లను పరిగణలోకి తీసుకుంటుంది.

అడ్మిషన్ ప్రక్రియ- జోసా కౌన్సెలింగ్:

పైన పేర్కొన్న కాలేజీలలో చాలా వాటిలో ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ఉండవచ్చని అభ్యర్థులు గమనించాలి. జేఈఈ ర్యాంకు ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఈ జోసా కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ఇన్‌స్టిట్యూట్‌లు, కోర్సులను ఎంపిక చేసుకోవడం, వాటిని లాక్ చేయడం, ఆ తర్వాత బహుళ రౌండ్‌లలో సీట్ల కేటాయింపు ఉంటాయి.

జేఈఈ మెయిన్స్​ 2026 వివరాలు:

రెండొవ సెషన్: ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10, 2026 వరకు జరుగుతుంది. దీనికి దరఖాస్తు విండో జనవరి 2026 చివరి వారంలో ఓపెన్​ అయ్యే అవకాశం ఉంది.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్స్​ జాతీయ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో అర్హత సాధిస్తేనే, జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అవకాశం లభిస్తుంది. ఐఐటీలలో సీటు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు తప్పనిసరి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks