...
...
Next Story

ప్రియుడితో కలిసి తాత దారుణ హత్య: 13 ఏళ్ల మనవరాలి ఘాతుకం

ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో ఉన్న సమయంలో చూశాడనే కోపంతో 13 ఏళ్ల మనవరాలు, ఆమె ప్రేమికుడు కలిసి 65 ఏళ్ల వృద్ధుడిని దారుణంగా అంతమొందించారు. దహన సంస్కారాలు పూర్తయిన రెండు రోజుల తర్వాత ఇంట్లో రక్తపు మరకలున్న దుస్తులు దొరకడంతో ఈ ఘాతుకం బయటపడింది.

Published on: Sep 17, 2026, 07:52:05 IST
Advertisement

ప్రియుడితో కలిసి ఉన్న సమయంలో చూశాడన్న ఆక్రోశంతో ఒక 13 ఏళ్ల బాలిక, తన ప్రేమికుడితో కలిసి తన సొంత తాతను అతికిరాతకంగా హత్య చేసింది. ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ జిల్లా చిర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో ఈ ఘోరం జరిగింది. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసి ఏమీ తెలియనట్లు నటించారు. దహన సంస్కారాలు పూర్తయిన రెండు రోజుల తర్వాత ఇంట్లో రక్తపు మరకలు ఉన్న దుస్తులు దొరకడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే?

ప్రియుడితో కలిసి తాత దారుణ హత్య: 13 ఏళ్ల మనవరాలి ఘాతుకం
ప్రియుడితో కలిసి తాత దారుణ హత్య: 13 ఏళ్ల మనవరాలి ఘాతుకం

బాధితుడు రామ్‌దీన్ (65) కు కుమారులు లేరు. ఆయన తన భార్య, 9వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల మనవరాలితో కలిసి నివసిస్తున్నారు. సెప్టెంబర్ 12న రామ్‌దీన్ భార్య పనికి వెళ్లడంతో, ఇంట్లో ఆయన మనవరాలితో కలిసి ఉన్నాడు. ఆ సాయంత్రం నుంచి రామ్‌దీన్ హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. మరుసటి రోజు సమీపంలోని బావిలో ఆయన మృతదేహం లభ్యమైంది. మద్యం సేవించి ప్రమాదవశాత్తు బావిలో పడిపోయి ఉంటాడని భావించి, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే దహన సంస్కారాలు పూర్తి చేశారు.

రక్తపు దుస్తులతో వెలుగులోకి నిజం

మంగళవారం రాత్రి ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో కుటుంబ సభ్యులకు రామ్‌దీన్, ఆయన మనవరాలికి చెందిన రక్తపు మరకలున్న దుస్తులు లభించాయి. దీంతో కుటుంబ సభ్యులకు బాలికపై అనుమానం వచ్చి నిలదీశారు. పోలీసుల విచారణలో తన ప్రియుడితో కలిసి తాతను హత్య చేసినట్లు బాలిక ఒప్పుకుంది. రుబ్బురాయితో తలపై తీవ్రంగా కొట్టి హత్య చేశామని, అనంతరం మృతదేహాన్ని బావిలో పడేసినట్లు వివరించింది.

నిందితుల అరెస్ట్, జువైనల్ కోర్టుకు తరలింపు

మృతుడి అల్లుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ (రూరల్) డాక్టర్ అరవింద్ కుమార్ తెలిపారు. "సంఘటనా స్థలం నుంచి రక్తపు మరకలున్న దుస్తులు, ఇతర సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నాం" అని ఆయన వెల్లడించారు. బుధవారం ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని జువైనల్ కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు స్పష్టం చేశారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks