జియో ఐపీఓ లిస్టింగ్ వేడుక అత్యంత భావోద్వేగభరిత వాతావరణంలో జరిగింది. రిలయన్స్ పరిశ్రమల వ్యవస్థాపకుడు, దివంగత ధీరూభాయ్ అంబానీ శ్రమతో కూడిన ప్రయాణాన్ని ఆయన మనవడు అనంత్ అంబానీ వేదికపై ఆవిష్కరించారు. తండ్రి ఆశయాలను, పడిన కష్టాలను తన కొడుకు నోటి వెంట వింటున్న సమయంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన కళ్లంబడి నీళ్లు తిరిగాయి.
చోర్వాడ్ నుంచి జామ్‌నగర్ వరకు.. అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ

గుజరాత్‌లోని చిన్న గ్రామమైన చోర్వాడ్‌లోని ఒక సాధారణ ఇంట్లో ధీరూభాయ్ కన్న కలలను అనంత్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఏడెన్ (యెమెన్)లోని పెట్రోల్ పంపులో ఒక సాధారణ ఉద్యోగిగా ధీరూభాయ్ పనిచేసిన రోజులను గుర్తుచేశారు.
"ఓ సామాన్య భారతీయుడు కూడా అసాధారణ కలలు కనవచ్చని ఆయన నిరూపించారు" అని ఆనంత్ పేర్కొన్నారు. ఆ రోజుల్లో ఆయన వద్ద డబ్బుగానీ, ఎటువంటి రాజకీయ వ్యాపార సంబంధాలు గానీ లేవని చెప్పారు.
అనంతరం తన తండ్రి ముకేశ్ అంబానీ లక్ష్యాలను ఆనంత్ వివరించారు. ఏ రంగంలోనూ భారత్ ప్రపంచ దేశాల కంటే వెనుకబడిపోకూడదనే ముకేశ్ పట్టుదలే జామ్‌నగర్‌లోని ఎడారి లాంటి బీడు భూములను ప్రపంచంలోనే అతిపెద్ద రిఫైనరీగా మార్చిందని కొనియాడారు. భారతీయ ప్రతిభ వైపు ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేసిన ఘనత ఆయనదేనని స్పష్టం చేశారు.
ఈశా నాటిన విత్తనం.. ఆకాశ్ కన్న కల
దేశంలోని ప్రతీ పౌరుడి చేతికీ డిజిటల్ విప్లవాన్ని తీసుకెళ్లాలనే ఆలోచనతో 'జియో' ఆవిర్భవించిందని ఆనంత్ వెల్లడించారు. ఈ మహత్తర ఆలోచనకు ఈశా అంబానీ తొలి బీజం వేయగా, ఆకాశ్ అంబానీ దాన్ని సొంత లక్ష్యంగా మలుచుకుని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. భారతీయ కుటుంబాల్లో అమ్మమ్మలు, తాతయ్యలు, తల్లులు ఆప్యాయంగా ఇచ్చే ఆశీర్వాదాల నుంచే 'జియో' అనే పేరు పుట్టుకొచ్చిందని గుర్తుచేశారు.
కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు
సామాన్యుల జీవితాల్లో జియో తెచ్చిన సాంకేతిక మార్పులను అనంత్ ఉదాహరణలతో వివరించారు. బడులు మూతపడిన సమయంలో డిజిటల్ విద్య ద్వారా పిల్లల చదువులు ఆగకుండా సాగాయని గుర్తుచేశారు. ఇళ్లకు దూరంగా ఉండే కొడుకు వంట చేస్తుంటే, వీడియో కాల్ ద్వారా కూరగాయలను చూస్తూ తల్లి సూచనలు ఇవ్వడం, ఇంటి నుంచే ఆలయాల దివ్య దర్శనాలు చేసుకోవడం జియో ద్వారానే సాధ్యమయ్యాయని చెప్పారు.
{{/usCountry}}సామాన్యుల జీవితాల్లో జియో తెచ్చిన సాంకేతిక మార్పులను అనంత్ ఉదాహరణలతో వివరించారు. బడులు మూతపడిన సమయంలో డిజిటల్ విద్య ద్వారా పిల్లల చదువులు ఆగకుండా సాగాయని గుర్తుచేశారు. ఇళ్లకు దూరంగా ఉండే కొడుకు వంట చేస్తుంటే, వీడియో కాల్ ద్వారా కూరగాయలను చూస్తూ తల్లి సూచనలు ఇవ్వడం, ఇంటి నుంచే ఆలయాల దివ్య దర్శనాలు చేసుకోవడం జియో ద్వారానే సాధ్యమయ్యాయని చెప్పారు.
{{/usCountry}}ఒక చిన్న పట్టణానికి చెందిన చిన్నారి మొబైల్ ద్వారా కోట్లాది మందిని చేరుకుని ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారడం, వేలాది మైళ్ల దూరంలో సరిహద్దుల్లో ఉండే సైనికుడు భార్యాపిల్లలతో వీడియో కాల్‌లో మాట్లాడటం వంటి దృశ్యాలను ఆనంత్ తన ప్రసంగంలో ఆవిష్కరించారు. ముంబైకి చెందిన ఒక నిపుణుడైన వైద్యుడు రాజస్థాన్‌లోని పాలి గ్రామంలో అత్యవసర పరిస్థితిలో ఉన్న రోగికి డిజిటల్ సాంకేతికత ద్వారా ప్రాణరక్షణ కల్పించిన తీరును వివరించారు.
మూడు తరాల ప్రయాణాన్ని, సాధించిన విజయాలను కొడుకు అనంత్ వివరిస్తుంటే ముకేశ్ అంబానీ కళ్లు చెమర్చాయి. తాత వేసిన పునాది, తండ్రి విస్తరించిన సామ్రాజ్యం, నవతరం అందిపుచ్చుకున్న డిజిటల్ విప్లవం.. ఇవన్నీ ఒకే వేదికపై ఆవిష్కృతమై సభలోని వారందరినీ ఆకట్టుకున్నాయి.