Jio IPO listing date : జియో ఐపీఓ లిస్టింగ్ ఎప్పుడు? ఇన్వెస్టర్లకు ఎంత లాభం?

రిలయన్స్ ఇండస్ట్రీస్ సబ్సిడరీ జియో ప్లాట్‌ఫామ్స్ రూ. 30,213 కోట్ల మెగా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ముగిసి 22 రెట్లకు పైగా స్పందన సాధించింది. అక్టోబర్ 28 (బుధవారం) ఉదయం 10 గంటలకు స్టాక్ ఎక్స్​ఛేంజీల్లో జరగనున్న లిస్టింగ్ విశేషాలు, జీఎంపీ అంచనాలు, లిస్టింగ్ ప్రక్రియ వివరాలు ఇవే..

Published on: Oct 27, 2026, 09:12:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారత కార్పొరేట్ చరిత్రలోనే సంచలనం సృష్టించిన 'జియో ప్లాట్‌ఫామ్స్' ఐపీఓ అలాట్​మెంట్​ ప్రక్రియ పూర్తైంది. ఇప్పుడు స్టాక్ మార్కెట్ వర్గాల చూపు లిస్టింగ్ వైపు మళ్లింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మద్దతు ఉన్న ఈ ఐపీఓ కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది రీటైల్ ఇన్వెస్టర్లు, విదేశీ ఆర్థిక సంస్థలు హోరాహోరీగా పోటీపడ్డాయి. గతంలో అనీల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ (2008) పేరిట ఉన్న చారిత్రాత్మక రికార్డులను సైతం తిరగరాస్తూ, అత్యధిక బిడ్లు సాధించిన భారతీయ ఐపీఓగా ఈ జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డు నెలకొల్పింది.

జియో ఐపీఓ లిస్టింగ్ ఎప్పుడు? ఇన్వెస్టర్లకు ఎంత లాభం?
జియో ఐపీఓ లిస్టింగ్ ఎప్పుడు? ఇన్వెస్టర్లకు ఎంత లాభం?

గత శుక్రవారంతో సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ విజయవంతంగా ముగియగా, సోమవారం (అక్టోబర్ 26) నాటికి షేర్ల కేటాయింపు ఖరారైంది. ఇక మిగిలింది బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో షేర్ల అరంగేట్రమే!

ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఐపీఓ లిస్టింగ్ డేట్ అండ్ టైమ్, ప్రస్తుత జీఎంపీ, జియో షేర్ ప్రైజ్ అంచనా వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

జియో ఐపీఓ లిస్టింగ్ తేదీ, టైమింగ్స్..

జియో ప్లాట్‌ఫామ్స్ ఈక్విటీ షేర్లు అక్టోబర్ 28, 2026 (బుధవారం) ఉదయం బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ఎక్స్​ఛేంజీల్లో అధికారికంగా లిస్ట్ కానున్నాయి. ఉదయం 10:00 గంటలకు జియో షేర్లలో సాధారణ ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.

దానికి ముందు ఎక్స్​ఛేంజీల్లో పాటించే ప్రత్యేక లిస్టింగ్ ప్రక్రియ ఈ కింది విధంగా ఉంటుంది:

ఉదయం 9:00 నుంచి 9:45 వరకు: స్పెషల్ ప్రీ-ఓపెన్ సెషన్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇన్వెస్టర్లు తమ ఆర్డర్లను నమోదు చేయడం, మార్చుకోవడం లేదా రద్దు చేసుకోవడం చేయవచ్చు.

ఉదయం 9:45 నుంచి 9:55 వరకు: ఆర్డర్ మ్యాచింగ్, ట్రేడ్ కన్‌ఫర్మేషన్, ప్రారంభ లిస్టింగ్ ధర నిర్ణయం జరుగుతుంది.

ఉదయం 9:55 నుంచి 10:00 వరకు: 5 నిమిషాల బఫర్ విరామం తర్వాత, సరిగ్గా ఉదయం 10:00 గంటలకు సాధారణ ట్రేడింగ్ మొదలవుతుంది.

జియో ఐపీఓ జీఎంపీ ఊపు: ఒక లాట్‌పై ఎంత లాభం?

గ్రే మార్కెట్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లపై విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) ప్రస్తుతం షేరుకు రూ. 244 వద్ద ట్రేడ్ అవుతోంది. కంపెనీ నిర్ణయించిన గరిష్ట ఇష్యూ ధర రూ. 1,119తో ఈ ప్రీమియంను కలిపితే, జియో షేరు రూ. 1,363 వద్ద మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇది ఇష్యూ ధర కంటే సుమారు 21.81 శాతం లాభాన్ని సూచిస్తోంది.

అయితే కొన్ని రోజుల క్రితం జియో ఐపీఓ జీఎంపీ రూ. 250 వరకు కూడా వెళ్లింది.

ఒకవేళ రీటైల్ ఇన్వెస్టర్‌కు ఒక లాట్ (12 షేర్లు) కేటాయింపు లభిస్తే:

ఒక లాట్ కోసం పెట్టిన పెట్టుబడి: రూ. 13,428 (రూ. 1,119 × 12 షేర్లు)

లిస్టింగ్ రోజు ఊహించిన విలువ: రూ. 16,356 (రూ. 1,369 × 12 షేర్లు)

అంటే, ఒక లాట్‌పై ఇన్వెస్టర్‌కు సుమారు రూ. 2,930 వరకు నికర లాభం దక్కే అవకాశం ఉంది.

జియో ఐపీఓ ముఖ్యాంశాలు..

ఈ జియో ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 30,213 కోట్ల విలువైన 27 కోట్ల కొత్త షేర్లను విపణిలోకి తెచ్చింది. ఇష్యూ ప్రైస్ బ్యాండ్‌ను రూ. 1,065 నుంచి రూ. 1,119గా నిర్ణయించారు. రీటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ (12 షేర్లు) కోసం రూ. 13,428 దాఖలు చేయాల్సి వచ్చింది.

రూ. 10 లక్షల కోట్లకు చేరనున్న మార్కెట్ క్యాప్!

లిస్టింగ్ తర్వాత జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన పబ్లిక్ లిస్టెడ్ కంపెనీల జాబితాలో జియో నేరుగా అగ్రస్థానాల్లో అడుగుపెట్టబోతోంది. అయితే, లిస్టింగ్ రోజు స్టాక్ మార్కెట్లో నమోదయ్యే ముగింపు ధరను బట్టి ఈ మార్కెట్ క్యాప్ మారనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More