...
...
Next Story

Jio recharge plan : డైలీ 2జీబీ డేటా, ఫ్రీగా రూ. 35వేల గూగుల్ జెమినీ ప్రో! జియో కొత్త ప్లాన్..

Jio 459 recharge plan : మీరు ఫోన్​లో ఎక్కువ గేమ్స్​ ఆడుతుంటారా? అయితే ఇది మీకోసమే! టెలికాం దిగ్గజం రిలయన్స్​ జియో మీకోసం కొత్త రీఛార్జ్​ ప్లాన్​ని తీసుకొచ్చింది. రూ. 459 ధరతో భారీ డేటా, రూ. 35వేలు విలువ చేసే గూగుల్​ జెమినీ ప్రోని ఫ్రీగా అందిస్తోంది. ఇతర వివరాల్లోకి వెళితే..

Published on: Apr 25, 2026 09:08 AM IST
Advertisement

Jio Youth and Gaming Plan : ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యువతను లక్ష్యంగా చేసుకుని సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ‘యూత్ అండ్ గేమింగ్ ప్లాన్’ పేరుతో వచ్చిన ఈ రీఛార్జ్ ప్లాన్.. గేమింగ్, స్ట్రీమింగ్ ప్రియులకు పండగ లాంటి వార్త. కేవలం డేటా మాత్రమే కాకుండా, ఏకంగా రూ. 35,000 పైగా విలువైన ఏఐ ఫీచర్లను ఇందులో ఉచితంగా అందిస్తుండటం విశేషం.

జియో కొత్త రీఛార్జ్ ప్లాన్ వివరాలు, డేటా బెనిఫిట్స్..

రిలయన్స్​ జియో కొత్త రీఛార్జ్​ ప్లాన్..
రిలయన్స్​ జియో కొత్త రీఛార్జ్​ ప్లాన్..

రూ. 459 ధరతో అందుబాటులోకి వచ్చిన ఈ జియో రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. దీనిలోని ప్రధాన ఫీచర్లు ఇవే:

డేటా: రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటాతో పాటు అదనంగా 5జీబీ డేటా ఉచితం (మొత్తం 61జీబీ).

5G ఆఫర్: జియో ట్రూ 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న చోట 'అన్‌లిమిటెడ్ 5జీ' డేటా వాడుకోవచ్చు.

కాలింగ్ అండ్ ఎస్ఎంఎస్: అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్.

హైలైట్: రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో!

ఈ ప్లాన్‌లోని అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏంటంటే.. 18 నెలల పాటు గూగుల్ జెమినీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను జియో ఉచితంగా ఇస్తోంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ. 35,100. దీనివల్ల లభించే ప్రయోజనాలు:

అడ్వాన్స్‌డ్ ఏఐ: అత్యున్నత స్థాయి ఏఐ ఫీచర్లు, గూగుల్ ‘నానో బనానా’ మోడల్ యాక్సెస్.

5టీబీ క్లౌడ్ స్టోరేజ్: భారీ స్థాయిలో డేటాను సేవ్ చేసుకోవడానికి 5000జీబీ (5టీబీ) క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది.

వినోదం కోసం మరిన్ని సబ్‌స్క్రిప్షన్లు..

Snapchat+: స్నాప్‌చాట్ ప్రీమియం ఫీచర్లు.

JioHotstar: మూడు నెలల మొబైల్ సబ్‌స్క్రిప్షన్.

FanCode: జియో టీవీ ద్వారా స్పోర్ట్స్ స్ట్రీమింగ్.

JioGames Mobile: మొబైల్ గేమింగ్ యాక్సెస్.

JioAICloud: అదనంగా 50జీబీ క్లౌడ్ స్టోరేజ్.

విదేశీ ప్రయాణికులకు గుడ్ న్యూస్!

విదేశాలకు వెళ్లే జియో వినియోగదారుల కోసం ఈ టెలికాం సంస్థ మరో వెసులుబాటు కల్పించింది. వై-ఫై కాలింగ్ (VoWiFi) ఆన్ చేసి ఉంటే, ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ లేకపోయినా ఇన్‌కమింగ్ ఎస్ఎంఎస్ ఉచితంగా పొందవచ్చు. దీనివల్ల విదేశాల్లో ఉన్నప్పుడు బ్యాంక్ ఓటీపీలు, అలర్ట్స్ ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందుతాయి.

తరచుగా అడిగే ప్రశ్నలు -

1. జియో రూ. 459 ప్లాన్ వ్యాలిడిటీ ఎంత?

ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. అయితే గూగుల్ జెమినీ ప్రో వంటి కొన్ని బెనిఫిట్స్ మాత్రం మీరు నిరంతరం యాక్టివ్ ప్లాన్‌లో ఉన్నంత కాలం (18 నెలల వరకు) అందుబాటులో ఉంటాయి.

2. గూగుల్ జెమిని ప్రో ఆఫర్ అందరికీ వస్తుందా?

అవును, రూ. 459 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారు మైజియో యాప్ ద్వారా తమ జిమెయిల్ ఐడీని రిజిస్టర్ చేసుకుని ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe