వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) చరిత్రలోనే అత్యంత ఐకానిక్ కెరీర్లలో ఒకటిగా నిలిచిన జాన్ సీనా ప్రస్థానం ముగిసింది! 17 సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సీనా.. శనివారం రాత్రి (అమెరికా కాలమానం ప్రకారం) జరిగిన 'సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్'తో డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పాడు. కాగా.. గంథర్తో జరిగిన తన చివరి మ్యాచ్‌లో జాన్ సీనా ఓడిపోవడం అభిమానులను కాస్త నిరాశపరిచింది.

ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈ మ్యాచ్‌లో, 'రింగ్ జనరల్' గంథర్ చేతిలో ఓటమిని అంగీకరిస్తూ సీనా 'ట్యాప్ ఔట్' చేయక తప్పలేదు. దాదాపు 20 ఏళ్ల కెరీర్‌లో సీనా ఒక మ్యాచ్‌లో ట్యాప్ ఔట్ చేయడం ఇదే తొలిసారి! వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ వన్ అరేనాలో జరిగిన ఈ మ్యాచ్ ఫలితం అక్కడ ఉన్న అభిమానులందరినీ షాక్‌కు గురి చేసింది. చాలా మంది నమ్మలేక తలపై చేతులు పెట్టుకుని కనిపించారు.
జాన్ సీనా వర్సెస్ గంథర్: చివరి పోరాటం ఎలా జరిగింది?
ముందుగా గంథర్ రింగ్‌లోకి అడుగు పెట్టగా, ప్రేక్షకుల నుంచి నిరసనలు వచ్చాయి. ఆ తర్వాత సీనా ఐకానిక్ థీమ్ సాంగ్ ప్లే కాగానే, అరేనా మొత్తం ఉత్సాహంతో దద్దరిల్లింది. రింగ్ పక్కన సీనాకు అతని పాత ప్రత్యర్థులు స్వాగతం పలికారు. జనంతో కిక్కిరిసిన స్టేడియం ముందు, ప్రారంభం నుంచి గుంథర్ ఆధిపత్యం వహించాడు.
సీనా 'ఫైవ్-నకిల్ షఫుల్', ‘ఎస్టీఎఫ్’తో గంథర్‌ను ఓడించడానికి ప్రయత్నించాడు. కానీ గంథర్ మళ్లీ నియంత్రణ సాధించాడు. 43 ఏళ్ల సీనా మళ్లీ 'సూపర్ సీనా' మోడ్‌లోకి వచ్చి, మరో ‘ఫైవ్-నకిల్ షఫుల్’, ‘ఏఏ’తో తిరిగి పుంజుకున్నాడు. కానీ గంథర్ రెండు పాయింట్ల వద్ద కిక్ అవుట్ చేసి సీనాను నిలువరించాడు.
ఆ తర్వాత, గంథర్ సీనాను రింగ్ చుట్టూ విసిరి కొట్టాడు. చివరకు స్టీల్ స్టెప్స్‌పై కూడా పడేశాడు. ప్రేక్షకులు "యు స్టిల్ గాట్ ఇట్" అని నినాదాలు చేస్తుండగా, సీనా మళ్లీ నియంత్రణ సాధించాడు. అయితే, గంథర్ తన బలాన్ని నిరూపించుకున్నాడు. సీనాను ట్యాప్ అవుట్ చేయమని ఒత్తిడి చేశాడు.
రింగ్‌కు వీడ్కోలు పలికిన సీనా..
{{/usCountry}}ఆ తర్వాత, గంథర్ సీనాను రింగ్ చుట్టూ విసిరి కొట్టాడు. చివరకు స్టీల్ స్టెప్స్‌పై కూడా పడేశాడు. ప్రేక్షకులు "యు స్టిల్ గాట్ ఇట్" అని నినాదాలు చేస్తుండగా, సీనా మళ్లీ నియంత్రణ సాధించాడు. అయితే, గంథర్ తన బలాన్ని నిరూపించుకున్నాడు. సీనాను ట్యాప్ అవుట్ చేయమని ఒత్తిడి చేశాడు.
రింగ్‌కు వీడ్కోలు పలికిన సీనా..
{{/usCountry}}తన చివరి మ్యాచ్ తర్వాత, సీనా రింగ్‌లోకి వచ్చి, ఇన్నేళ్లుగా తనను ప్రేమించి, మద్దతు ఇచ్చినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. అభిమానులకు అభివాదం చేసిన తర్వాత, సీనా తన షూస్, ఆర్మ్‌బ్యాండ్‌ను రింగ్‌లో పెట్టి, చివరిసారిగా రింగ్ నుంచి బయటకు నడిచాడు. "ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం" అని సీనా తన కెరీర్‌కు ముగింపు పలుకుతూ బ్యాక్‌స్టేజ్‌లోకి వెళ్లిపోయాడు.
జాన్ సీనా చివరి మ్యాచ్ ముగిసిన తర్వాత, మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ రోస్టర్ అతనిని అభినందించడానికి రింగ్‌లోకి వచ్చింది. అందరి ముందు, కోడి రోడ్స్, సీఎం పంక్ తమ ఛాంపియన్‌షిప్‌లను సీనా భుజాలపై ఉంచి అద్భుతమైన గౌరవాన్ని ఇచ్చారు.
కాగా జాన్ సీనా తన కెరీర్‌ను 17 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా, 5 సార్లు యూఎస్ ఛాంపియన్‌గా, 4 సార్లు ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌గా, 2 సార్లు రాయల్ రంబుల్ విజేతగా, ఒకసారి ఇంటర్‌కాంటినెంటల్ టైటిల్‌తో ముగించాడు.
జాన్ సీనాను అభినందించిన అండర్‌టేకర్..
దీనికి ముందు, అండర్‌టేకర్ 'ఎక్స్' వేదికగా జాన్ సీనాకు ట్రిబ్యూట్ని ఇచ్చాడు. అతను 2002లో స్మాక్‌డౌన్‌లో కర్ట్ యాంగిల్‌తో జరిగిన మెయిన్-రోస్టర్ అరంగేట్రంలో ఓడిపోయినప్పటికీ, సీనా చూపిన ధైర్యానికి అండర్‌టేకర్ ఎలా ప్రశంసించాడో గుర్తు చేసుకున్నాడు. సీనాను "హస్టిల్, లాయల్టీ, రెస్పెక్ట్" అనే లక్షణాలకు ప్రతీకగా ఆయన అభివర్ణించాడు.
"'నైస్ జాబ్' (చాలా బాగా చేశావు). 23 సంవత్సరాల క్రితం మీరు అరంగేట్రం చేసినప్పుడు నేను మీకు చెప్పిన మాటలు అవి. ఇప్పుడు, మీ చివరి మ్యాచ్ రోజున, నేను మళ్లీ చెబుతున్నాను.. నైస్ జాబ్," అని అండర్‌టేకర్ అన్నాడు.
"హస్టిల్, లాయల్టీ, రెస్పెక్ట్ అనేది కేవలం ఒక క్యాచ్ ఫ్రేజ్ మాత్రమే కాదు. 23 సంవత్సరాలుగా మీరు ఆ మాటల ద్వారా జీవించారు. మా వ్యాపారం పట్ల మీ అభిరుచి, మా అభిమానుల పట్ల మీ అంకితభావం సాటిలేనిది," అని అండర్‌టేకర్ ట్వీట్ చేశాడు.
"ఈ రాత్రి చివరి రైడ్‌ను ఆస్వాదించు నా మిత్రమా. చివరిసారిగా... నైస్ జాబ్. @JohnCena," అని అండర్‌టేకర్ ముగించాడు.