భారత ఆటోమొబైల్ మార్కెట్లో సంచలనం సృష్టించేందుకు దిగ్గజ పారిశ్రామిక సంస్థ జేఎస్‌డబ్ల్యూ సిద్ధమైంది. జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ నుంచి రాబోతున్న తొలి ప్రతిష్టాత్మక ఎస్‌యూవీ 'కాంబాట్' డిసెంబర్ 4న దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. విడుదలకు కొద్ది రోజుల ముందే ఈ కారు దమాన్‌లో జరిగిన ఒక వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో ఎలాంటి ముసుగు లేకుండా పూర్తి రూపంలో కెమెరా కంటికి చిక్కింది!

అంతర్జాతీయ మార్కెట్లలో ‘జెటూర్ టీ2’ పేరుతో అమ్ముడవుతున్న పాపులర్ ఎస్‌యూవీని భారత్‌లో కాంబాట్ పేరుతో తీసుకొస్తున్నారు. దేశీయంగా జేఎస్‌డబ్ల్యూ సంస్థ స్వతంత్ర ఆటోమొబైల్ వ్యాపార ప్రస్థానానికి ఈ కారు నాంది పలకనుంది.
జేఎస్‌డబ్ల్యూ కాంబాట్- బాక్సీ డిజైన్..
తాజాగా బయటకు వచ్చిన చిత్రాలను గమనిస్తే, అంతర్జాతీయ జెటూర్ టీ2 ఎక్స్‌టీరియర్ స్టైలింగ్‌ను జేఎస్‌డబ్ల్యూ కాంబాట్ దాదాపుగా కొనసాగించింది. ఎత్తైన స్టాన్స్, నిటారుగా ఉండే ఫ్రంట్ ఫాసియా, దృఢమైన బాక్సీ ఆకృతి ఈ కారుకు కండలు తిరిగిన రూపాన్ని ఇస్తున్నాయి. ముందుభాగంలో కొత్తగా తీర్చిదిద్దిన గ్రిల్ అమర్చారు; అంతర్జాతీయ మోడల్‌లో ఉండే 'Jetour' బ్రాండింగ్ స్థానంలో గ్రిల్ వెడల్పు పొడవునా 'Combat' అక్షరాలను ఆకర్షణీయంగా పొందుపరిచారు. ముందువైపు ఆధునిక ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్లు, మందపాటి బంపర్‌పై ఫాగ్ ల్యాంప్స్, అదనపు లైటింగ్ ఎలిమెంట్స్ కారుకు రఫ్ అండ్ టఫ్ లుక్ అందిస్తున్నాయి.
సైడ్ ప్రొఫైల్ విషయానికొస్తే, చదునైన రూఫ్‌లైన్, నిటారుగా ఉండే వెనుక భాగం, పదునైన ఏ-పిల్లర్‌తో జెటూర్ టీ2 బాక్సీ శైలిని యథాతథంగా ఉంచారు. మందపాటి టైర్లతో కూడిన 20-అంగుళాల భారీ అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి రాజసాన్ని తెచ్చాయి. వెనుక భాగంలో టెయిల్‌గేట్‌కు అమర్చిన స్పేర్ వీల్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
జేఎస్‌డబ్ల్యూ కాంబాట్- లగ్జరీ ఇంటీరియర్..
కాంబాట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ చిత్రాలను గానీ, పూర్తి స్థాయి ఫీచర్ల జాబితాను గానీ కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే క్యాబిన్ లోపల అత్యాధునిక హంగులు ఉండబోతున్నాయని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 15.6-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వేగంగా పనిచేయడానికి అడ్రెనో 640 జీపీయూ జతచేసిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8155 ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.
{{/usCountry}}కాంబాట్ ఎస్‌యూవీ ఇంటీరియర్ చిత్రాలను గానీ, పూర్తి స్థాయి ఫీచర్ల జాబితాను గానీ కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే క్యాబిన్ లోపల అత్యాధునిక హంగులు ఉండబోతున్నాయని ఆటోమొబైల్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 15.6-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వేగంగా పనిచేయడానికి అడ్రెనో 640 జీపీయూ జతచేసిన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8155 ప్రాసెసర్‌ను ఉపయోగించే అవకాశం ఉంది.
{{/usCountry}}పనోరమిక్ సన్‌రూఫ్, ముందు సీట్లకు వెంటిలేషన్ సదుపాయం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 50డబ్ల్యూ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. వీటితో పాటు కారు లోపల స్వచ్ఛమైన గాలి కోసం ఎయిర్ ప్యూరిఫయర్, యాంబియంట్ లైటింగ్, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లను కూడా ఆశించవచ్చు.
జేఎస్‌డబ్ల్యూ కాంబాట్- పవర్, రేంజ్..
ఇంజిన్ సామర్థ్యం విషయంలో జేఎస్‌డబ్ల్యూ కాంబాట్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది. ఇందులో 1.5-లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజిన్‌కు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, 18.4 kWh బ్యాటరీ ప్యాక్‌ను జతచేశారు. ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వ్యవస్థ మొత్తం కలిపి 360 హెచ్‌పీ పవర్‌ని, 610 ఎన్ఎం భారీ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుందని అంచనా. ఈ పవర్‌ట్రెయిన్‌కు 3-స్పీడ్ డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేశారు; దీని ద్వారా ముందు చక్రాలకు పవర్ సరఫరా అవుతుంది.
మైలేజీ, రేంజ్ పరంగా ఈ ఎస్‌యూవీ ఆకట్టుకునే గణాంకాలతో వస్తోంది. కేవలం బ్యాటరీ సాయంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. పెట్రోల్ ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిసి పనిచేస్తే ఏకంగా 1,100 కిలోమీటర్ల వరకు సుదీర్ఘ డ్రైవింగ్ రేంజ్ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సెటప్ ఏసీ, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండింటికీ సపోర్ట్ చేస్తుంది.
డిసెంబర్ 4న జరగనున్న అధికారిక ఆవిష్కరణలో ఈ ఎస్‌యూవీ ధర, వేరియంట్ల వివరాలు వెల్లడి కానున్నాయి.