New SUV : ఇండియాలోకి జేఎస్​డబ్ల్యూ తొలి ఎస్​యూవీ- 1400కి.మీ మైలేజ్​తో! ‘కాంబాక్ట్’ లాంచ్ ఎప్పుడంటే..

ప్రసిద్ధ జెటోర్ టీ2 ఆధారంగా ఒక కొత్త ఎస్​యూవీతో భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు జేఎస్​డబ్ల్యూ మోటార్స్ సన్నాహాలు చేస్తోంది. 'జేఎస్​డబ్ల్యూ కాంబాట్' అని పిలుస్తున్న ఈ ప్రీమియం హైబ్రిడ్ ఇంజిన్, అధునాతన ఫీచర్లు, అద్భుతమైన డ్రైవింగ్ రేంజ్‌తో సరికొత్త రికార్డులను సృష్టించనుంది!

Published on: Sep 25, 2026, 14:25:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం జేఎస్​డబ్ల్యూ గ్రూప్ సొంత బ్రాండ్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. జేఎస్​డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియాతో ఉన్న భాగస్వామ్యానికి పూర్తి భిన్నంగా, స్వతంత్రంగా 'జేఎస్​డబ్ల్యూ మోటార్స్' పేరిట ప్యాసింజర్ వాహన విభాగాన్ని ప్రారంభిస్తోంది. అందులో భాగంగా కంపెనీ నుంచి వస్తున్న మొట్టమొదటి ఆఫ్‌రోడ్ లుక్ ఎస్‌యూవీగా ‘జేఎస్​డబ్ల్యూ కాంబాట్’ నిలవనుంది. గ్లోబల్ మార్కెట్‌లో ప్రాచుర్యం పొందిన 'జెటోర్ టీ2' ఆధారంగా ఈ ఎస్‌యూవీని రూపొందిస్తున్నారు.

జేఎస్​డబ్ల్యూ కాంబాట్..
జేఎస్​డబ్ల్యూ కాంబాట్..

ఇప్పటికే భారత్‌లో రోడ్ టెస్టింగ్ జరుపుకుంటున్న ఈ కారు, మార్కెట్‌లో ప్రీమియం లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ ప్రియులను విశేషంగా ఆకట్టుకోనుంది.

అప్‌డేటెడ్ జెటోర్ టీ2 ఆధారంగా సరికొత్త డిజైన్!

చైనా మార్కెట్‌లో ఇటీవల విడుదలైన జెటోర్ టీ2 ఫేస్‌లిఫ్ట్ డిజైన్ ఆధారంగానే ఇండియా-స్పెక్ జేఎస్​డబ్ల్యూ కాంబాట్‌ రూపుదిద్దుకుంటుంది.

ముందు భాగం: గుండ్రటి ఎల్​ఈడీ హెడ్‌లైట్లు, బొనెట్‌పైకి మారిన సన్నని JETOUR బ్యాడ్జింగ్, అలాగే రెండు వైపులా హెడ్‌లాంప్‌లను కలిపే కనెక్టెడ్ ఎల్‌ఈడీ లైట్ బార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బాడీ కలర్ ఫినిషింగ్‌తో రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్ రోడ్ ప్రజెన్స్‌ను పెంచుతుంది.

వెనుక భాగం: స్మూత్ డీ-పిల్లర్ ట్రిమ్, కొత్త స్పాయిలర్, అప్‌డేటెడ్ బంపర్ మరియు 4-పాయింట్ 3డీ డిజైన్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ కారుకు మరింత రగ్గడ్ లుక్‌ను ఇస్తాయి.

హైటెక్ ఫీచర్లు.. అధునాతన క్యాబిన్!

ఈ ఎస్​యూవీ క్యాబిన్ లోపల అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని, ప్రీమియం అనుభూతిని అందించేలా ఫీచర్లను అమర్చారు.

స్క్రీన్స్ అండ్ ప్రాసెసర్: 15.6-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉంటాయి. ఈ సిస్టమ్ స్నాప్‌డ్రాగన్ 8255 చిప్‌సెట్‌తో పాటు 24Gజీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్‌తో శరవేగంగా పనిచేస్తుంది.

ఏఐ వాయిస్ కంట్రోల్: కృత్రిమ మేధతో పనిచేసే 'iFlytek Spark' జనరేటివ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను ఇంటీరియర్‌లో అందించారు.

లగ్జరీ ఆప్షన్లు: 256-రంగుల యాంబియంట్ లైటింగ్, 23-స్పీకర్లతో కూడిన సౌండ్ సిస్టమ్, 8-పాయింట్ మసాజ్ ఫంక్షన్ ఉన్న 10-వే పవర్ అడ్జస్టబుల్ కంఫర్ట్ సీట్లను అమర్చారు. డ్రైవింగ్ మోడ్స్ ఎంచుకునేందుకు ఆకర్షణీయమైన రోటరీ సెలెక్టర్ అందుబాటులో ఉంది.

ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్!

భారత్‌లో విడుదల కానున్న జేఎస్​డబ్ల్యూ కాంబాట్ మోడల్‌ను ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్‌తో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇంజిన్ వివరాలు: 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 156 హెచ్​పీ పవర్, 220 ఎన్​ఎం టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొత్త మోడల్‌లో 3-స్పీడ్ డెడికేటెడ్ గేర్‌బాక్స్ స్థానంలో సింగిల్-స్పీడ్ హైబ్రిడ్ యూనిట్‌ను అమర్చారు.

బ్యాటరీ అండ్ మైలేజ్: చైనా వేరియంట్‌లో 26.61kWh, 45.12kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. పెద్ద బ్యాటరీ కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే 173 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. పెట్రోల్, విద్యుత్ రెండింటినీ ఉపయోగిస్తే మొత్తం 1,400 కిలోమీటర్ల గరిష్ట డ్రైవింగ్ రేంజ్ లభిస్తుండటం విశేషం.

జేఎస్​డబ్ల్యూ కాంబాట్- విడుదల వివరాలు, మార్కెట్ వ్యూహం..

జేఎస్​డబ్ల్యూ కాంబాట్ విడుదలను తొలుత దీపావళి నాటికి అంచనా వేసినప్పటికీ, నివేదికల ప్రకారం ఈ ఎస్‌యూవీ 2026 డిసెంబర్ నాటికి మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ప్రీమియం విభాగంలో రూ. 30 లక్షల ధర శ్రేణిలో ఇది విడుదల కానుంది.

భారత మార్కెట్‌పై సుదీర్ఘ ప్రణాళికతో ఉన్న జేఎస్​డబ్ల్యూ మోటార్స్, రాబోయే 4 ఏళ్లలో ఏకంగా 15 కొత్త ఎనర్జీ వాహనాలను (హైబ్రిడ్, ఈవీ) మార్కెట్లోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ ప్లాంట్‌లో ఏడాదికి 3.5 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసేలా తయారీ యూనిట్‌ను విస్తరిస్తోంది. ఏప్రిల్ 2027 నాటికి దేశవ్యాప్తంగా 120 మంది డీలర్ భాగస్వాములు, 150 కస్టమర్ టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More