స్టాక్ మార్కెట్లో కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. జూలై 10 (శుక్రవారం) ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేర్లు ఏకంగా 8 శాతానికి పైగా పెరిగాయి. వరుసగా మూడో రోజు కూడా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్‌ఈ (BSE) లో ఈ షేరు విలువ 8.67 శాతం లాభంతో రూ. 483.10 గరిష్ట స్థాయిని తాకింది. కేవలం మూడు రోజుల్లోనే ఈ స్టాక్ 36 శాతానికి పైగా పెరిగింది. దీంతో గత నెల రోజుల్లో ఈ షేరు సాధించిన మొత్తం లాభాలు 41 శాతాన్ని దాటేశాయి.
రికార్డు స్థాయిలో ట్రేడింగ్ వాల్యూమ్స్

శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు భారీగా పోటీ పడ్డారు. స్టాక్ ఎక్స్ఛేంజీలలో దాదాపు 8 కోట్ల ఈక్విటీ షేర్లు చేతులు మారాయి. సాధారణంగా ఒక వారంలో సగటున 4 కోట్ల షేర్లు, నెల రోజుల్లో సగటున 2 కోట్ల షేర్లు ట్రేడ్ అవుతుండగా, జూలై 10 నాటి వాల్యూమ్స్ వీటికి ఎన్నో రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. మధ్యాహ్నం 12:35 గంటల సమయంలో బీఎస్‌ఈలో ఈ షేరు 6.12 శాతం లాభంతో రూ. 471.75 వద్ద ట్రేడవుతోంది.
ఇంతలా పెరగడానికి కారణాలేంటి?
కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు ఇంత వేగంగా దూసుకుపోవడానికి కంపెనీ ఇటీవల విడుదల చేసిన 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక (Q1FY27) వ్యాపార నివేదికే ప్రధాన కారణం ఈ అద్భుతమైన వృద్ధిని చూసి పలు బ్రోకరేజ్ సంస్థలు ఈ స్టాక్‌పై సానుకూల అంచనాలను వ్యక్తపరిచాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే, ఈ ఏడాది క్యూ1లో ఏకీకృత ఆదాయంలో (Consolidated Revenue) దాదాపు 38 శాతం వృద్ధిని సాధించినట్లు కళ్యాణ్ జ్యువెలర్స్ వెల్లడించింది.
జూలై 7న కంపెనీ సమర్పించిన నివేదిక ప్రకారం.. ఈ జూన్ త్రైమాసికంలో 28 రోజుల పాటు 'అధిక మాసం' ఉన్నప్పటికీ, భారతీయ మార్కెట్లలో వ్యాపారం పుంజుకుంది. దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 38 శాతానికి పైగా పెరిగింది. అన్ని ప్రధాన మార్కెట్లలో 'సేమ్-స్టోర్-సేల్స్-గ్రోత్' (SSSG) బలంగా సాగింది. ఈ త్రైమాసికంలో సేమ్-స్టోర్ సేల్స్ వృద్ధి దాదాపు 28 శాతంగా నమోదైంది.
అంతర్జాతీయ మార్కెట్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్ జోష్
భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ కళ్యాణ్ జ్యువెలర్స్ మంచి ప్రదర్శన కనబరిచింది. అంతర్జాతీయ వ్యాపార ఆదాయం ఏడాది ప్రాతిపదికన దాదాపు 35 శాతం వృద్ధి చెందింది. మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఏప్రిల్ నెలలో కస్టమర్ల రాక తగ్గినప్పటికీ, క్యూ1 ముగిసే సమయానికి అక్కడ 30 శాతం ఆదాయ వృద్ధి నమోదైంది. కంపెనీ మొత్తం ఏకీకృత ఆదాయంలో అంతర్జాతీయ మార్కెట్ల వాటా దాదాపు 14 శాతంగా ఉంది.
{{/usCountry}}భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ కళ్యాణ్ జ్యువెలర్స్ మంచి ప్రదర్శన కనబరిచింది. అంతర్జాతీయ వ్యాపార ఆదాయం ఏడాది ప్రాతిపదికన దాదాపు 35 శాతం వృద్ధి చెందింది. మిడిల్ ఈస్ట్ (మధ్యప్రాచ్యం) ప్రాంతంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఏప్రిల్ నెలలో కస్టమర్ల రాక తగ్గినప్పటికీ, క్యూ1 ముగిసే సమయానికి అక్కడ 30 శాతం ఆదాయ వృద్ధి నమోదైంది. కంపెనీ మొత్తం ఏకీకృత ఆదాయంలో అంతర్జాతీయ మార్కెట్ల వాటా దాదాపు 14 శాతంగా ఉంది.
{{/usCountry}}కంపెనీకి చెందిన డిజిటల్-ఫస్ట్ జ్యువెలరీ ప్లాట్‌ఫామ్ 'కాండీర్' (Candere) సైతం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. క్యూ1లో దీని ఆదాయం ఏకంగా 112 శాతం పెరిగింది. ఈ జూన్ త్రైమాసికంలో సంస్థ భారత్‌లో కొత్తగా 12 కళ్యాణ్ షోరూమ్‌లను, 5 కాండెరే షోరూమ్‌లను ప్రారంభించింది. జూన్ 30, 2026 నాటికి భారత్ సహా అంతర్జాతీయ మార్కెట్లలోని మొత్తం షోరూమ్‌ల సంఖ్య 524కు చేరింది.
కొనాలా? అమ్మాలా? హోల్డ్ చేయాలా? బ్రోకరేజ్ సంస్థల వ్యూహం
ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ సిటీ (Citi).. కళ్యాణ్ జ్యువెలర్స్ లాంగ్ టర్మ్ వృద్ధిపై గట్టి నమ్మకాన్ని వ్యక్తపరిచింది. మొదటి త్రైమాసిక ఆదాయ వృద్ధి తమ అంచనాల కంటే కాస్త తక్కువగా ఉన్నప్పటికీ, కంపెనీ అనుసరిస్తున్న ఫ్రాంచైజ్ విస్తరణ వ్యూహం భవిష్యత్తులో లాభదాయకమైన వృద్ధికి తోడ్పడుతుందని అభిప్రాయపడింది. ఇది కంపెనీ 'రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్' (RoCE) ను మెరుగుపరుస్తుందని అంచనా వేసింది.
"కాండీర్ ప్లాట్‌ఫామ్ సాధిస్తున్న బలమైన వృద్ధి, కంపెనీ మున్ముందు మరింత పుంజుకోవడానికి అదనపు బూస్ట్‌లా పనిచేస్తుంది" అని సిటీ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లకు 'బై' (Buy) రేటింగ్‌ను పునరుద్ఘాటించిన సిటీ, టార్గెట్ ప్రైస్‌ను రూ. 750గా నిర్ణయించింది.
(గమనిక: పైన పేర్కొన్న అభిప్రాయాలు, సిఫార్సులు కేవలం వ్యక్తిగత విశ్లేషకులు, బ్రోకరేజ్ సంస్థలకు చెందినవి మాత్రమే. ఇన్వెస్టర్లు ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.)