తీవ్ర ఆందోళ‌న‌.. పాకిస్థాన్ ప్ర‌భుత్వానికి క‌పిల్ దేవ్‌, సునీల్ గవాస్క‌ర్ లెట‌ర్.. మ‌ర‌ణ గ‌ది.. అస‌లు ఏమైందంటే?

ఇండియా క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ తీవ్ర ఆందోళనతో పాకిస్థాన్ ప్రభుత్వానికి లెటర్ రాశారు. వీళ్లతో పాటు మరో 12 మంది క్రికెట్ లెజెండ్స్ కూడా ఈ లెటర్ పై సంతకాలు పెట్టారు.  మరి వీళ్లు ఎలా ఎందుకు చేశారో ఇక్కడ చూసేయండి. 

Published on: Feb 17, 2026, 13:36:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియా క్రికెట్ లెజెండ్స్ కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ తీవ్ర ఆందోళనతో పాకిస్థాన్ ప్రభుత్వానిక లెటర్ రాశారు. ఈ లెటర్ పై ఇతర 12 మంది దిగ్గజ క్రికెటర్లు కూడా సంతకాలు పెట్టారు. పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనతో ఈ దిగ్గజాలు ఇలా లెటర్ రాశారు. ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన ట్రీట్మెంట్ అందించాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కోరారు.

ఇమ్రాన్ ఖాన్, సునీల్ గవాస్కర్ (AFP)
ఇమ్రాన్ ఖాన్, సునీల్ గవాస్కర్ (AFP)

14 మంది లెజెండ్లు

పాకిస్థాన్ మాజీ ప్రధాని, 1992 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కు మద్దతుగా క్రికెట్ దిగ్గజాలు నిలిచారు. మంగళవారం (ఫిబ్రవరి 17) 14 మంది అంతర్జాతీయ మాజీ కెప్టెన్లు సంతకాలు చేసిన ఒక లెటర్ ను పాకిస్థాన్ ప్రభుత్వం, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌కు పంపించారు. 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌కు జైలులో సరైన వైద్య సౌకర్యాలు కల్పించాలని ఈ లెటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తోందన్న నివేదికల నేపథ్యంలో ఈ లేఖ వెలువడింది.

కపిల్, సునీల్

హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ కు అందిన లెటర్ ప్రకారం.. జైలులో ఇమ్రాన్ ఖాన్‌కు సరైన వైద్య చికిత్స అందేలా చూడాలని పాకిస్థాన్ ప్రభుత్వాన్ని ఈ దిగ్గజాలు కోరుతున్నారు. షెహబాజ్ షరీఫ్‌కు పంపించిన లెటర్ పై గ్రెగ్ చాపెల్, బెలిండా క్లార్క్, మైఖేల్ ఆథర్టన్, నాజర్ హుస్సేన్, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, ఇయాన్ చాపెల్, అలాన్ బోర్డర్, మైఖేల్ బ్రియర్లీ, డేవిడ్ గోవర్, కిమ్ హ్యూస్, క్లైవ్ లాయిడ్, స్టీవ్ వా, జాన్ రైట్ సంతకాలు చేశారు. అయితే దీనిపై ఇతర పాకిస్థాన్ మాజీ కెప్టెన్లలో ఎవరి సంతకమూ లేదు.

అయితే గత వారం వసీం అక్రమ్, వకార్ యూనిస్, షాహిద్ అఫ్రిది లాంటి పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు కూడా ఇమ్రాన్ ఖాన్‌కు సరైన వైద్యం అందేలా చూడాలని అధికారులను కోరుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ తన కుడి కంటి చూపులో 85% కోల్పోయారని రిపోర్టులు వచ్చాయి. ఆయన్ని జైలులో కలిసేందుకు ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదని ఆరోపణలున్నాయి. "నాన్నను చాలా చిన్న గదిలో ఉంచారు. దానిని మరణపు గది అని అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ మరణశిక్ష ఖరారైన వారిని ఉంచుతారు" అని ఇమ్రాన్ ఖాన్ కుమారుడు సులేమాన్ డిసెంబర్ 2025లో తెలిపాడు.

అవినీతి కేసులో

పాకిస్థాన్ ప్రధానిగా పని చేసిన సమయంలో ఇమ్రాన్ ఖాన్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కుంభకోణాల విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన పాకిస్థాన్ కోర్టు ఆయనకు 31 ఏళ్ల కారాగార శిక్ష విధించింది. ఇటీవల టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More