భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా కంపెనీల హవా పెరగకముందు మైక్రోమాక్స్, లావా, కార్బన్ వంటి స్వదేశీ బ్రాండ్లు ఏలిన రోజులను మన తెలుగు వినియోగదారులు అంత తేలిగ్గా మర్చిపోలేరు! ఆ తర్వాత ఒక్కో సంస్థ ఎగ్జిట్ అవుతూ వచ్చింది. కానీ ఇప్పుడు కార్బన్ ఇండియాలోకి రీ-ఎంట్రీ ఇచ్చింది! చాలా ఏళ్ల విరామం తర్వాత, బడ్జెట్ ధరల్లో నాణ్యమైన ఫోన్లను ఆశించే భారతీయ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని మన ముందుకు మళ్లీ వచ్చేసింది.

ఈ కొత్త ఇన్నింగ్స్‌లో భాగంగా కంపెనీ తమ సరికొత్త ‘కార్బన్ రెబెల్’, 'రెబెల్ ప్రో, ‘రెబెల్ 5జీ’ మోడళ్లను ఆవిష్కరించింది. ప్రధానంగా సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, మెరుగమైన డిస్‌ప్లే అనుభవం, నిరంతర కనెక్టివిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఈ కొత్త ఫోన్లు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ‘అమెజాన్’ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులోకి రానున్నాయి. 5జీ మోడల్ త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో గ్రామీణ, ద్వితీయ శ్రేణి నగరాల్లో రోజంతా ఛార్జింగ్ నిలిచే బడ్జెట్ ఫోన్లకు ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అలాంటి వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించిన కార్బన్ రెబెల్ సిరీస్ వివరాలు ఇవే:
కార్బన్ రెబెల్: 7000ఎంఏహెచ్ జంబో బ్యాటరీ పవర్‌హౌస్!
రోజంతా ప్రయాణాల్లో ఉంటూ లేదా పని ఒత్తిడి వల్ల తరచుగా ఛార్జింగ్ పెట్టుకోలేని వినియోగదారుల కోసం 'కార్బన్ రెబెల్' కచ్చితమైన ఎంపికగా నిలవనుంది.
బ్యాటరీ: ఈ విభాగంలోనే అత్యంత అరుదైన 7,000ఎంఏహెచ జంబో బ్యాటరీని ఇందులో అమర్చారు. (18డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది).
డిస్‌ప్లే: 6.75-అంగుళాల హెచ్డీ+ డిస్‌ప్లేతో పాటు 90హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌ను అందించారు. సాధారణ 60హెచ్‌జెడ్ స్క్రీన్‌లతో పోలిస్తే ఇది స్క్రోలింగ్ చేసేటప్పుడు చాలా స్మూత్‌గా ఉంటుంది.
కెమెరా అండ్ ప్రాసెసర్: వెనుక వైపు 50 ఎంపీ ఏఐ ప్రధాన కెమెరాను అమర్చారు. మీడియాటెక్ హెలియో జీ81 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. బ్లోట్‌వేర్ (పనికిరాని థర్డ్ పార్టీ యాప్‌లు) లేని స్వచ్ఛమైన ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఇది బ్లూ, గోల్డ్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.
కార్బన్ రెబెల్ ప్రో: 120హెచ్‌జెడ్ స్మూత్ డిస్‌ప్లే, 64ఎంపీ కెమెరా!
{{/usCountry}}కెమెరా అండ్ ప్రాసెసర్: వెనుక వైపు 50 ఎంపీ ఏఐ ప్రధాన కెమెరాను అమర్చారు. మీడియాటెక్ హెలియో జీ81 ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. బ్లోట్‌వేర్ (పనికిరాని థర్డ్ పార్టీ యాప్‌లు) లేని స్వచ్ఛమైన ఆండ్రాయిడ్ అనుభవాన్ని అందిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది. ఇది బ్లూ, గోల్డ్, సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.
కార్బన్ రెబెల్ ప్రో: 120హెచ్‌జెడ్ స్మూత్ డిస్‌ప్లే, 64ఎంపీ కెమెరా!
{{/usCountry}}కొంచెం మెరుగైన డిస్‌ప్లే అనుభవం, ఫోటోగ్రఫీ కోరుకునే వారి కోసం 'రెబెల్ ప్రో' మోడల్‌ను రూపొందించారు.
డిస్‌ప్లే: ఇందులో 120హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 720 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కూడిన 6.7-అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో అందించారు. దీనివల్ల గేమింగ్, వీడియోగ్రహణం చాలా స్పష్టంగా ఉంటుంది.
కెమెరా: ఫోటోల కోసం వెనుక వైపు ట్రిపుల్-రింగ్ డిజైన్‌తో కూడిన 64 ఎంపీ ఏఐ డ్యూయల్ కెమెరా సెటప్‌ను, ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరాను అమర్చారు.
ప్రాసెసర్ అండ్ బ్యాటరీ: ఇది కూడా హెలియో జీ81 ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 16 పైనే పనిచేస్తుంది. ఇందులో 6,000ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు 20డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. ఈ ఫోన్ చెర్రీ రెడ్, ఐస్ బ్లూ, గోల్డ్, గ్రే రంగుల్లో అందుబాటులోకి వస్తుంది.
కార్బన్ రెబెల్ 5జీ..
ప్రస్తుతం ఆవిష్కరించిన రెబెల్, రెబెల్ ప్రో స్మార్ట్‌ఫోన్స్ 4జీ నెట్‌వర్క్‌కు మద్దతు ఇస్తుండగా, వేగవంతమైన కనెక్టివిటీని కోరుకునే యువత కోసం కంపెనీ 'రెబెల్ 5జీ' మోడల్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. అయితే దీని ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్లు, ధరల వివరాలను కంపెనీ త్వరలోనే ప్రత్యేకంగా వెల్లడించనుంది.
ధరలు, బ్యాంక్ ఆఫర్ల వివరాలు..
కార్బన్ రెబెల్, రెబెల్ ప్రో మోడళ్లు రెండూ అమెజాన్‌లో ‘Amazon Specials’గా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్ల కింద తక్కువ ధరకే లభిస్తాయి.
కార్బన్ రెబెల్ (4జీ): ప్రారంభ ఆఫర్ ధర రూ. 11,999 కాగా, రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ వర్తిస్తే ఫలితంగా దీని ప్రభావవంతమైన ధర రూ. 10,999 కి తగ్గుతుంది.
కార్బన్ రెబెల్ ప్రో (4జీ): ప్రారంభ ఆఫర్ ధర రూ. 12,499 కాగా, రూ. 1,000 బ్యాంక్ ఆఫర్‌తో రూ. 11,499 కే సొంతం చేసుకోవచ్చు.
చైనీస్ బ్రాండ్ల ఆధిపత్యం నడుస్తున్న తరుణంలో, మేక్ ఇన్ ఇండియా ప్రతిపాదనలతో 7000ఎంఏహెచ్ బ్యాటరీ, క్లీన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తున్న కార్బన్ రీ-ఎంట్రీ భారత్‌లోని బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో కొత్త పోటీని తీసుకొస్తుందని అనడంలో సందేహం లేదు.