కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఒక సైనికుడు, ఇప్పుడు తన కుమార్తెకు న్యాయం కోసం వీధిపోరాటం చేయాల్సి వచ్చింది. నీట్ (NEET) పరీక్షల గందరగోళం, పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆత్మహత్య చేసుకున్న దెహ్రాదూన్ విద్యార్థిని రియా కుమారి థాపా తండ్రి రాజేష్ మాల్ ఆవేదన ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మిన్నంటింది. 1999 కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఈ ఉత్తరాఖండ్ యోధుడు, తన కుమార్తె ఫొటోను చేతిలో పట్టుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిరసన బాట పట్టారు.

మంగళవారం ఢిల్లీలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు సాగిన ఈ ప్రదర్శనలో వందలాది మంది విద్యార్థులు, బాధితుల కుటుంబాలు భాగమయ్యాయి.
"ప్రభుత్వాలు విన్నా వినకపోయినా, నా బిడ్డ తరఫున నేనే గొంతుకగా మారతా. బాధ్యతను గుర్తించే వరకు ఆమె ఫొటోతో ప్రతీ నిరసన ప్రదర్శనలోనూ పాల్గొంటా" అని రాజేష్ మాల్ ఆవేదనతో చెప్పారు.
కన్నీటి కథనం.. 'ఐ లవ్ యూ మమ్మీ, పప్పా'
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ నివాసంలో జూన్ 16న 23 ఏళ్ల రియా కుమారి థాపా ఆత్మహత్యకు పాల్పడింది. "ఐ లవ్ యూ మమ్మీ, పప్పా.. ఇందులో ఎవరి తప్పూ లేదు" అంటూ హిందీలో రాసిన సూసైడ్ నోట్ ఆమె గదిలో లభ్యమైంది. మే 3న జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఆరోపణలతో రద్దవడం, ఆపై జూన్ 21న రీ-టెస్ట్ ప్రకటించడంతో చదువుపై తీవ్ర ఒత్తిడికి గురై ఆమె ఈ దారుణానికి ఒడిగట్టిందని సీనియర్ పోలీస్ అధికారి అంకిత్ కందారీ తెలిపారు.
గత కొన్ని నెలలుగా నీట్ అక్రమాల వల్ల మానసిక వేదనకు గురై పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
కేంద్ర మంత్రి రాజీనామాకు డిమాండ్
ఢిల్లీ వీధుల్లో జరిగిన ఆందోళనల్లో రాజేష్ మాల్ నాయకులతో కలిసి వేదికను పంచుకున్నారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా కలిసి తన ఆవేదనను విన్నవించారు.
{{/usCountry}}ఢిల్లీ వీధుల్లో జరిగిన ఆందోళనల్లో రాజేష్ మాల్ నాయకులతో కలిసి వేదికను పంచుకున్నారు. అంతకుముందు ఆయన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కూడా కలిసి తన ఆవేదనను విన్నవించారు.
{{/usCountry}}ఈ దారుణాలపై ప్రభుత్వం కనీసం విచారం కూడా వ్యక్తం చేయకపోవడం అతిపెద్ద విషాదమని ఆయన వాపోయారు. విద్యార్థుల ప్రాణాలు పోతున్నా స్పందించని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
విద్యార్థులకు అండగా ఉంటాం: ప్రధాని మోదీ
మరోవైపు ఢిల్లీలో విద్యార్థుల నిరసనలు ఉధృతంగా మారిన వేళ, ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఈ అంశంపై మాట్లాడారు. నీట్ రీ-టెస్ట్‌ను త్వరితగతిన నిర్వహించి ఫలితాలు వెల్లడించడానికే ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని తెలిపారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ వివరాలను మీడియాకు వెల్లడిస్తూ.. పేపర్ లీకేజీలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రధాని స్పష్టం చేశారని చెప్పారు. లీకేజీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ అంశాన్ని రాజకీయం చేయకూడదని ప్రధాని పిలుపునిచ్చినట్లు వెల్లడించారు.