భారతదేశపు ప్రీమియం ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లోకి హంగేరియన్ బ్రాండ్ కీవే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది! పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, సరికొత్త బాబర్ స్టైల్ డిజైన్‌తో కూడిన ‘హైప్‌వోల్ట్-ఆర్’ అనే పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
బుకింగ్స్ ప్రారంభం.. మోటో వాల్ట్ ద్వారా విక్రయాలు

ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా నేతృత్వంలోని మల్టీ-బ్రాండ్ 'మోటో వాల్ట్' షోరూమ్‌ల ద్వారా ఈ కీవే హైప్‌వోల్ట్-ఆర్ స్కూటర్‌ను భారత్‌లో విక్రయించనున్నారు. ప్రీమియం పెర్ఫార్మెన్స్ సెగ్మెంట్లో లాంచ్ అయిన ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.99 లక్షలుగా ఉంది. కస్టమర్లు కేవలం రూ. 5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ సరికొత్త ఈవీని బుక్ చేసుకోవచ్చు.
కీవే హైప్‌వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- అదిరిపోయే బాబర్ స్టైల్ డిజైన్..
కీవే హైప్‌వోల్ట్-ఆర్ డిజైన్ మార్కెట్లో ఉన్న సాధారణ స్కూటర్లలా కాకుండా అత్యంత భిన్నంగా, ఫ్యూచరిస్టిక్‌గా ఉంటుంది. ఇది టీవీఎస్ ఎక్స్, బీఎండబ్ల్యూ Cఈ-02 వంటి ప్రీమియం మోడళ్లకు గట్టి పోటీని ఇవ్వనుంది.
ప్రత్యేకతలు: ఈ కీవే హైప్‌వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్లో సాధారణ స్కూటర్లలా ఫ్లాట్ ఫుట్‌బోర్డ్ ఉండదు, మధ్యలో సెంట్రల్ స్పైన్ డిజైన్‌ను అందించారు. రైడర్, పిలియన్ సీట్లు ఫ్లాట్‌గా ఉంటాయి.
లైటింగ్ అండ్ లుక్: వర్టికల్ (నిలువు) హెడ్‌ల్యాంప్స్ నేరుగా ఫ్రంట్ ఏప్రాన్‌పైనే అమర్చి ఉంటాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ వెనుక భాగం వీల్స్ వరకు సాగకుండా కట్ చేసినట్లు ఉండటం వల్ల దీనికి ఒక క్లాసిక్ ‘బాబర్-స్టైల్’ లుక్ వచ్చింది. ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, టైర్ హగ్గర్ దీని సొంతం.
కలర్ ఆప్షన్లు: ఇది క్రిస్టల్ వైట్, ప్లాటినం గ్రే అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.
కీవే హైప్‌వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- అడాస్ ఫీచర్‌తో!
{{/usCountry}}కలర్ ఆప్షన్లు: ఇది క్రిస్టల్ వైట్, ప్లాటినం గ్రే అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది.
కీవే హైప్‌వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- అడాస్ ఫీచర్‌తో!
{{/usCountry}}టెక్నాలజీ పరంగా కీవే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో సరికొత్త ఫీచర్లను జోడించింది. బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్/మెసేజ్ అలర్ట్స్, మ్యాప్ ప్రొజెక్షన్‌తో కూడిన నావిగేషన్‌ను సపోర్ట్ చేసే 5-ఇంచ్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇందులో ఉంది.
భద్రత కోసం అందించిన ఫీచర్లు:
కీలెస్ గో (స్మార్ట్ కీ సిస్టమ్)
ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్
హిల్-హోల్డ్, హిల్-డిసెంట్ కంట్రోల్
ఇంటెలిజెంట్ క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ మోడ్
బ్లైండ్‌స్పాట్ డిటెక్షన్‌తో కూడిన రివర్స్ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (అడాస్) ఫీచర్లు.
కీవే హైప్‌వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- పవర్‌ట్రెయిన్, రేంజ్, ఛార్జింగ్..
కీవే హైప్‌వోల్ట్-ఆర్‌లో 5 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం కలిగిన రెండు రిమూవబుల్ (బయటకు తీయగలిగే) బ్యాటరీలను అందించారు. ఇవి సింగిల్ ఛార్జ్‌పై గరిష్టంగా 180 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను అందిస్తాయని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఈ బ్యాటరీలను స్కూటర్ లోపల ఉంచి లేదా విడిగా బయటకు తీసి కేవలం 3 గంటల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు.
కీవే హైప్‌వోల్ట్-ఆర్ ఎలక్ట్రిక్ స్కూటర్- హార్డ్‌వేర్..
ఈ స్కూటర్ ముందు వైపు 100/80, వెనుక వైపు 120/70 ప్రొఫైల్ గల టైర్లతో కూడిన 14-ఇంచుల స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. కంఫర్ట్ రైడింగ్ కోసం ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్స్ సస్పెన్షన్ ఉన్నాయి. బ్రేకింగ్ కోసం రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఇచ్చారు.
గ్రౌండ్ క్లియరెన్స్: 130ఎంఎం
సీట్ హైట్: 770 ఎంఎం (తక్కువ హైట్ ఉన్నవారికైనా సులభంగా సరిపోతుంది)
బూట్ స్పేస్: సీటు కింద 27 లీటర్ల స్టోరేజ్ స్పేస్ లభిస్తుంది.