కొచ్చి: లైంగిక దాడికి గురై గర్భం దాల్చిన 15 ఏళ్ల బాలికకు కేరళ హైకోర్టు కీలక ఊరటనిచ్చింది. 27 వారాలు దాటిన గర్భాన్ని వైద్యపరంగా తొలగించుకునేందుకు (ఎంటీపీ) కోర్టు అనుమతి ఇచ్చింది. పిండం జీవించే అవకాశం ఉందని, 32 వారాల వరకు గర్భాన్ని కొనసాగించాలని వైద్య మండలి సూచించినప్పటికీ, బాధితురాలి మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది.

భారతదేశంలోని మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టం ప్రకారం సాధారణంగా 20 వారాల వరకు, ప్రత్యేక పరిస్థితుల్లో (అత్యాచార బాధితులు, మైనర్లు) 24 వారాల వరకు మాత్రమే గర్భస్రావానికి వీలుంటుంది. ఆ గడువు దాటిన తర్వాత గర్భాన్ని తొలగించాలంటే న్యాయస్థానం అనుమతి తప్పనిసరి.
లైంగిక దాడి తాలూకు తీవ్ర మానసిక వేదన కారణంగా గర్భాన్ని కొనసాగించేందుకు బాధితురాలు ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో బాలికకు గర్భస్రావం చేసేందుకు జస్టిస్ హరిశంకర్ వి. మీనన్ అనుమతించారు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల నుంచి లిఖితపూర్వక అంగీకారం తీసుకున్న తర్వాత, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్య ప్రక్రియ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
వైద్య మండలి అభ్యంతరాలు ఇవే..
అంతకుముందు బాలికను పరీక్షించిన వైద్య మండలి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రస్తుత దశలో గర్భస్రావం లేదా ప్రసవం చేస్తే నెలలు నిండకుండానే బిడ్డ పుట్టే ప్రమాదం ఉందని పేర్కొంది. దీనివల్ల శిశువుకు సెరిబ్రల్ పాల్సీ వంటి కండరాల, నరాల సంబంధిత లోపాలు, కంటి చూపు మందగించడం, తీవ్రమైన మేధోపరమైన, నాడీ అభివృద్ధి వైకల్యాలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉందని హెచ్చరించింది. జీవితాంతం వేధించే ఈ తీవ్ర వైకల్యాలను దృష్టిలో ఉంచుకుని, 32 వారాలు నిండే వరకు వేచి చూడాలని బోర్డు ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది.
శిశువు బతికితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి
వైద్య ప్రక్రియ సమయంలో శిశువు సజీవంగా బయటపడితే, తగిన నవజాత శిశు సంరక్షణ (నియోనేటల్ కేర్) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. "వైద్య మండలి నివేదికలో పేర్కొన్నట్లుగా శిశువుకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే, అవసరమైనప్పుడల్లా ప్రభుత్వమే తగిన వైద్య సహాయం అందించాలి" అని కోర్టు ఆదేశించింది. ఒకవేళ శిశువు సజీవంగా జన్మించి, ఆ బిడ్డను పెంచుకునేందుకు బాధితురాలు ఇష్టపడకపోతే.. దత్తత ఇచ్చేందుకు వీలుగా శిశువును ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వానికి అప్పగించాలని సూచించింది.
డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలు భద్రపరచాలి
{{/usCountry}}వైద్య ప్రక్రియ సమయంలో శిశువు సజీవంగా బయటపడితే, తగిన నవజాత శిశు సంరక్షణ (నియోనేటల్ కేర్) అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. "వైద్య మండలి నివేదికలో పేర్కొన్నట్లుగా శిశువుకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే, అవసరమైనప్పుడల్లా ప్రభుత్వమే తగిన వైద్య సహాయం అందించాలి" అని కోర్టు ఆదేశించింది. ఒకవేళ శిశువు సజీవంగా జన్మించి, ఆ బిడ్డను పెంచుకునేందుకు బాధితురాలు ఇష్టపడకపోతే.. దత్తత ఇచ్చేందుకు వీలుగా శిశువును ఎలాంటి షరతులు లేకుండా ప్రభుత్వానికి అప్పగించాలని సూచించింది.
డీఎన్ఏ పరీక్షల కోసం నమూనాలు భద్రపరచాలి
{{/usCountry}}ఈ ఘటనపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైనందున దర్యాప్తు అవసరాలను కూడా న్యాయస్థానం ప్రస్తావించింది. "గర్భస్రావ ప్రక్రియలో శిశువు బతకకపోతే.. డీఎన్ఏ, ఫింగర్ ప్రింటింగ్, మ్యాపింగ్ వంటి అవసరమైన వైద్య పరీక్షల కోసం ప్రతివాదులు పిండం కణజాలం, రక్త నమూనాలను తప్పనిసరిగా భద్రపరచాలి" అని కోర్టు తన ఉత్తర్వుల్లో తేల్చిచెప్పింది. బాధితురాలి శారీరక, మానసిక ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, అదే సమయంలో భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.