నేటి కాలంలో విలువ కోల్పోతున్న ‘ఒక్క రూపాయి’ కోసం ఓ సామాన్యుడు పెద్ద పోరాటమే చేశాడు! తనకు దక్కాల్సిన ఆ ఒక్క రూపాయి కోసం భారతీయ రైల్వేకి చెందిన ఐఆర్‌సీటీసీని కోర్టు మెట్లు ఎక్కించాడు. టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు రావాల్సిన రీఫండ్ మొత్తంలో ఒక్క రూపాయి తక్కువ ఇచ్చారనే కారణంతో కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించి, రైల్వే శాఖ నిర్లక్ష్యాన్ని నిలదీశాడు.

కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాకు చెందిన ఆ ప్రయాణికుడు ఐఆర్‌సీటీసీ సేవల్లోని లోపాలను సవాలు కేసు దాఖలు చేశాడు. విచారణ అనంతరం కాసర్‌గోడ్ జిల్లా కన్జ్యూమర్ కమిషన్ బాధితుడికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పునిచ్చింది.
అసలేం జరిగింది?
సదరు ప్రయాణికుడు 2024 ఆగస్టు 11న త్రీ-టైర్ ఏసీ కోచ్‌లో రూ. 553 చెల్లించి రైలు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఆగస్టు 20న ప్రయాణం చేయాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రయాణానికి మూడు రోజుల ముందే అంటే ఆగస్టు 17న టికెట్‌ను రద్దు చేసుకున్నాడు.
రైల్వే నిబంధనల ప్రకారం.. టికెట్ రద్దు రుసుము కింద రూ. 180, దానికి 5 శాతం జీఎస్టీ రూ. 9 కలిపి మొత్తం రూ. 189 మినహాయించుకోవాలి. ఈ లెక్కన ప్రయాణికుడికి రూ. 341 రీఫండ్ రావాల్సి ఉంది. కానీ, ఐఆర్‌సీటీసీ మాత్రం ఆయన ఖాతాలో రూ. 340 మాత్రమే జమ చేసింది1
కోర్టును ఆశ్రయించిన బాధితుడు..
బాకీ ఉన్న ఆ ఒక్క రూపాయిని తిరిగి ఇవ్వకపోవడం వల్ల మానసిక వేదనకు గురయ్యానని, ఇది వినియోగదారుడి నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు ప్రయాణికుడు కన్జ్యూమర్ కమిషన్‌ను ఆశ్రయించాడు. తనకు జరిగిన మానసిక క్షోభకు, సేవా లోపానికి నష్టపరిహారంగా రూ. 2 లక్షలతో పాటు కోర్టు ఖర్చుల కింద రూ. 5,000 ఇప్పించాలని కోరాడు.
మన దేశంలో రోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా టికెట్లు రద్దు చేసుకుంటుంటారు. చాలామంది చిల్లర రూపాయల గురించి పట్టించుకోరు. కానీ ఈ రూపాయిల వెనుక జరిగే కార్పొరేట్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికే తాను న్యాయపోరాటం చేసినట్లు ఆయన తెలిపాడు.
వినియోగదారుల కమిషన్ తీర్పు..
{{/usCountry}}మన దేశంలో రోజూ లక్షలాది మంది ప్రయాణికులు ఆన్లైన్ ద్వారా టికెట్లు రద్దు చేసుకుంటుంటారు. చాలామంది చిల్లర రూపాయల గురించి పట్టించుకోరు. కానీ ఈ రూపాయిల వెనుక జరిగే కార్పొరేట్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించడానికే తాను న్యాయపోరాటం చేసినట్లు ఆయన తెలిపాడు.
వినియోగదారుల కమిషన్ తీర్పు..
{{/usCountry}}ఈ కేసును విచారించిన జిల్లా వినియోగదారుల కమిషన్ ప్రెసిడెంట్ కృష్ణన్ కే, సభ్యురాలు బీనా కేజీలతో కూడిన ధర్మాసనం ఐఆర్‌సీటీసీని తప్పుబట్టింది. ఒక్క రూపాయి తక్కువ ఎందుకు కట్ చేశారో సమర్థించుకోవడంలో ఐఆర్‌సీటీసీ పూర్తిగా విఫలమైందని స్పష్టం చేసింది. ఇది స్పష్టంగా సేవా లోపం, అన్-ఫెయిర్ వ్యాపార విధానమేనని కమిషన్ తేల్చిచెప్పింది.
"కేవలం ఒక్క రూపాయి తక్కువ చెల్లించినప్పటికీ, అది కూడా ఎంతో కీలకమైనది. కాబట్టి ఫిర్యాదుదారుడికి రూ. 100 నష్టపరిహారం పొందే హక్కు ఉంది. దానితో పాటు కోర్టు ఖర్చుల కింద రూ. 3,000 పొందడానికి అర్హుడు," అని కమిషన్ తన తీర్పులో పేర్కొంది.
కమిషన్ ఇచ్చిన ఆదేశాలు ఇవే:
- రద్దు చేసిన తేదీ (17.08.2024) నుంచి చెల్లించే రోజు వరకు మిగిలిన రూ. 1 పై 9 శాతం వార్షిక వడ్డీతో రీఫండ్ చేయాలి.
- సేవా లోపానికి గానూ రూ. 100 నష్టపరిహారం చెల్లించాలి.
- లీగల్ ఖర్చుల కింద రూ. 3,000 ఫిర్యాదుదారుడికి అందించాలి.
- ఈ మొత్తం రూ. 3,101 ను 30 రోజుల్లోగా ప్రయాణికుడికి చెల్లించాలని ఐఆర్‌సీటీసీని ఆదేశించింది.
ఒక్క రూపాయి కోసం పోరాడి విజయం సాధించిన ఈ కేరళ వాసి ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమ హక్కుల పట్ల వినియోగదారులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ కేసు నిరూపిస్తోంది.