రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో సానుకూల శక్తి కోసం ఈ 6 పరిహారాలు పాటించండి!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అగ్ని, నీరు, వాయువు, ఆకాశం, భూమి అనే పంచభూతాల సమతుల్యత ముఖ్యమైనదిగా భావిస్తారు. వీటిలో అసమతుల్యత ఇంటి వాతావరణంపై ప్రభావం చూపుతుందని వాస్తు విశ్వాసం.  

Published on: Oct 6, 2026, 16:30:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తగ్గుతుంది. మీరు కూడా వాస్తు ప్రకారం అనుసరించాలనుకుంటున్నారా? అది కూడా రూపాయి ఖర్చు లేకుండా వాస్తు సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే.

రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో సానుకూల శక్తి కోసం ఈ 6 పరిహారాలు పాటించండి! (AI)
రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో సానుకూల శక్తి కోసం ఈ 6 పరిహారాలు పాటించండి! (AI)

ఇంట్లో తరచూ గొడవలు, సంబంధాల్లో ఉద్రిక్తతలు, ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఎదురైనప్పుడు కాస్త ఓపికతో ఈ పరిహారాలను పాటించండి. చాలా మంది వీటిని వాస్తు దోషాలతో ముడిపెడుతూ ఉంటారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో అగ్ని, నీరు, వాయువు, ఆకాశం, భూమి అనే పంచభూతాల సమతుల్యత చాలా ముఖ్యం. పంచభూతాల్లో అసమతుల్యత ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఖర్చు లేకుండా ఈ సమస్యలన్నిటినీ సెట్ చేయాలంటే ఈ సులువైన పరిహారాలను ప్రయత్నించండి.

బాత్రూంలో పటిక లేదా ఉప్పు

వాస్తు ప్రకారం బాత్రూంలో ఒక గాజు గిన్నె పెట్టి పటిక ఉంచండి. కొందరు దీనికి బదులు ఉప్పును కూడా వాడుతూ ఉంటారు. ఇలా చేయడం వలన ప్రతికూలత తగ్గుతుంది. పైగా పటిక లేదా ఉప్పు ఇన్ఫెక్షన్స్‌ను తగ్గించడానికి కూడా సహాయం చేస్తాయి. ఇలా ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనాలను పొందడానికి వీలవుతుంది.

ఈశాన్య మూలలో వంటగదిని నిర్మించవద్దు

వాస్తు ప్రకారం ఈశాన్య దిశలో వంటగది ఉండకూడదు. వాస్తు ప్రకారం ఈశాన్య మూలను జలతత్వానికి సంబంధించినదిగా భావిస్తారు. అలాగే ఆగ్నేయ దిశను అగ్ని మూలకంగా భావిస్తారు. కనుక ఈశాన్య మూలలో వంటగది ఉండడం సరైనది కాదు. ఆగ్నేయం వైపు వంటగది ఉంటే అనుకూలంగా ఉంటుంది. ఇంటి నిర్మాణాలు చేపట్టేటప్పుడు ఈ పొరపాటు చేయకుండా చూసుకోవాలి.

నీళ్లలో ఉప్పు కలపండి

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు ఆ నీటిలో కాస్త ఉప్పును కలపండి. ఇది ప్రతికూల శక్తిని తగ్గించడానికి సహాయం చేస్తుంది. సానుకూల శక్తిని వ్యాపించేటట్టు చేస్తుంది. అలాగే ఇల్లు పరిశుభ్రంగా కూడా ఉంటుంది.

ఉత్తర దిశలో నీళ్లు

ఉత్తర దిశను సంపద, అవకాశాల దిశ అంటారు. కుబేరుడి దిశ కూడా అని అంటారు. అయితే జలతత్వాన్ని సమతుల్యం చేయడానికి ఉత్తర దిశలో నీటి పాత్రను పెట్టండి. ఇది మంచి ఫలితాలను అందిస్తుంది.

ప్రధాన ద్వారం దగ్గర స్వస్తిక గుర్తు వేయండి

ఇది శుభం, అదృష్టానికి ప్రతీక. చాలా ఇళ్లల్లో ప్రధాన ద్వారం దగ్గర కుంకుమ, చందనంతో స్వస్తిక గుర్తు వేస్తారు. ఇది మంచి ఫలితాలను అందిస్తుంది.

ఇల్లు చీకటిగా ఉండకూడదు

ఇల్లు చీకటిగా ఉండకూడదు. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ఇంట్లో వెలుతురు ఉండేటట్టు చూసుకోండి. ముఖద్వారం దగ్గర కూడా చీకటిగా లేకుండా చూసుకోండి. అలా వెలుతురుతో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, సిరిసంపదలు కూడా కలుగుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More