కేరళలోని చంగనస్సేరిలో జరిగిన ఒక పెళ్లి.. చాలా భిన్నంగా, ప్రపంచంలో ఎక్కడా చూడని అరుదైన సన్నివేశంతో వార్తల్లో నిలిచింది. ఈ వివాహ వేడుకలోని ప్రధాన పాత్రలన్నీ కవలలే కావడం విశేషం. అంటే.. వధూవరులు ట్విన్సే, పెళ్లి జరిపించిన వారు ట్విన్సే!

గురువారం నాడు చంగనస్సేరి మెట్రోపాలిటన్ చర్చీలో ఈ విచిత్రమైన సన్నివేశం ఆవిష్కృతమైంది. వరుడు అఖిల్ కే. థామస్ చెయ్యి పట్టుకుని వధువు మ్యాగి మేరీ థామస్ నిలబడగా.. అఖిల్ కవల సోదరుడు నిఖిల్ కే. థామస్ పక్కన, మ్యాగి కవల సోదరి మరియా మేరీ థామస్ నిలబడింది.
ఇక ఈ పెళ్లి వేడుకను జరిపించిన ఫాదర్లు (పురోహితులు) కూడా కవల సోదరులే కావడం, వారికి సహాయకులుగా (అల్తార్ బాయ్స్) వ్యవహరించిన ఇద్దరు బాలురు కూడా కవలలు కావడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంలో మునిగిపోయారు.
ఇలా.. రెండు కుటుంబాలకు ఇది కేవలం పెళ్లి మాత్రమే కాదు.. ఎన్నో ఏళ్లుగా తాము కంటున్న ఒక అందమైన కల నెరవేరిన క్షణం.
ఎవరు ఎక్కడి వారు?
వరులైన అఖిల్, నిఖిల్‌లు.. చంగనస్సేరి వెట్టుపరంబిల్ నివాసితులైన కుంజుమోన్ థామస్, జోమోల్ దంపతుల కవల పిల్లలు. ఇక వధువులైన మ్యాగి, మరియాలు పతనంతిట్ట జిల్లా కులత్తూర్‌కు చెందిన తోమిచన్, మేరీకుట్టి దంపతుల కవల కుమార్తెలు.
ఇక ఈ పెళ్లి తంతును నడిపించేందుకు కంజిరపల్లి డయోసిస్‌కు చెందిన (కవల) ఫాదర్లు ఆంటో పెజుంకట్టిల్, అజో పెజుంకట్టిల్ ప్రత్యేకంగా విచ్చేశారు. వారికి సహాయకులుగా.. కవల సోదరులు జెరాన్ జేమ్స్, జోహన్ జేమ్స్‌లు వ్యవహరించారు.
పక్కా ప్లాన్‌తో..
పెళ్లిలో అన్ని ముఖ్యమైన పాత్రల్లోనూ కవలలే ఉండాలనే ఆలోచన అనుకోకుండా వచ్చిందేమీ కాదు! చిన్నప్పటి నుంచే తమ పెళ్లి వేడుక కవలల సమక్షంలోనే అట్టహాసంగా జరగాలని ఆ అక్కాచెల్లెళ్లు కలలు కన్నారు.
కొత్తపల్లోర్లోని ఒక స్థానిక చర్చికి కవలలు ఎక్కువగా వస్తుంటారని తెలుసుకుని, మ్యాగి, మరియా స్వయంగా వెతికి సదరు ఫాదర్లను కలిశారు. తమ పెళ్లికి రావాల్సిందిగా కోరగానే వారు కూడా సంతోషంగా అంగీకరించారు. "కవలల చుట్టూ పెళ్లి చేసుకోవాలనేది చిన్నప్పటి నుంచి మా కల. మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఇదే కోరుకున్నారు. ఏసుక్రీస్తు దయవల్ల ఈ కల నిజమైంది," అని వధువులు ఆనందంతో చెప్పారు.
{{/usCountry}}కొత్తపల్లోర్లోని ఒక స్థానిక చర్చికి కవలలు ఎక్కువగా వస్తుంటారని తెలుసుకుని, మ్యాగి, మరియా స్వయంగా వెతికి సదరు ఫాదర్లను కలిశారు. తమ పెళ్లికి రావాల్సిందిగా కోరగానే వారు కూడా సంతోషంగా అంగీకరించారు. "కవలల చుట్టూ పెళ్లి చేసుకోవాలనేది చిన్నప్పటి నుంచి మా కల. మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా ఇదే కోరుకున్నారు. ఏసుక్రీస్తు దయవల్ల ఈ కల నిజమైంది," అని వధువులు ఆనందంతో చెప్పారు.
{{/usCountry}}ఈ అరుదైన పెళ్లి గురించి ఫాదర్లు మాట్లాడుతూ.. “కవలల పెళ్లి జరిపించడం మా జీవితంలో మర్చిపోలేని అనుభూతి. ఇది మాకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. ఒకేసారి జన్మించిన వారు కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు, అలాగే మేము కూడా ఒకేసారి దైవ సేవలోకి అడుగుపెట్టాం. ఇది ఎంతో అందమైన అనుభవం,” అని పేర్కొన్నారు.
మర్చంట్ నేవీలో పనిచేస్తున్న నిఖిల్, అఖిల్‌లు.. ఐటీ రంగంలో స్థిరపడిన మ్యాగి, మరియాల చేయందుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసేందుకు వచ్చిన బంధుమిత్రులకు ఇది ఒక మర్చిపోలేని తీపి అనుభవంగా మిగిలిపోయింది.