భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం వేగంగా పుంజుకుంటున్నప్పటికీ, కస్టమర్లను ప్రధానంగా వేధించే ప్రశ్న 'బ్యాటరీ లైఫ్, దాని మార్పిడి వ్యయం'. ఈ ఆందోళనకు తెరదించుతూ కియా ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎంపీవీ ‘కారెన్స్ క్లావిస్ ఈవీ’ కోసం 15 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల హై-వోల్టేజ్ బ్యాటరీ వారంటీ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది!
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ- పాత వారంటీ స్థానంలో సరికొత్త భరోసా!

గతంలో ఈ ఎలక్ట్రిక్ కారుపై 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ పరిమితి మాత్రమే ఉండేది. తాజా నిర్ణయంతో 2026 ఆగస్టు 1వ తేదీ నుంచి కొనుగోలు చేసిన మొదటి యజమానులకు 15ఏళ్ల పాటు ఎటువంటి కిలోమీటర్ల పరిమితి లేకుండా పూర్తి వారంటీ రక్షణ లభిస్తుంది!
అదే సమయంలో పాత కియా కారెన్స్ క్లావిస్ ఈవీ కొనుగోలుదారులను సంస్థ విస్మరించలేదు. 2026 ఆగస్టు 1 కంటే ముందు ఈ కారును సొంతం చేసుకున్న కస్టమర్లు కేవలం రూ. 3,400 (పన్నులతో కలిపి) చెల్లించి తమ ప్రస్తుత 8 ఏళ్ల వారంటీని 15 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల ప్లాన్‌కు పెంచుకోవచ్చు. దీని కోసం వాహనాన్ని సమీప డీలర్‌షిప్‌లో తనిఖీ చేయించాల్సి ఉంటుంది.
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ- నిబంధనలు, మినహాయింపులు..
ఈ 15 ఏళ్ల వారంటీ సౌకర్యం కారెన్స్ క్లావిస్ ఈవీ మొదట కొనుగోలు చేసిన వ్యక్తికి మాత్రమే వర్తిస్తుంది. కారును సెకండ్ హ్యాండ్‌లో వేరొకరికి విక్రయిస్తే, రెండొవ యజమానికి పాత పద్ధతిలోనే 8 ఏళ్లు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ వర్తిస్తుంది. అలాగే టాక్సీలు, కమర్షియల్ ఫ్లీట్ అవసరాలకు వాడే వాహనాలకు కూడా ఈ 15 ఏళ్ల ప్లాన్ వర్తించదని, వాటికి 8 ఏళ్లు/1.6 లక్షల కిలోమీటర్ల పరిమితి మాత్రమే ఉంటుందని కియా స్పష్టం చేసింది.
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ- ఛార్జింగ్ నెట్‌వర్క్, బీఏఏఎస్ సౌకర్యం
వాహన కొనుగోలు భారాన్ని తగ్గించేందుకు కియా 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇది కారు ప్రారంభ ధరను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇక ఛార్జింగ్ సమస్యలు లేకుండా ఉండేందుకు మైకియా యాప్ ఆధారిత ‘కే-ఛార్జ్’ నెట్‌వర్క్ ద్వారా 23 ఆపరేటర్లకు చెందిన 20,300 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను ఒకే గొడుగు కిందకు తెచ్చింది.
{{/usCountry}}వాహన కొనుగోలు భారాన్ని తగ్గించేందుకు కియా 'బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్' (బీఏఏఎస్) ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇది కారు ప్రారంభ ధరను తగ్గించడంలో తోడ్పడుతుంది. ఇక ఛార్జింగ్ సమస్యలు లేకుండా ఉండేందుకు మైకియా యాప్ ఆధారిత ‘కే-ఛార్జ్’ నెట్‌వర్క్ ద్వారా 23 ఆపరేటర్లకు చెందిన 20,300 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లను ఒకే గొడుగు కిందకు తెచ్చింది.
{{/usCountry}}దేశవ్యాప్తంగా 400 నగరాల్లో కియాకు 900కి పైగా కస్టమర్ టచ్‌పాయింట్లు ఉన్నాయి. వీటిలో 129 డీలర్‌షిప్‌లలో హై-కెపాసిటీ డిసి ఫాస్ట్ ఛార్జర్లు, 275కి పైగా ప్రత్యేక ఈవీ వర్క్‌షాప్‌లు అందుబాటులో ఉన్నాయి.
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ- బ్యాటరీ ఆప్షన్లు, పవర్, రేంజ్..
భారత్‌లోనే తయారు చేసిన కియా తొలి ఎలక్ట్రిక్ వాహనమైన క్యారెన్స్ క్లావిస్ ఈవీ, రెండు లిక్విడ్-కూల్డ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తోంది:
42 kWh బ్యాటరీ: ఇది 135 hp పవర్, 255 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 404 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది.
51.4 kWh ఎక్స్‌టెండెడ్ రేంజ్: ఇది 171 hp పవర్, 255 Nm టార్క్ ఇస్తుంది. సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 490 కిలోమీటర్ల రేంజ్ ఆఫర్ చేస్తుంది.
100 kW డీసీ ఫాస్ట్ ఛార్జర్‌ని ఉపయోగిస్తే రెండు బ్యాటరీలను కేవలం 39 నిమిషాల్లో 10 నుంచి 80 శాతానికి ఛార్జ్ చేయవచ్చు. అదే 11 kW ఏసీ ఛార్జర్ ద్వారా 42 kWh బ్యాటరీకి 4 గంటలు, 51.4 kWh బ్యాటరీకి 4 గంటల 45 నిమిషాల సమయం పడుతుంది.
ఈ కియా కారెన్స్ క్లావిస్ ఎలక్ట్రిక్ ఎంపీవీ 4,550 ఎంఎం పొడవు, 1,800 ఎంఎం వెడల్పు, 1,730 ఎంఎం ఎత్తు, 2,780 ఎంఎం వీల్‌బేస్‌తో 6, 7 సీటర్ లేఅవుట్లలో లభిస్తోంది.