కియా ఇండియా తన కార్ల కొనుగోలుదారులకు గుడ్ వార్త చెప్పింది. ఆగస్టు 2026 నెలలో ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. దాదాపు తన అన్ని మోడళ్లపై ఈ ప్రయోజనాలను అందిస్తోంది. మోడల్, వేరియంట్‌ను బట్టి నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాప్ ఇన్సెంటివ్‌లు, కార్పొరేట్ బెనిఫిట్లు, లాయల్టీ బోనస్‌లను కస్టమర్లు పొందవచ్చు. కియా కార్నివాల్ కారుపై గరిష్టంగా రూ. లక్ష వరకు తగ్గింపు లభిస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ నెలలో ఏ మోడల్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో చూద్దాము.
కియా సోనెట్ డిస్కౌంట్లు ఆగస్టు 2026..
కియా సోనెట్ 1.2 హెచ్‌టీఎక్స్(ఓ) వేరియంట్‌పై రూ. 10,000 నగదు తగ్గింపు లభిస్తోంది. కొనుగోలుదారులు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 15,000 స్క్రాప్ బెనిఫిట్, రూ. 15,000 వరకు కార్పొరేట్ బెనిఫిట్ పొందవచ్చు. వీటితో పాటు డీలర్ స్థాయి ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
కియా సైరోస్ డిస్కౌంట్లు ఆగస్టు 2026..
పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే కియా సైరోస్ ఎస్‌యూవీని కొనుగోలు చేసే వారికి రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. అలాగే రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ. 20,000 స్క్రాప్ ఇన్సెంటివ్, రూ. 15,000 కార్పొరేట్ బెనిఫిట్‌తో పాటు డీలర్ లెవల్ ఆఫర్లు వర్తిస్తాయి.
కాగా ప్రస్తుతానికి కియా సైరోస్ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై ఎలాంటి ప్రత్యేక డిస్కౌంట్లు లేవు.
కియా సెల్టోస్ డిస్కౌంట్లు ఆగస్టు 2026..
పాపులర్ ఎస్‌యూవీ కియా సెల్టోస్‌పై రూ. 20,000 లాయల్టీ బోనస్, రూ. 20,000 కార్పొరేట్ బెనిఫిట్ అందిస్తున్నారు. వీటితో పాటు డీలర్ల వద్ద ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి.
కియా కారెన్స్ క్లావిస్ టర్బో డిస్కౌంట్లు ఆగస్టు 2026..
కారెన్స్ క్లావిస్ టర్బో-పెట్రోల్ మోడల్‌పై ఈ నెలలో మంచి ఆఫర్ ప్యాకేజీ లభిస్తోంది. కొనుగోలుదారులు రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. వీటితో పాటు రూ. 15,000 కార్పొరేట్ బెనిఫిట్, రూ. 20,000 లాయల్టీ బోనస్, రూ. 20,000 స్క్రాప్ బెనిఫిట్ అందుబాటులో ఉన్నాయి.
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ డిస్కౌంట్లు ఆగస్టు 2026..
{{/usCountry}}కారెన్స్ క్లావిస్ టర్బో-పెట్రోల్ మోడల్‌పై ఈ నెలలో మంచి ఆఫర్ ప్యాకేజీ లభిస్తోంది. కొనుగోలుదారులు రూ. 10,000 నగదు తగ్గింపు, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు. వీటితో పాటు రూ. 15,000 కార్పొరేట్ బెనిఫిట్, రూ. 20,000 లాయల్టీ బోనస్, రూ. 20,000 స్క్రాప్ బెనిఫిట్ అందుబాటులో ఉన్నాయి.
కియా కారెన్స్ క్లావిస్ ఈవీ డిస్కౌంట్లు ఆగస్టు 2026..
{{/usCountry}}ఈ ఎలక్ట్రిక్ వెర్షన్‌పై రూ. 20,000 నగదు తగ్గింపు ఉంది. అంతేకాకుండా రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బెనిఫిట్, రూ. 15,000 కార్పొరేట్ బెనిఫిట్, రూ. 20,000 లాయల్టీ బోనస్, రూ. 20,000 స్క్రాప్ ఇన్సెంటివ్‌ను కస్టమర్లు దక్కించుకోవచ్చు.
కియా కార్నివాల్ డిస్కౌంట్లు ఆగస్టు 2026..
కియా లైనప్‌లో అత్యంత ప్రీమియం ఎంపీవీ అయిన కార్నివాల్‌పైనే అత్యధిక ప్రయోజనం లభిస్తోంది. దీనిపై రూ. 1 లక్ష ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 50,000 కార్పొరేట్, స్క్రాప్ బెనిఫిట్లు అందిస్తున్నారు.
గమనిక: ఆఫర్ షీట్ ప్రకారం.. ఈ ప్రయోజనాలు కేవలం 2026 మోడల్ ఇయర్ (ఎంవై2026) స్టాక్‌లోని కొన్ని ప్రత్యేక వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తాయి. నగరాలను బట్టి ఆఫర్లలో మార్పులు ఉండవచ్చు. ప్రాంతాన్ని బట్టి, అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి డీలర్ స్థాయి స్కీమ్స్ కూడా మారే అవకాశం ఉంది.