Upcoming Kia cars in India : క్రేజీ అప్డేట్! కియా నుంచి 2 కొత్త కార్లు- ఈవీ, హైబ్రిడ్..
Upcoming Kia cars in India : భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి కియా ఇండియా సరికొత్త ఈవీ, హైబ్రిడ్ కార్లను తీసుకురాబోతోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంస్థ విడుదల చేసిన ఓ క్రేజీ టీజర్ ఇప్పుడు వాహన ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
భారతదేశంలో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను అందిపుచ్చుకోవడానికి ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'కియా ఇండియా' సరికొత్త వ్యూహంతో దూసుకొస్తోంది! ఈ నేపథ్ంలోనే తన సోషల్ మీడియా ఛానళ్ల ద్వారా కంపెనీ ఒక ఆసక్తికరమైన టీజర్‌ను విడుదల చేసింది. ఈ వీడియో క్లిప్‌లో "హెచ్ఈవీ" (హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్), "బీఈవీ" (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) అనే పదాలు మారుతూ కనిపిస్తున్నాయి. దీనికి "భవిష్యత్తు తలుపు తడుతోంది.. ఒకే ఒక క్లూ, ఒకటి కంటే ఎక్కువ అవకాశాలు" అనే క్యాప్షన్‌ను జత చేసింది. కంపెనీ అధికారికంగా మోడళ్ల పేర్లను ప్రకటించనప్పటికీ, ఈ టీజర్ ద్వారా భారత్‌లోకి ఒక సరికొత్త ప్యూర్ ఎలక్ట్రిక్ కారు, అలాగే ఒక పవర్‌ఫుల్ హైబ్రిడ్ కారు రాబోతున్నట్లు స్పష్టమైంది.

మార్కెట్లోకి రానున్న మోడళ్లు ఏవి?
ఆటోమొబైల్ వర్గాల సమాచారం, ఇటీవల భారత రోడ్లపై జరిపిన టెస్టింగ్స్ ఆధారంగా.. కియా విడుదల చేయబోయే బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ ‘కియా సైరోస్ ఈవీ’ అని, హైబ్రిడ్ మోడల్ 'కియా సొరెంటో హైబ్రిడ్' అని గట్టిగా భావిస్తున్నారు.
కియా సైరోస్ ఈవీ..
ఇప్పటికే దేశీయ రోడ్లపై పలుమార్లు టెస్టింగ్ చేస్తూ కనిపించిన సైరోస్ ఈవీ లాంచ్‌కు సమయం దగ్గరపడింది! ప్రస్తుతం మార్కెట్లో ఉన్న క్యారెన్స్ క్లావిస్ ఈవీ, ఈవీ6, ఈవీ9 మోడళ్ల తర్వాత భారత మార్కెట్లో కియా నుంచి రాబోతున్న నాలుగో ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం.
డిజైన్, ఫీచర్లు: పెట్రోల్ వెర్షన్ సైరోస్ లాగే ఇది కూడా బాక్సీ డిజైన్, పొడవాటి స్టాన్స్‌తో రానుంది. అయితే ఈవీ వెర్షన్ కోసం ప్రత్యేకంగా రీడిజైన్ చేసిన ఫ్రంట్, రేర్ లుక్, ఏరోడైనమిక్ అలాయ్ వీల్స్, సరికొత్త కలర్ ఆప్షన్స్ ఇవ్వనున్నారు.
ఇంటీరియర్ గ్యాడ్జెట్స్: ఈ కియా సైరోస్ ఈవీలో 30-ఇంచుల భారీ ట్రినిటీ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, డ్యాష్‌క్యామ్, లెవెల్-2 అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండనున్నాయి. దీని బ్యాటరీ, పవర్‌ట్రెయిన్ వివరాలు కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది.
కియా సొరెంటో హైబ్రిడ్..
హైబ్రిడ్ విభాగంలో కియా సొరెంటోను దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకవేళ ఇది లాంచ్ అయితే, భారత్‌లో సెల్టోస్ కంటే పైన.. కియా పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఐసీఈ ఆధారిత ఎస్‌యూవీగా నిలుస్తుంది.
డైమెన్షన్స్, పోటీ: 4,815 ఎంఎం పొడవు, 2,815 ఎంఎం వీల్‌బేస్‌తో ఉండే ఈ త్రీ-రో ఎస్‌యూవీ మార్కెట్లో స్కోడా కొడియాక్, వోక్స్‌వ్యాగన్ టేరాన్, జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
క్యాబిన్ లగ్జరీ: ఇది 6-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభించే అవకాశం ఉంది. పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, బాస్ ఆడియో సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, లెవెల్-2 అడాస్ సూట్‌తో రానుంది.
ఇంజిన్ సామర్థ్యం: ఇందులో సెల్ఫ్-చార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ (హెచ్ఈవీ) టెక్నాలజీని కియా ప్రధానంగా నమ్ముకుంది. అయితే భవిష్యత్తులో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (పీహెచ్ఈవీ) వేరియంట్‌ను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే భారత మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా హైబ్రిడ్ సాంకేతికతకే కియా తొలి ప్రాధాన్యత ఇస్తోంది.
కాగా, కియా లాంచ్ చేయనున్న రెండు కొత్త మోడల్స్ పేర్లు, రిలీజ్ టైమ్‌లైన్, ధరలు సహా ఇతర వివరాలపై క్లారిటీ రావాల్సి ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


