భారత ప్రీమియం ఎస్‌యూవీ మార్కెట్లో సరికొత్త సంచలనానికి తెరదీస్తూ దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్, తన మోస్ట్ అవేటెడ్ 7-సీటర్ ఎస్‌యూవీ ‘కియా సోరెంటో’ను ఇటీవలే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ సోరెంటో డెలివరీలను దేశవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభించింది. ఇప్పటికే మార్కెట్లోకి ప్రవేశించిన ఈ ప్రీమియం కారు ప్రారంభ ధరను రూ. 27.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, టాప్ మోడల్ ధర రూ. 40.39 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. కియా ఇండియా పోర్ట్‌ఫోలియోలోనే మొట్టమొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడల్‌గా 'సోరెంటో' అడుగుపెట్టడం విశేషం.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఉన్న కియా అత్యాధునిక తయారీ కేంద్రంలోనే ఈ భారత్-స్పెసిఫిక్ సోరెంటో ఎస్‌యూవీని రెడీ చేస్తున్నారు. రూ. 25వేల టోకెన్ అమోంట్తో బుకింగ్స్ ఇప్పటికే మొదలైన విషయం తెలిసిందే.
కియా సోరెంటో- స్పోర్టీ లుక్.. అదిరిపోయే డిజైన్!
గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌తో వచ్చిన ఈ కియా సోరెంటో ఎస్‌యూవీ రోడ్డుపై వెళుతుంటే ఎవరైనా చూడాల్సిందే! నిలువుగా ఉండే ఎల్ఈడీ హెడ్‌లాంప్‌లు, 'ఎల్' షేప్ ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు, కియా సిగ్నేచర్ గ్లోస్-బ్లాక్ 'టైగర్ నోస్' గ్రిల్ కారు ముందు భాగానికి రాయల్ లుక్‌ని ఇచ్చాయి. ఇక ప్రొఫైల్ విషయానికి వస్తే భారీ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, వెనుక వైపు ర్యాప్‌అరౌండ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, స్పోర్టీ స్పాయిలర్ దీనికి రగ్గడ్ ఎస్‌యూవీ ఆకారాన్ని ఇచ్చాయి. గ్రావిటీ గ్రే, గ్లేసియర్ వైట్, ఇంపీరియల్ బ్లూ, మ్యాగ్మా రెడ్ వంటి ఎనిమిది ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభ్యమవుతోంది.
హైదరాబాద్‌లో కియా సోరెంటో ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
కియా సోరెంటో- లగ్జరీ ఇంటీరియర్..
{{/usCountry}}హైదరాబాద్‌లో కియా సోరెంటో ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
కియా సోరెంటో- లగ్జరీ ఇంటీరియర్..
{{/usCountry}}కియా సోరెంటో కెబిన్ లోపల 6-సీటర్ (కెప్టెన్ సీట్లు) లేదా 7-సీటర్ లేఅవుట్‌ను ఎంచుకునే వెసులుబాటును కల్పించారు. డ్యాష్‌బోర్డ్ పై డ్యూయల్ స్క్రీన్ సెటప్ ప్రధాన ఆకర్షణ. ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్లను సమగ్రంగా అనుసంధానించారు.
అంతేకాకుండా, భారతదేశంలోనే మొదటిసారిగా జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అధారిత ‘కియా ఏఐ’ సాంకేతికతను ఈ కారులోనే ప్రవేశపెట్టారు. పానోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, స్మార్ట్ పవర్డ్ టెయిల్‌గేట్, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్స్ వంటి సదుపాయాలు ఈ ప్రయాణాన్ని అత్యంత సౌకర్యవంతంగా మారుస్తాయి.
కియా సోరెంటో- భద్రతలో నంబర్ వన్!
ప్రయాణికుల రక్షణకు కియా అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. ఈ ఎస్‌యూవీలో ఏకంగా 10 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, 12 పార్కింగ్ సెన్సార్లు అమర్చారు. అత్యంత కీలకమైన లెవెల్-2 అడాస్ సాంకేతికతతో 30 రకాల అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను అందించడం ద్వారా ఇది ఈ విభాగంలోనే అత్యంత సురక్షితమైన కార్లలో ఒకటిగా నిలిచింది.
కియా సోరెంటో- పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు..
సోరెంటో రెండు శక్తివంతమైన ఇంజిన్ ఎంపికలతో మార్కెట్లోకి వచ్చింది:
1.6-లీటర్ టర్బో-పెట్రోల్ స్ట్రాంగ్-హైబ్రిడ్: పెట్రోల్ ఇంజిన్ 180 పీఎస్ పవర్ ఇవ్వగా, ఎలక్ట్రిక్ మోటార్ 65 పీఎస్ అదనపు పవర్‌ను ఇస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
2.2-లీటర్ డీజిల్ ఇంజిన్: ఇది 193 పీఎస్ పవర్, 442 ఎన్ఎం టాప్ టార్క్‌ను ఉత్పన్నం చేస్తుంది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జతచేశారు.
ఆఫ్-రోడింగ్ ప్రేమికుల కోసం ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) వేరియంట్ అందుబాటులో ఉండటం ఈ ఎస్‌యూవీకి అదనపు ఆకర్షణ.
భారత మార్కెట్లో టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కోడియాక్, ఫోక్స్‌వాగన్ టైరాన్ వంటి ప్రముఖ ఎస్‌యూవీలకు ఈ కియా సోరెంటో గట్టి పోటీనివ్వనుంది.