...
...
Next Story

Kia Sorento : కియా సంచలనం! 7 సీటర్ సోరెంటో ఎస్​యూవీ లాంచ్- ధర, సేఫ్టీ ఫీచర్లు ఇలా..

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా మోటార్స్ తన మోస్ట్ అవైటెడ్ 'సొరెంటో' ఎస్‌యూవీని భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో తయారైన ఈ హైబ్రిడ్ కార్, పవర్‌ఫుల్ ఫీచర్లు మరియు లేటెస్ట్ ఏఐ టెక్నాలజీతో లగ్జరీ కార్ల విభాగాన్ని కుదిపేసేందుకు సిద్ధమైంది.

Published on: Sep 4, 2026, 14:32:29 IST
Advertisement

భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసించే దిశగా కియా ఇండియా మరో సంచలనం సృష్టించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లగ్జరీ ఎస్‌యూవీ ‘కియా సోరెంటో’ను రూ. 27.99 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. టాప్ వేరియంట్ ధర రూ. 40.39 లక్షల వరకు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం తయారీ కేంద్రం నుంచే ఈ వాహనాల ఉత్పత్తి ప్రారంభమైంది. రూ. 25,000 టోకెన్ అమౌంట్‌తో అధికారిక ప్రీ-బుకింగ్స్ కూడా మొదలయ్యాయి.

Kia Sorento
Kia Sorento

ఈ నేపథ్యంలో ఈ కియా సోరెంటో ఎస్​యూవీ విశేషాలను ఇక్కడ తెలుసుకోండి..

కియా సోరెంటో ఎస్​యూవీ ధరలు..

కియా సోరెంటో ధరలు..

ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన ఎంజీ హెక్టర్ టోమాహాక్ పీహెచ్ఈవీ తరహాలోనే, బలమైన హైబ్రిడ్ ఇంజిన్‌తో వస్తున్న సోరెంటో రాకతో భారత్‌లో లగ్జరీ హైబ్రిడ్ కార్ల డిమాండ్ ఒక్కసారిగా ఊపందుకుంది.

అట్రాక్టివ్ డిజైన్.. రాచరికపు లుక్..

కియా సోరెంటో ఎస్​యూవీ క్యాబిన్ లోపలికి అడుగుపెడితే లగ్జరీకి కేరాఫ్ అడ్రస్‌లా కనిపిస్తుంది. 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, మరో 12.3-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో డ్యూయల్-స్క్రీన్ సెటప్ ఇచ్చారు. డిజిటల్ స్క్రీన్లతో పాటు ఫిజికల్ బటన్ల కలయిక యూజర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది.

6, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో ఈ కియా సోరెంటో లభిస్తోంది.

భారతదేశంలో సంస్థ అందిస్తున్న వాహనాల్లోనే తొలిసారిగా ‘జనరేటివ్ కియా ఏఐ’ టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టడం విశేషం. పనోరమిక్ సన్‌రూఫ్, 4-స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, వెంటిలేటెడ్ సీట్లు, సెకండ్ రో సన్‌షేడ్స్, యాంటీ-పించ్ ఫంక్షన్‌తో కూడిన స్మార్ట్ పవర్డ్ టెయిల్‌గేట్ వంటి అత్యున్నత ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కియా సోరెంటో సేఫ్టీలో తిరుగులేదు!

భద్రత విషయంలో కియా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. 10 ఎయిర్‌బ్యాగ్‌లు, 12 పార్కింగ్ సెన్సార్లు, 360-డిగ్రీ కెమెరా, 30 అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న లెవెల్-2 అడాస్ వంటి ఏకంగా 26 ప్రధాన సేఫ్టీ ఫీచర్లను అందించారు.

శక్తివంతమైన పెట్రోల్ హైబ్రిడ్, డీజిల్ ఇంజిన్లు..

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కియా సోరెంటోలో రెండు శక్తివంతమైన ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి:

1.6-లీటర్ టర్బో-పెట్రోల్ స్ట్రాంగ్-హైబ్రిడ్: ఈ పెట్రోల్ ఇంజిన్ తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కలయికతో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. ఇది 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

2.2-లీటర్ డీజిల్ ఇంజిన్: ఇది 193 పీఎస్ పవర్, 442 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8-స్పీడ్ డీసీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించారు.

ఆఫ్‌రోడింగ్ ప్రియుల కోసం ఈ కారులో ఆల్-వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ కూడా లభిస్తోంది.

కియా సోరెంటోకు మార్కెట్లో గట్టి పోటీ..

ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి వచ్చిన కియా సోరెంటో.. టయోటా ఫార్చ్యూనర్, స్కోడా కొడియాక్, ఎంజీ హెక్టర్ టోమాహాక్ పీహెచ్ఈవీ, వోక్స్‌వ్యాగన్ టైరాన్ వంటి దిగ్గజ కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe