భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించేందుకు కియా మోటార్స్ మరో అద్భుతమైన వాహనాన్ని సిద్ధం చేసింది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త కియా సోరెంటో ఎస్‌యూవీ భారతీయ రోడ్లపై ఎలాంటి కేమోఫ్లాజ్ లేకుండా కంటపడింది. సెప్టెంబర్ 4, 2026న అధికారిక లాంచ్‌కు ముందే ఈ ప్రీమియం త్రీ-రో ఎస్‌యూవీ ఎలా ఉందనే దానిపై స్పష్టమైన లుక్ వచ్చేసింది. కియా కంపెనీ ఇటీవల సోరెంటో మొదటి అధికారిక చిత్రాలను విడుదల చేయడంతో పాటు అనంతపురం ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైనట్లు ప్రకటించిన కొన్ని రోజులకే ఈ కారు రోడ్లపై కనిపించడం విశేషం.

ఓ ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియో ద్వారా ఈ తాజా విజువల్స్ బయటకు వచ్చాయి. ఖచ్చితమైన ప్రదేశం అధికారికంగా వెల్లడి కాలేదు కానీ, కియా ఇండియా తయారీ కేంద్రం ఉన్న అనంతపురం చుట్టుపక్కలే ఈ కారును పరీక్షించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎలాంటి కవర్స్ లేకుండా పబ్లిక్ రోడ్లపై పరుగులు పెడుతున్న ఈ సోరెంటో ఎక్స్‌టీరియర్ డిజైన్.. ఎస్‌యూవీ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కియా సోరెంటో ఎస్‌యూవీ- డిజైన్, లుక్స్..
కియా గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌కు అనుగుణంగా సోరెంటో రూపకల్పన ఉంది. ఎత్తైన, దృఢమైన స్టాన్స్ దీనికి ప్రీమియం త్రీ-రో ఎస్‌యూవీ లుక్‌ను తెచ్చిపెట్టింది. ముందు భాగంలో కియా సిగ్నేచర్ అయిన పెద్ద 'టైగర్ నోస్' గ్రిల్ ఉంది. దీనికి త్రీ-డైమెన్షనల్ ప్యాటర్న్‌తో పాటు బ్రష్డ్-అల్యూమినియం ఫినిషింగ్ ఇచ్చారు.
ముందు వైపు నిలువుగా అమర్చిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, కియా 'స్టార్ మ్యాప్' స్ఫూర్తితో రూపొందించిన ఎల్ఈడీ డీఆర్‌ఎల్‌లు ఈ కారుకు ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తున్నాయి. టర్న్ ఇండికేటర్లను అడ్డుగా అమర్చారు. సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే బాక్సీ డిజైన్, మస్క్యులర్ వీల్ ఆర్చ్‌లు, రూఫ్ రెయిల్స్ ఆకట్టుకుంటాయి. ఈ వీడియోలో కనిపించిన కారు డ్యూయల్-టోన్ మెషిన్-కట్ వీల్స్‌ను కలిగి ఉంది. ఇవి 19-అంగుళాల అలాయ్ వీల్స్ అని అంచనా వేస్తున్నారు.
కియా సోరెంటో ఎస్‌యూవీ వెనుక వైపు.. నిలువుగా ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, బలమైన బంపర్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ దీని రోడ్ ప్రెజెన్స్‌ను మరింత పెంచుతున్నాయి.
కియా సోరెంటో ఎస్‌యూవీ- హైబ్రిడ్, డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు..
{{/usCountry}}కియా సోరెంటో ఎస్‌యూవీ వెనుక వైపు.. నిలువుగా ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, బలమైన బంపర్, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్ దీని రోడ్ ప్రెజెన్స్‌ను మరింత పెంచుతున్నాయి.
కియా సోరెంటో ఎస్‌యూవీ- హైబ్రిడ్, డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు..
{{/usCountry}}సోరెంటో కారును హైబ్రిడ్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో భారత్‌లో విక్రయించనున్నట్లు కియా ఇప్పటికే స్పష్టం చేసింది. ముఖ్యంగా హైబ్రిడ్ వెర్షన్ కియా ఇండియాకు చాలా కీలకం కానుంది. ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో రానున్న తొలి కియా హైబ్రిడ్ ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం.
పూర్తి టెక్నికల్ వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే అందిన సమాచారం ప్రకారం హైబ్రిడ్ వెర్షన్‌లో 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను బలమైన హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేయనున్నారు. ఇది సుమారు 238 హెచ్‌పీ పవర్, 380 ఎన్ఎం టార్గ్‌ను అందిస్తుంది. ఇక డీజిల్ వెర్షన్‌లో 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్ ఉండనుంది. ఇది సుమారు 202 బీహెచ్‌పీ పవర్, 440 ఎన్ఎం టార్గ్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. కియా కార్నివాల్‌లో మనం ఇప్పటికే ఈ ఇంజిన్‌ను చూశాము.
అయితే, కియా అధికారికంగా ప్రకటించే వరకు ఈ గణాంకాలను అంచనాలుగానే భావించాలి.
కియా సోరెంటో ఎస్‌యూవీ- ప్రీమియం ఫీచర్లు..
కియా ఇండియా లైనప్‌లోని ఐసీఈ ఎస్‌యూవీల్లో సోరెంటో అగ్రస్థానంలో నిలవనుంది! ఇందులోని ఫీచర్ల జాబితా చాలా పెద్దగా ఉండబోతోంది. డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ బెయిజ్ ఇంటీరియర్, వెంటిలేటెడ్ సీట్లు, మెమరీ ఫంక్షన్‌తో కూడిన ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్లు, బోస్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి హంగులు ఉన్నాయి. అలాగే డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో కూడిన పెద్ద 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
భారత్-స్పెక్ మోడల్‌లో లెవెల్ 2 అడాస్‌తో పాటు అనేక అధునాతన భద్రతా ఫీచర్లు ఉండనున్నాయి. లైవ్ జనరేటివ్ ఏఐ ఆధారిత 'కియా ఏఐ అసిస్టెంట్'ను పరిచయం చేస్తున్నట్లు కియా ప్రత్యేకంగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీని అందుకోనున్న మొదటి సోరెంట్ మోడల్ మన దేశానిదే కావడం గమనార్హం.
కియా సోరెంటో ఎస్‌యూవీ- లాంచ్ వివరాలు..
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో భారత్-స్పెక్ సోరెంటో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది. మొదటి లోకల్ యూనిట్.. ప్రొడక్షన్ లైన్ నుంచి బయటకు వచ్చింది. 2019లో మాస్ ప్రొడక్షన్ ప్రారంభించిన ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం దాదాపు 300,000 యూనిట్లుగా ఉంది.
సెప్టెంబర్ 4, 2026న ఈ కియా సోరెంటో ఎస్‌యూవీ అధికారికంగా మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రీమియం త్రీ-రో సెగ్మెంట్‌లో వస్తున్న ఈ ఎస్‌యూవీ టయోటా ఫార్చునర్, స్కోడా కొడియాక్, వోక్స్వాగన్ టైరాన్, జీప్ మెరిడియన్ వంటి కార్లతో పోటీపడనుంది. అయితే వీటితో పోలిస్తే దీని ధర కాస్త తక్కువగానే ఉంటుందని అంచనాలు ఉన్నాయి.
ఈ సోరెంటో వేరియంట్లు, ధరలు, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు లాంచ్ సమయంలో వెల్లడి కానున్నాయి.