భారత ఆటోమొబైల్ రంగంలో వేగంగా దూసుకుపోతున్న ప్రముఖ కార్ల తయారీ సంస్థ ‘కియా ఇండియా’.. తన అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్లాగ్‌షిప్ 7-సీటర్ ఎస్‌యూవీ ‘కియా సోరెంట్’ను ఇటీవలే అధికారికంగా విడుదల చేసింది. ఎక్స్-షోరూమ్ వద్ద దీని ప్రారంభ ధరను రూ. 27.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లోనే ఈ వాహనాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో స్థానికంగానే తయారు చేయడం విశేషం.

మార్కెట్లో ఉన్న ఎస్‌యూవీ ప్రియులను ఆకట్టుకునేలా కియా దీనిని HTE, HTK, HTX అనే మూడు ప్రధాన వేరియంట్లలో తీసుకొచ్చింది. వీటితో పాటు డార్కర్ లుక్ ఇష్టపడే వారి కోసం 'బ్లాక్ లైన్' ఎడిషన్లను, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ కోరుకునే వారి కోసం 'అడాస్' ప్యాకేజీలను కూడా అందుబాటులో ఉంచింది.
ఈ నేపథ్యంలో కియా సోరెంటో ఎస్‌యూవీలోని ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు లభిస్తున్నాయో వివరంగా చూద్దాము.
కియా సోరెంట్ HTE: బేస్ వేరియంట్‌లోనే ప్రీమియం ఫీచర్లు
సాధారణంగా బేస్ వేరియంట్ అంటే చాలా ఫీచర్లు తగ్గించేస్తుంటారు. కానీ సోరెంట్ HTE ఆరంభ మోడల్ అయినప్పటికీ, వినియోగదారులకు కావలసిన దాదాపు అన్ని ప్రాథమిక వసతులను అందించింది.
ఎక్స్‌టీరియర్ లుక్: 18-ఇంచుల స్టైలిష్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ హెడ్‌లాంప్స్, డోర్ బోర్డులపై ఎల్‌ఈడీ రన్నింగ్ లైట్లు, వెనుక ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్, రూఫ్ రయిల్స్, ఇంటిగ్రేటెడ్ రియర్ స్పాయిలర్ దీనికి రాయల్ లుక్‌ను అందిస్తాయి.
క్యాబిన్ టెక్నాలజీ: ఈ కియా సోరెంటో ఎస్‌యూవీ వేరియంట్ లోపల 12.3-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం 4.2-ఇంచుల కలర్ టీఎఫ్‌టీ డిస్‌ప్లే, 6 స్పీకర్లు మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యం ఉన్నాయి. మూడు వరుసల ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ పోర్టులను ఏర్పాటు చేశారు.
సౌకర్యాలు: డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీట్ కోసం 10-వే పవర్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం 6-వే పవర్ అడ్జస్ట్మెంట్, పానోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి.
{{/usCountry}}సౌకర్యాలు: డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవర్ సీట్ కోసం 10-వే పవర్ అడ్జస్ట్మెంట్, ఫ్రంట్ ప్యాసింజర్ కోసం 6-వే పవర్ అడ్జస్ట్మెంట్, పానోరమిక్ సన్‌రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి.
{{/usCountry}}రక్షణ వ్యవస్థ: మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (టీపీఎంఎస్), ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, రివర్స్ కెమెరా ఉన్నాయి. అదనపు హంగులు లేకుండా 7-సీటర్ సౌకర్యం, రోడ్ ప్రెజెన్స్ కోరుకునే వారికి HTE వేరియంట్ అనుకూలంగా ఉంటుంది.
కియా సోరెంట్ HTK: వ్యాల్యూ ఫర్ మనీ ఛాయిస్!
మీరు కారులో మరింత ఆధునిక సాంకేతికత, ఆడియో ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటే HTK వేరియంట్ ఒక సరైన ఎంపిక.
హైటెక్ క్యాబిన్: కియా సోరెంటోలోని ఈ వేరియంట్‌లో డ్యాష్‌బోర్డ్‌పై రెండు 12.3-ఇంచుల స్క్రీన్లతో కూడిన కర్వ్‌డ్ డిస్‌ప్లే మెరుగైన లుక్‌ను ఇస్తుంది. సంగీతప్రియుల కోసం 12-స్పీకర్ల ప్రీమియం బాస్ సౌండ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరాను జత చేశారు.
కంఫర్ట్ అండ్ సీటింగ్: ముందు సీట్లకు వెంటిలేషన్ (చల్లదనం) సౌకర్యం, 64 రకాల రంగుల్లో మారే యాంబియంట్ లైటింగ్ ఇచ్చారు. ఈ వేరియంట్‌ను 6-సీటర్ (కెప్టెన్ సీట్లతో) లేదా 7-సీటర్ లేఅవుట్‌లో ఎంచుకోవచ్చు.
HTK(A) అడాస్ ప్యాకేజీ: మీకు సేఫ్టీ డ్రైవింగ్ అసిస్టెంట్ కావాలంటే 'HTK(A)' ప్యాకేజీని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో లెవెల్-2 అడాస్ లభిస్తుంది. దీనివల్ల ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, లైన్ కీపింగ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, స్టాప్ అండ్ గో ఫంక్షన్‌తో కూడిన స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ వంటి అధునాతన రక్షణ లభిస్తుంది. ఇక నలుపు రంగు ప్రియుల కోసం బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో 'బ్లాక్ లైన్' ఎడిషన్ కూడా లభిస్తుంది.
కియా సోరెంటో HTX AWD: ఫుల్లీ లోడెడ్ టాప్-ఎండ్ మోడల్
ప్రయాణాల్లో అత్యున్నత లగ్జరీ, నాలుగు చక్రాల డ్రైవింగ్ (ఏడబ్ల్యూడీ) సామర్థ్యం కోరుకునే వారి కోసం HTX వేరియంట్‌ను రూపొందించారు.
లగ్జరీ ఇంటీరియర్: కియా సోరెంటోలోని ఈ వేరియంట్‌లో బ్లాక్ అండ్ ఆలివ్ బ్రౌన్ షేడ్ ఇంటీరియర్ కలర్ థీమ్, పవర్డ్ డిజిటల్ కీ, హెడ్-అప్ డిస్‌ప్లే, డిజిటల్ ఐఆర్‌విఎమ్ (డిజిటల్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్) ఇచ్చారు.
స్మార్ట్ ఫీచర్లు: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత 'జెనరేటివ్- ఏఐ' అసిస్టెంట్, ఫ్రంట్ అండ్ రియర్ ఇన్‌బిల్ట్ డ్యాష్ క్యామ్‌లు, రిమోట్ స్మార్ట్ పార్కింగ్ అసిస్ట్, స్మార్ట్ పవర్ టైల్‌గేట్ వంటి ఆధునిక హంగులు ఉన్నాయి.
ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) సామర్థ్యం: మంచు, బురద, ఇసుక రోడ్లపై వాహనం సజావుగా సాగడానికి వీలుగా స్నో, మడ్, సాండ్ డ్రైవింగ్ మోడ్లతో కూడిన ఏడబ్ల్యూడీ సిస్టమ్‌ను జత చేశారు.
HTX(A) ఏడబ్ల్యూడీ: టాప్-ఎండ్ మోడల్‌లోని HTX(A)లో లెవెల్ 2+ అడాస్ లభిస్తుంది. ఇది ఏకంగా 30 రకాల డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను, 10 ఎయిర్‌బ్యాగ్స్ సేఫ్టీని అందిస్తుంది.
కియా సోరెంటో ఎస్‌యూవీ- మీరు ఏ వేరియంట్ ఎంచుకోవాలి?
ఆటోమొబైల్ నిపుణుల ప్రకారం.. బడ్జెట్‌లో లగ్జరీ ఆశిస్తూ, అత్యుత్తమ ఫీచర్లు కావాలనుకునే వారికి HTK వేరియంట్ చాలా అనుకూలమైనది. ఒకవేళ రోడ్డు భద్రత, డ్రైవర్ అసిస్టెన్స్ ప్రాధాన్యత అనుకుంటే కియా సోరెంటో HTK(A) సరిపోతుంది. లాంగ్ డ్రైవ్‌లు ఎక్కువగా చేసేవారు, ఏ రకమైన రహదారులపైనా సవారీ చేయగల ఆల్-వీల్ డ్రైవ్ కాంబినేషన్ కోరుకునే వారు HTX AWD మోడల్‌ను ఎంచుకోవచ్చు.