భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా మరో కీలక అడుగు వేసింది. మార్కెట్లోకి సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ‘కియా సైరోస్ ఈవీ’ని అధికారికంగా విడుదల చేసింది. రూ. 13.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ఆకర్షణీయమైన ఆరంభ ధరతో ఈ కారును తీసుకొచ్చింది. పెట్రోల్, డీజిల్ సైరోస్ మోడల్‌కు పూర్తి ఎలక్ట్రిక్ రూపంగా వచ్చిన ఇప్పటికే అనేకమందిని ఆకట్టుకుంది.

42 కేడబ్ల్యూహెచ్, 51.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో లభించే ఈ కియా సైరోస్ ఈవీ, ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 526 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని కంపెనీ ప్రకటించింది. ప్రీమియం కాంపాక్ట్ ఈవీ కోరుకునే వారికి, నగర ప్రయాణాలకు ఇది ఒక అద్భుతమైన ఆల్ రౌండర్ కారుగా నిలవనుంది.
మీరు కూడా కొత్త కియా సైరోస్ ఈవీని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, బుకింగ్ చేసుకునే ముందు వేరియంట్ల వారీగా ధరలు, కలర్ ఆప్షన్లు, ఇతర సాంకేతిక వివరాలను ఒకసారి పరిశీలించండి.
కియా సైరోస్ ఈవీ- వేరియంట్ల వారీగా ధరల వివరాలు..
| కియా సైరోస్ ఈవీ- వేరియంట్లు, వాటి ధరలు.. | ||
|---|---|---|
| 42 కేడబ్ల్యూహెచ్ | 51.4 కేడబ్ల్యూహెచ్ | |
| హెచ్టీకే | రూ. 13.50 లక్షలు | - |
| హెచ్టీకే ప్లస్ | రూ. 15 లక్షలు | రూ. 17 లక్షలు |
| హెచ్‌టీఎక్స్ | రూ. 16 లక్షలు | రూ. 18 లక్షలు |
| హెచ్‌టీఎక్స్ ప్లస్ | - | రూ. 19.50 లక్షలు |
| ఎక్స్-లైన్ | - | రూ. 20 లక్షలు |
| *పైన చెప్పినవి అన్నీ ఎక్స్‌షోరూం ధరలు. | ||
కియా సైరోస్ ఈవీ- ఆకట్టుకునే 9 రంగుల్లో అందుబాటులో..
కస్టమర్లను ఆకట్టుకునేలా కియా సైరోస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మొత్తం 9 ప్రీమియం రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు.
- ఐవరీ సిల్వర్ మ్యాట్
- ఫ్రాస్ట్ బ్లూ
- గ్రావిటీ గ్రే
- ప్యూటర్ ఆలివ్
- మాగ్మా రెడ్
- ఐవరీ సిల్వర్ గ్లోస్
- అరోరా బ్లాక్ పెర్ల్
- గ్లేసియర్ వైట్ పెర్ల్
- ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్
కస్టమర్లను ఆకట్టుకునేలా కియా సైరోస్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మొత్తం 9 ప్రీమియం రంగుల్లో అందుబాటులోకి తెచ్చారు.
- ఐవరీ సిల్వర్ మ్యాట్
- ఫ్రాస్ట్ బ్లూ
- గ్రావిటీ గ్రే
- ప్యూటర్ ఆలివ్
- మాగ్మా రెడ్
- ఐవరీ సిల్వర్ గ్లోస్
- అరోరా బ్లాక్ పెర్ల్
- గ్లేసియర్ వైట్ పెర్ల్
- ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్
అయితే, ఇందులో అత్యున్నత వేరియంట్ అయిన ఎక్స్-లైన్ మోడల్ మాత్రం కేవలం అరోరా బ్లాక్ పెర్ల్, ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ రంగుల్లో మాత్రమే లభిస్తుందని కియా తెలిపింది.
కియా సైరోస్ ఈవీ- బ్యాటరీ, రేంజ్, పెర్ఫార్మెన్స్..
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో కియా సంస్థ రెండు రకాల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను ఇచ్చింది:
| కియా సైరోస్ ఈవీ- పవర్ట్రైన్ | ||
|---|---|---|
| బ్యాటరీ ప్యాక్ | 42 కేడబ్ల్యూహెచ్ | 51.4 కేడబ్ల్యూహెచ్ |
| క్లైయిమ్డ్ రేంజ్ (ఎంఐడీసీ Part 1 + Part 2) | 443 కి.మీ | 526 కి.మీ |
| మ్యాక్స్ పవర్ | 133 బీహెచ్పీ | 169 బీహెచ్పీ |
| మ్యాక్స్ టార్క్ | 255 ఎన్ఎం | 255 ఎన్ఎం |
కియా సైరోస్ ఈవీ- ప్రధాన పోటీదారులు ఎవరు?
భారత మార్కెట్లో కాంపాక్ట్, మిడ్‌సైజ్ ఈవీ సెగ్మెంట్ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. కియా సైరోస్ ఈవీ నేరుగా మార్కెట్లో ఉన్న పలు దిగ్గజ కార్లకు పోటీనివ్వనుంది. ప్రధానంగా టాటా నెక్సాన్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ, ఎంజీ విండ్సర్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ ఈవీ, మహీంద్రా బీఈ 6లతో పాటు త్వరలో రాబోతున్న మారుతీ సుజుకీ ఈ-విటారా, టయోటా అర్బన్ క్రూజర్ ఎబెల్లా మరియు విన్ ఫాస్ట్ వీఎఫ్6, వీఎఫ్7 మోడళ్లతో ఇది తలపడనుంది.