మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 417 పాయింట్లు పడి 76,887 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 97 పాయింట్లు కోల్పోయి 23,996 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 864 పాయింట్లు పడి 55,400 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 2,103.74 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 1,712.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 డైలీ ఛార్ట్‌లో మైనర్ అప్పర్ షాడోతో కూడిన చిన్న రెడ్ క్యాండిల్ ఏర్పడింది. ఇది రేంజ్ బౌండ్కి సంకేతం. 23,813 వద్ద సపోర్ట్ కనిపిస్తోంది. 2,4200 వద్ద రెసిస్టెన్స్ కనిపిస్తోంది. అది దాటితే మార్కెట్లోకి బుల్స్ తిరిగి రావొచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.05 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.4శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.90 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}అమెరికా- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధర పెరుగుతూనే ఉంది. బ్రెంట్ క్రూడ్ 0.3శాతం పెరిగి బ్యారెల్‌కి 111.60 డాలర్లకు చేరింది.
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
కార్బోరండమ్ యూనివర్సల్- బై రూ. 968.15, స్టాప్ లాస్ రూ. 934, టార్గెట్ రూ. 1050
ఎస్‌జేవీఎన్- బై రూ. 81.79, స్టాప్ లాస్ రూ. 78.98, టార్గెట్ రూ. 88
కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్- బై రూ. 1724.4, స్టాప్ లాస్ రూ. 1660, టార్గెట్ రూ. 1850
లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ- బై రూ. 1751.9, స్టాప్ లాస్ రూ. 1690, టార్గెట్ రూ. 1900
జేఎస్డబ్లయూ ఎనర్జీ- బై రూ. 580.9, స్టాప్ లాస్ రూ. 558, టార్గెట్ రూ. 630