...
...
Next Story

ఆ లగ్జరీ పెళ్లికి కోట్లల్లో ఖర్చు- డబ్బు వచ్చింది ర్యాపిడో డ్రైవర్​ బ్యాంకు అకౌంట్​ నుంచి!

రాపిడో డ్రైవర్ ఖాతాలో రికార్డు స్థాయిలో రూ. 331 కోట్లకు పైగా డిపాజిట్లు జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. వీటిని ఉదయ్​పూర్​లో లగ్జరీ వెడ్డింగ్​కి వినియోగించినట్టు తెలుసుకున్నారు. 1xBet అక్రమ బెట్టింగ్ రాకెట్ దర్యాప్తులో ఈ మనీ ట్రయల్​ను గుర్తించారు.

Published on: Nov 29, 2025, 05:59:26 IST
Advertisement

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తులో ఒక షాకింగ్​ మనీ ట్రయల్ (డబ్బు ప్రవాహం) వెలుగు చూసింది. ఒక సాధారణ రాపిడో బైక్ డ్రైవర్ బ్యాంక్ ఖాతా నుంచి ఏకంగా ఉదయ్‌పూర్‌లోని తాజ్ అరవల్లి రిసార్ట్‌లో జరిగిన అత్యంత విలాసవంతమైన డెస్టినేషన్ వెడ్డింగ్‌కి నిధులు చేరినట్లు ఈడీ గుర్తించింది1 ఈ పెళ్లి గుజరాత్ యువ రాజకీయ ప్రముఖుడు ఆదిత్య జులాకు సంబంధించినదిగా తెలుస్తోంది. ఈ పెళ్లి గత సంవత్సరం నవంబర్‌లో జరిగింది. అయితే ఈ లగ్జరీ కార్యక్రమానికి ఉపయోగించిన నిధుల మూలంపై ఇప్పుడు తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బైక్ డ్రైవర్ ఖాతాలో రూ. 331.36 కోట్లు డిపాజిట్..

ర్యాపిడో డ్రైవర్​ అకౌంట్​లో రూ. 331 కోట్లు!
ర్యాపిడో డ్రైవర్​ అకౌంట్​లో రూ. 331 కోట్లు!

1xBet అక్రమ బెట్టింగ్ రాకెట్ కేసుపై దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈడీ ఈ షాకింగ్​ వివరాలను కనుగొంది. రాపిడో డ్రైవర్ ఖాతాలోకి ఆగస్టు 2024 నుంచి ఏప్రిల్ 2025 మధ్య కాలంలో నమ్మశక్యం కాని విధంగా రూ. 331.36 కోట్లు డిపాజిట్ అయినట్లు ఈడీ గుర్తించింది.

వధూవరులతో ర్యాపిడో డ్రైవర్‌కు ఎలాంటి సంబంధం లేనప్పటికీ, ఈ ఖాతా నుంచి ఉదయ్‌పూర్ పెళ్లి కోసం రూ. 1 కోటి కంటే ఎక్కువ ఖర్చు చేసినట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.

మ్యూల్ ఖాతాగా వినియోగం: అసలు నిజం

ఇది ఒక మ్యూల్ ఖాతా లాగా పనిచేసిందని అధికారులు చెబుతున్నారు. అంటే, వివిధ అనామక మూలాల నుంచి డిపాజిట్లను స్వీకరించి, ఆ డబ్బును వెంటనే ఇతర అనుమానాస్పద ఖాతాలకు తరలించింది.

ఈ మార్గాల్లో ఒక మార్గం అక్రమ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన బ్యాంక్ ఖాతాకు దారితీసినట్లు ఈడీ కనిపెట్టింది. ఈ లావాదేవీల అసలు మూలాలు, గమ్యస్థానాలను ఈడీ ఇప్పుడు ట్రాక్ చేస్తోంది.

డబ్బుకు సంబంధించిన నిజమైన మూలాన్ని దాచడానికి, పరిశీలన నుంచి తప్పించుకోవడానికి థర్డ్​ పార్టీ ఖాతాను ఉపయోగించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఈ డిపాజిట్ల స్థాయి, డ్రైవర్ ఖాతాను తేలికగా దుర్వినియోగం చేయడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది.

సీనియర్ అధికారి హెచ్చరిక..

ఈ కేసు, అధిక-ఖర్చుతో కూడిన వేడుకలు, ఇతర ఖరీదైన కార్యక్రమాలకు నిధులు సమకూర్చడానికి మ్యూల్ ఖాతాలను ఎలా వాడుకుంటున్నారో తెలియజేస్తుంది. దీనివల్ల అమాయక ప్రజలు అక్రమ కార్యకలాపాలకు ఆర్థిక ముఖద్వారాలుగా మారుతున్నారు.

ప్రజలకు ఈడీ సలహా

ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు తప్పక పాటించాల్సిన సూచనలను ఈడీ జారీ చేసింది:

బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు, యూపీఐ, లేదా నెట్-బ్యాంకింగ్ యాక్సెస్‌ను ఇతరులతో ఎప్పుడూ పంచుకోవద్దు.

తెలియని వ్యక్తుల కోసం చెక్కులు లేదా ఇతర ఆర్థిక పత్రాలపై సంతకాలు చేయవద్దు.

మీ ఖాతాలో ఏవైనా అసాధారణ డిపాజిట్లు, విత్‌డ్రాలు లేదా దుర్వినియోగ ప్రయత్నాలు కనిపిస్తే వెంటనే అధికారులకు రిపోర్ట్ చేయండి.

మీ ఆర్థిక గుర్తింపును ఉపయోగించడానికి డబ్బును ఆఫర్ చేసే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.

మీ పేరు మీద జారీ చేసిన మొబైల్ నంబర్లను ప్రభుత్వ పోర్టల్ tafcop.sancharsaathi.gov.in లో ధృవీకరించుకోండి. మీరు ఉపయోగించని నంబర్లను డీయాక్టివేట్​ చేయండి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks