భారతీయ జీవిత భీమా సంస్థ (LIC) ద్వారా పెన్షన్ లేదా ఆన్యుటీ ప్రయోజనాలు పొందుతున్న వినియోగదారులకు కీలక సూచన. మీ పెన్షన్ సొమ్ము ప్రతి నెలా ఎలాంటి అంతరాయం లేకుండా ఖాతాలో జమ కావాలంటే 'లైఫ్ సర్టిఫికేట్' (Certificate of Existence) సమర్పించడం ఆవశ్యకం. వినియోగదారులు జీవించే ఉన్నారని ధ్రువీకరించుకోవడానికి ఎల్‌ఐసీ ఈ సర్టిఫికేట్‌ను ప్రతి ఏటా కోరుతుంది.
ఎప్పుడు, ఎంత వ్యవధిలో దాఖలు చేయాలి?

ఎల్‌ఐసీ పాలసీ నిబంధనల ప్రకారం.. 'లైఫ్ ఆన్యుటీ' (Life Annuity) ఆప్షన్ ఎంచుకున్న వారు ఏడాదికి ఒకసారి ఈ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అదే సమయంలో 'రిటర్న్ ఆఫ్ క్యాపిటల్' (Return of Capital) ఆప్షన్ ఉన్నవారు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే దీనిని సమర్పించాల్సి ఉంటుంది.
5 సులభమైన స్టెప్స్‌లో ఆన్‌లైన్ దాఖలు
ఇంట్లో ఉండే సులభంగా సర్టిఫికేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్‌ను సమర్పించడానికి ఎల్‌ఐసీ అధికారిక మొబైల్ యాప్‌లో సౌకర్యం కల్పించింది. ఆ ప్రక్రియ వివరాలు:
1. యాప్ డౌన్‌లోడ్: ముందుగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఎల్‌ఐసీ (LIC) అధికారిక యాప్‌ను మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి.
2. సర్టిఫికేట్ ఆప్షన్ ఎంపిక: యాప్ ఓపెన్ చేసి హోమ్ పేజీలో కనిపించే 'Certificate of Existence' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
3. వివరాల నమోదు & లాగిన్: మీ ఆన్యుటీ నంబర్, పాన్ (PAN) వివరాలు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేసి మీ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి.
4. సర్టిఫికేట్ సృష్టి: వివరాలన్నీ సరిగ్గా సరిచూసుకుని, యాప్‌లో కనిపించే సూచనలు పాటిస్తూ సబ్మిట్ చేస్తే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ తయారవుతుంది.
5. డౌన్‌లోడ్ & భద్రపరచడం: పూర్తయిన తర్వాత ఆ సర్టిఫికేట్‌ను పీడీఎఫ్ (PDF) రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా స్క్రీన్‌షాట్ తీసి భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవచ్చు.
లైఫ్ సర్టిఫికేట్లో ఏ ఏ వివరాలు ఉంటాయి?
{{/usCountry}}5. డౌన్‌లోడ్ & భద్రపరచడం: పూర్తయిన తర్వాత ఆ సర్టిఫికేట్‌ను పీడీఎఫ్ (PDF) రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా స్క్రీన్‌షాట్ తీసి భవిష్యత్తు అవసరాల కోసం దాచుకోవచ్చు.
లైఫ్ సర్టిఫికేట్లో ఏ ఏ వివరాలు ఉంటాయి?
{{/usCountry}}ఈ డిజిటల్ పత్రంలో పెన్షనర్ ఐడీ, ఆన్యుటీ రకం, లబ్ధిదారుని పేరు, సర్టిఫికేట్ స్టేటస్ ('SUBMITTED' అని కనిపిస్తుంది), సర్టిఫికేట్ జనరేట్ చేసిన తేదీ, తదుపరి దాఖలు చేయాల్సిన గడువు తేదీ స్పష్టంగా నమోదై ఉంటాయి.
నిపుణుల సలహాలు
సరైన సమయానికి ఈ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయడం వల్ల ఎల్‌ఐసీ నుంచి వచ్చే పెన్షన్ చెల్లింపుల్లో ఎలాంటి ఆలస్యం జరగదు. ఈ ప్రక్రియపై ఏవైనా సందేహాలు ఉంటే ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ https://licindia.in/ ద్వారా అధీకృత అధికారులను లేదా ప్రతినిధులను సంప్రదించవచ్చు.