ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఉద్యోగార్థులకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (LIC HFL) మంచి అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని తమ కార్యాలయాల్లో 232 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ ప్రకటించింది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 1, 2026 వరకు అవకాశం ఉంది. దరఖాస్తుకు సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం, ఫీజు వివరాలను క్రింద తెలుసుకుందాం.
విద్యా అర్హత, వయోపరిమితి
ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏ సబ్జెక్టులోనైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు తమ గ్రాడ్యుయేషన్‌ను అక్టోబర్ 1, 2026 నాటికి పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి విషయానికి వస్తే, దరఖాస్తుదారుల వయస్సు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం
అప్రెంటిస్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఆన్‌లైన్ రాత పరీక్షను నిర్వహిస్తారు. ఈ ఆన్‌లైన్ ఎగ్జామ్‌లో మొత్తం 100 బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQs) ఉంటాయి. గరిష్ఠ మార్కులు 100 కాగా, పరీక్ష వ్యవధి 60 నిమిషాలు (1 గంట) ఉంటుంది.
దరఖాస్తు ఫీజు వివరాలు
అభ్యర్థులు కేటగిరీల వారీగా చెల్లించాల్సిన దరఖాస్తు ఫీజు వివరాలు
- ఎస్సీ (SC), ఎస్టీ (ST), దివ్యాంగులకు (PwBD): రూ. 200 + జీఎస్టీ
- జనరల్, ఈడబ్ల్యూఎస్ (EWS), ఓబీసీ (OBC) కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులకు: రూ. 800 + జీఎస్టీ
- జనరల్, ఈడబ్ల్యూఎస్ (EWS), ఓబీసీ (OBC) కేటగిరీకి చెందిన మహిళలు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు: రూ. 600 + జీఎస్టీ
ఒకసారి చెల్లించిన ఫీజును ఏ కారణం చేతనైనా తిరిగి చెల్లించడం (రిఫండ్ చేయడం) జరగదని ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ స్పష్టం చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తుది గడువులోగా అధికారిక వెబ్‌సైట్ lichousing.com లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
{{/usCountry}}ఒకసారి చెల్లించిన ఫీజును ఏ కారణం చేతనైనా తిరిగి చెల్లించడం (రిఫండ్ చేయడం) జరగదని ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్ స్పష్టం చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆలస్యం చేయకుండా తుది గడువులోగా అధికారిక వెబ్‌సైట్ lichousing.com లో ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
{{/usCountry}}సమగ్ర ప్రకటన కోసం ఇక్కడ క్లిక్ చేయండి.