భారత్‌పై విన్‌ఫాస్ట్ గురి: 2026లో మూడు పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కార్లు లాంచ్..
ప్రముఖ వియత్నాం ఈవీ బ్రాండ్ విన్‌ఫాస్ట్ 2026లో భారత్‌లో మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనుంది. ఇందులో తక్కువ ధరలో లభించే వీఎఫ్3, ఫ్యామిలీ కోసం లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ ఎంపీవీ, స్టైలిష్ వీఎఫ్5 మోడళ్లు ఉన్నాయి. ఆ వివరాలు..
2025 డిసెంబర్ ఈవీ సెల్స్‌లో హ్యుందాయ్, కియా మోటార్స్‌ని వెనక్కి నెట్టి నాలుగో స్థానాన్ని దక్కించుకున్న విన్‌ఫాస్ట్ సంస్థ.. ఇప్పుడు ఇండియాపై తన పట్టును పెంచుకునేందుకు రెడీ అవుతోంది. ఇండియాలో వీఎఫ్6, వీఎఫ్7తో హిట్ కొట్టిన ఈ వియత్నాంకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీ.. 2026లో మొత్తం మూడు ఎలక్ట్రిక్ కార్లను దేశంలోకి దింపాలని ప్లాన్ చేస్తోంది. వీటిల్లో ఒకటి ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎంపీవి కూడా ఉంది. ఈ నేపథ్యంలో విన్‌ఫాస్ట్ కొత్త మోడల్స్ గురించి ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..

విన్‌ఫాస్ట్ కొత్త ఎలక్ట్రిక్ కార్లు..
1. విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్: పెద్ద కుటుంబాల కోసం..
కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి, అలాగే ట్రావెల్ బిజినెస్ చేసే వారికి ఈ విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ఒక అద్భుతమైన ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. ఇది మూడు వరుసల సీటింగ్ కలిగిన ఎలక్ట్రిక్ ఎంపీవీ.
ఎప్పుడు వస్తుంది: 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ధర: ఎక్స్‌షోరూమ్ ధర రూ. 18-20 లక్షల మధ్య ఉండొచ్చు.
ఫీచర్లు: ఇందులో 60.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 201 బీహెచ్పీ మోటార్ ఉంటాయి. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 450 కి.మీ. దూరం ప్రయాణించవచ్చు. విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ 'వీ' ఆకారపు లైట్లు, అత్యాధునిక టచ్‌స్క్రీన్ దీనికి ప్రత్యేక ఆకర్షణ.
డైమెన్షన్స్: దీని పొడవు 4,740 ఎంఎం, వెడల్పు 1,872 ఎంఎం, ఎత్తు 1,728 ఎంఎం.
సేఫ్టీ: ప్రయాణికుల భద్రత కోసం 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్ ఎలక్ట్రిక్ ఎంపీవీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
2. విన్‌ఫాస్ట్ వీఎఫ్3: నగర ప్రయాణాలకు కేరాఫ్ అడ్రస్..
నగరాల్లోని ట్రాఫిక్‌లో సులభంగా ప్రయాణించేందుకు విన్‌ఫాస్ట్ తన కాంపాక్ట్ ఈవీ వీఎఫ్3'ని తీసుకువస్తోంది. ఇది చూడటానికి చిన్నగా ఉన్నా చాలా శక్తివంతమైనది.
ధర: రూ. 8-10 లక్షల బడ్జెట్ ధరలో అందుబాటులోకి రానుంది.
ప్రత్యేకత: దీనికి 191ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, అంటే గుంతల రోడ్లపై కూడా సాఫీగా వెళుతుంది. 18.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ కారు ఫుల్ ఛార్జ్‌పై 200 కి.మీ పైగా రేంజ్ ఇస్తుంది.
లాంచ్ తర్వాత ఎంజీ కామెట్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
3. విన్‌ఫాస్ట్ వీఎఫ్5: ఫీచర్ల ఖజానా..
ఇప్పటికే వియత్నాం, ఇండోనేషియా దేశాల్లో సక్సెస్ అయిన వీఎఫ్5 మోడల్‌ను విన్‌ఫాస్ట్ భారత్‌కు తెచ్చే ఆలోచనలో ఉంది. టాటా పంచ్ ఈవీ కంటే పొడవైనది కావడం వల్ల ఈ ఎలక్ట్రిక్ కారు లోపల స్పేస్ ఎక్కువగా ఉంటుంది.
ఆప్షన్లు: ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఒకటి 268 కి.మీ రేంజ్ ఇస్తే, రెండోది 326 కి.మీ రేంజ్ ఇస్తుంది.
లగ్జరీ ఫీచర్లు: 8-అంగుళాల టచ్‌స్క్రీన్, లెదర్ సీట్లు, కీ-లెస్ ఎంట్రీ, గాలిని శుద్ధి చేసే పీఎం2.5 ఎయిర్ ఫిల్ట్రేషన్ సిస్టమ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
మొత్తానికి, 2026లో భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో విన్‌ఫాస్ట్ ఒక కొత్త విప్లవాన్ని తీసుకురాబోతోంది. సామాన్యుడి బడ్జెట్ ధరలోనే అదిరిపోయే రేంజ్ ఇచ్చే కార్లు వస్తుండటం విశేషం.
ఈ విన్‌ఫాస్ట్ వీఫ్5 ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


