Electric cars : సియెర్రా నుంచి సఫారీ వరకు- టాటా మోటార్స్ నుంచి రాబోతున్న 5 కొత్త ఈవీలు ఇవే..
Tata Sierra EV : భారతదేశపు ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తిరుగులేని రారాజుగా దూసుకెళుతున్న టాటా మోటార్స్ తన హవాను మరింత పెంచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో 5 క్రేజీ ఈవీలను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..
భారతదేశ ఆటోమొబైల్ రంగాన్ని గ్రీన్ ఎనర్జీ వైపు నడిపించడంలో టాటా మోటార్స్ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల విభిన్న అవసరాలకు అనుగుణంగా ఎస్‌యూవీలు, సెడాన్, ఉమ్మడి కుటుంబాల కోసం ప్రత్యేకంగా ఎంపీవీ మోడళ్లను కూడా ఈవీ రూపంలో పరిచయం చేయబోతోంది. రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లను షేక్ చేయబోతున్న టాటా టాప్-5 ఎలక్ట్రిక్ కార్ల వివరాలు, వాటి లాంచ్ టైమ్‌లైన్‌పై ఒక లుక్కేద్దాము..

1. టాటా సియెర్రా ఈవీ..
టాటా మోటార్స్ నుంచి రాబోతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మోడల్ 'సియెర్రా ఈవీ'. 90ల కాలంలో యువతను ఊపేసిన ఐకానిక్ 'సియెర్రా' బ్రాండ్‌ను సరికొత్త మోడరన్ ఈవీ అవతారంలో జూన్ 30, 2026న అధికారికంగా లాంచ్ చేసేందుకు టాటా ముహూర్తం ఖరారు చేసింది.
బాక్సీ షేప్ డిజైన్, కారు వెడల్పుగా ఉండే ఎల్‌ఈడీ లైట్ బార్స్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్‌తో ఈ కారు రోడ్లపై అద్భుతమైన లుక్‌ను ఇవ్వనుంది. కారు లోపల భారీ టచ్‌స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, జేబీఎల్ సౌండ్ సిస్టమ్, లెవెల్ 2 అడాస్ వంటి అధునాతన ఫీచర్లు ఉండనున్నాయి. ఇది 65 కేడబ్ల్యూహెచ్, 75 కేడబ్ల్యూహెచ్ బ్యాట్రీ ప్యాక్ ఆప్షన్లతో, ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీతో రానుంది.
2. టాటా టిగోర్ ఈవీ ఫేస్‌లిఫ్ట్..
టాటా బడ్జెట్ సెడాన్ మోడల్ అయిన టిగోర్ ఈవీ ఈ ఏడాది ఆఖర్లో సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌తో రాబోతోంది. కొత్త తరం డిజైన్‌కు అనుగుణంగా దీని బంపర్, గ్రిల్, లైటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయనున్నారు. క్యాబిన్ లోపల పెద్ద స్క్రీన్, మెరుగైన కనెక్టెడ్ కార్ ఫీచర్లతో పాటు సింగిల్ ఛార్జ్‌పై ఎక్కువ దూరం ప్రయాణించేలా దీని బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా పెంచే అవకాశం ఉంది.
3. టాటా అవిన్యా..
టాటా మోటార్స్ చరిత్రలోనే అత్యంత ప్రీమియం- లగ్జరీ ఎలక్ట్రిక్ కారుగా 'అవినా' నిలవనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపులోగా లేదా వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఇది మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వొచ్చు. టాటాకు చెందిన సరికొత్త ‘జెన్ 3’ ఈవీ ప్లాట్‌ఫారమ్‌పై ఇది రూపుదిద్దుకుంటోంది. విదేశీ లగ్జరీ కార్ బ్రాండ్ 'జాగ్వార్ లాండ్ రోవర్' సాంకేతికతను ఉపయోగించి ఈ కారును తయారు చేస్తుండటం విశేషం.
4. టాటా సఫారీ ఈవీ..
పెద్ద కుటుంబాల కోసం టాటా తన పాపులర్ 7-సీటర్ ఎస్‌యూవీ 'సఫారీ'ని ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకువస్తోంది. ఇది హారియర్ ఈవీ ప్లాట్‌ఫారమ్, బ్యాట్రీ సాంకేతికతను పంచుకోనుంది. టాప్ వేరియంట్లలో డ్యూయల్-మోటార్ సెటప్‌ను అందించనున్నారు. మూడు వరుసల సీటింగ్ సదుపాయంతో లగ్జరీ ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఈవీ ఆప్షన్ కానుంది.
5. సరికొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ..
మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) విభాగంలో మారుతీ సుజుకీ ఎర్టిగా, కియా కారెన్స్ వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేందుకు టాటా ఒక సరికొత్త 3-రో ఎలక్ట్రిక్ ఎంపీవీని డెవలప్ చేస్తోంది. కంపెనీ ఇప్పటివరకు దీని పేరును లేదా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఇది పూర్తిగా ఫ్యామిలీ యూజర్లను టార్గెట్ చేస్తూ బడ్జెట్ ధరలో ఎక్కువ స్పేస్, ప్రాక్టికాలిటీతో రానున్నట్లు సమాచారం.
రానున్న రోజుల్లో ఈ మోడల్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


