Mahindra Scorpio N facelift : సరికొత్త లుక్, సన్‌రూఫ్‌తో.. మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్!

Scorpio N facelift : భారతీయ రోడ్లపై మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ మరోసారి టెస్టింగ్ చేస్తూ కనిపించింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో లీకైన తాజా స్పై చిత్రాల ప్రకారం.. ఈ లగ్జరీ ఎస్‌యూవీ సరికొత్త ఇంటీరియర్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్-2 అడాస్ ఫీచర్లతో త్వరలోనే లాంచ్ కానుందని తెలుస్తోంది.

Published on: Jun 12, 2026, 10:01:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న 'బిగ్ డాడీ ఆఫ్ ఎస్‌యూవీ' మహీంద్రా స్కార్పియో ఎన్.. సరికొత్త హంగులతో మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 2022లో మొదటిసారిగా విడుదలైన ఈ పవర్‌ఫుల్ లాడర్-ఫ్రేమ్ ఎస్‌యూవీ.. ఇప్పుడు మిడ్-సైకిల్ అప్‌డేట్ (ఫేస్‌లిఫ్ట్) వైపు అడుగులు వేస్తోంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్ ఇదిగో..
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్ ఇదిగో..

ఇటీవల రాజస్థాన్‌లోని జైసల్మేర్ పరిసర ప్రాంతాల్లో ఈ సరికొత్త మోడల్‌ను తీవ్రమైన ఎండల్లో, విభిన్న రోడ్లపై మహీంద్రా సంస్థ టెస్టింగ్ చేస్తుండగా ఆటోమొబైల్ ప్రియుల కంట పడింది. ఈ స్పై చిత్రాలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్- ఫ్రంట్ లుక్‌లో కీలక మార్పులు..

లీకైన వివరాల ప్రకారం.. రాబోయే స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్ ముందు భాగంలో సరికొత్త డిజైన్ మార్పులు కనిపించనున్నాయి. మహీంద్రా గతేడాది ప్రదర్శించిన ‘విజన్.ఎస్’ కాన్సెప్ట్ కార్ ఆధారంగా హారిజాంటల్ స్లాట్స్ కలిగిన సరికొత్త ఫ్రంట్ గ్రిల్‌ను ఇందులో అమర్చినట్లు తెలుస్తోంది. దీనితో పాటు ఫ్రంట్ బంపర్, హెడ్‌ల్యాంప్స్, ఎయిర్ ఇన్‌టేక్ ఏరియాను మరింత స్టైలిష్‌గా రీడిజైన్ చేశారు. ఈ మార్పులు కారుకు పాత లుక్‌ను చెడగొట్టకుండానే మరింత ప్రీమియం, అగ్రెసివ్ అప్పీల్‌ను ఇస్తాయని నిపుణులు భావిస్తున్నారు.

కారు పక్క భాగంలో కొత్తగా డిజైన్ చేసిన 18-ఇంచుల అలాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్స్, బంపర్‌లో స్వల్ప మార్పులు మినహా ప్రస్తుత మోడల్ లాగే భారీ బాడీ లైన్స్‌ను ఇది కలిగి ఉంది. టెస్టింగ్ వాహనం పూర్తిగా కప్పి ఉంచినప్పటికీ, ఇది పూర్తి రీడిజైన్ కాదని, కేవలం స్మార్ట్ అప్‌గ్రేడ్ మాత్రమేనని స్పష్టమవుతోంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్- అదిరిపోయే ఇంటీరియర్.. సరికొత్త ఫీచర్లు!

బడా ఎస్​యూవీ వెలుపలి భాగం కంటే క్యాబిన్ (ఇంటీరియర్) లోనే మహీంద్రా విప్లవాత్మక మార్పులు చేయబోతోంది. కారు డాష్‌బోర్డ్ లేఅవుట్‌ను పూర్తిగా మార్చేశారు. ఇప్పటివరకు ఉన్న వర్టికల్ (నిలువు) ఏసీ వెంట్స్ స్థానంలో సరికొత్త హారిజాంటల్ (అడ్డంగా ఉండే) ఏసీ వెంట్స్ రానున్నాయి.

అన్నింటికంటే ముఖ్యంగా, ప్రస్తుతం డ్యాష్‌బోర్డ్‌లో కలిసిపోయి ఉండే చిన్న స్క్రీన్ స్థానంలో.. థార్ రాక్స్ తరహాలో 10.25-ఇంచుల పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను తీసుకురానున్నారు. అలాగే, డ్రైవర్ డిస్‌ప్లే కోసం సెమీ-డిజిటల్ మీటర్‌ను తీసేసి, పూర్తిగా 10.25-ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చనున్నారు.

ప్రస్తుత స్కార్పియో ఎన్​లో సింగిల్-పేన్ సన్‌రూఫ్ మాత్రమే ఉంది. కానీ కస్టమర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో భారీ పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించనున్నారు. అంతేకాకుండా, టెస్టింగ్ వాహనం విండ్‌స్క్రీన్‌పై కెమెరాలు, బంపర్ వద్ద రాడార్ మాడ్యూల్స్ కనిపించాయి. దీన్ని బట్టి చూస్తే, సేఫ్టీ పరంగా అత్యంత కీలకమైన లెవెల్ 2 అడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) ఫీచర్లను మహీంద్రా మరిన్ని వేరియంట్లలో అందుబాటులోకి తేనున్నట్లు స్పష్టమవుతోంది. దీనితో పాటు 360-డిగ్రీల కెమెరా కూడా రానుంది.

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్​లిఫ్ట్- ఇంజిన్ సామర్థ్యంలో మార్పులు లేవు

సాంకేతిక, ఫీచర్ల పరంగా ఇన్ని అప్‌డేట్స్ వస్తున్నప్పటికీ.. ఇంజిన్ ఆప్షన్లలో మాత్రం మహీంద్రా ఎలాంటి మార్పులు చేయడం లేదు. ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న పవర్‌ఫుల్ ఇంజిన్లనే ఇందులోనూ కొనసాగించనున్నారు.

పెట్రోల్ ఇంజిన్: 200 బీహెచ్​పీ పవర్‌ను జనరేట్ చేసే 2.0-లీటర్ mStallion టర్బో-పెట్రోల్ ఇంజిన్.

డీజిల్ ఇంజిన్: విభిన్న ట్యూనింగ్ ఆప్షన్లతో వచ్చే 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజిన్.

ఇవి 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి. అలాగే, అడ్వెంచర్ ప్రియుల కోసం డీజిల్ టాప్ వేరియంట్లలో పవర్‌ఫుల్ 4x4 (ఫోర్-బై-ఫోర్) డ్రైవ్‌ట్రెయిన్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. పండుగ సీజన్ నాటికి ఈ సరికొత్త స్కార్పియో ఎన్ భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గాల అంచనా.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More