హైదరాబాద్/న్యూఢిల్లీ: కొత్త ఏడాది 2026 మొదటి రోజే వ్యాపార వర్గాలకు చమురు సంస్థలు గట్టి షాక్ ఇచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల ఒడిదుడుకుల నేపథ్యంలో, 19 కిలోల వాణిజ్య (కమర్షియల్) గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ పెరిగిన ధరలు జనవరి 1, 2026 నుంచే అమల్లోకి వచ్చాయి.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో కమర్షియల్ సిలిండర్ ధరపై దాదాపు రూ. 111 మేర అదనపు భారం పడింది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, ఇతర వాణిజ్య అవసరాల కోసం గ్యాస్ వాడే వారికి ఈ పెంపు భారంగా మారనుంది.
ప్రధాన నగరాల్లో తాజా ధరలు ఇలా ఉన్నాయి:
ప్రభుత్వ రంగ చమురు సంస్థల తాజా సవరణ తర్వాత వివిధ నగరాల్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ కొత్త ధరలు (రూపాయల్లో) ఇలా ఉన్నాయి:
- ఢిల్లీ: అంతకుముందు రూ. 1,580.50 ఉండగా, ఇప్పుడు రూ. 1,691.50కి చేరింది.
- ముంబై: పాత ధర రూ. 1,531.50 నుంచి రూ. 1,642.50కి పెరిగింది.
- కోల్‌కతా: రూ. 1,684 నుంచి రూ. 1,795కి ఎగబాకింది.
- చెన్నై: అత్యధికంగా రూ. 1,739.50 నుంచి రూ. 1,849.50కి చేరింది.
- హైదరాబాద్: నగరంలో కమర్షియల్ సిలిండర్ ధర రూ. 1,912.50కి పెరిగింది. (గతంలో ఇది రూ. 1,801.50 గా ఉండేది).
గృహ వినియోగదారులకు ఊరట
వ్యాపార అవసరాలకు వాడే గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ, సామాన్యుడి వంటింట్లో వాడే 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. వీటి ధరలను చివరిసారిగా ఏప్రిల్ 8, 2025న సవరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అవే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 853 ఉండగా, హైదరాబాద్‌లో రూ. 905 వద్ద స్థిరంగా ఉంది.
గత నెలను పరిశీలిస్తే..
గతేడాది అంటే 2025 డిసెంబర్లో కమర్షియల్ గ్యాస్ ధరలను చమురు సంస్థలు స్వల్పంగా తగ్గించాయి. అప్పట్లో ఢిల్లీ, కోల్కతాలో రూ. 10.. ముంబై, చెన్నైలలో రూ. 11 చొప్పున ధరలు తగ్గాయి. అయితే, కొత్త ఏడాది ఆరంభంలోనే ఏకంగా రూ. 111 పెంచి ఆ ఉపశమనాన్ని ఆవిరి చేసేశాయి.
{{/usCountry}}గతేడాది అంటే 2025 డిసెంబర్లో కమర్షియల్ గ్యాస్ ధరలను చమురు సంస్థలు స్వల్పంగా తగ్గించాయి. అప్పట్లో ఢిల్లీ, కోల్కతాలో రూ. 10.. ముంబై, చెన్నైలలో రూ. 11 చొప్పున ధరలు తగ్గాయి. అయితే, కొత్త ఏడాది ఆరంభంలోనే ఏకంగా రూ. 111 పెంచి ఆ ఉపశమనాన్ని ఆవిరి చేసేశాయి.
{{/usCountry}}ఈ ధరల పెంపు వల్ల బయట ఆహార పదార్థాల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.